E-Paper
Advertisement

Actress Meena: ఏ హీరో విడాకులు తీసుకున్నా.. నా పెళ్లికి ముడిపెడుతున్నారు.. రెండో పెళ్లిపై మీనా

Actress Meena: ఏ హీరో విడాకులు తీసుకున్నా.. నా పెళ్లికి ముడిపెడుతున్నారు.. రెండో పెళ్లిపై మీనా
Advertisement

Actress Meena: నటి మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌ గా మీనా ఫాలోయింగే వేరు. మెగాస్టార్‌ చిరంజీవి, వెంకటేష్‌, నాగార్జున, బాలకృష్ణ, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ వంటి ఎంతోమంది సూపర్‌ స్టార్‌ సరసన హీరోయిన్‌గా నటించి దక్షిణాదిలో మంచి గుర్తింపు పొందింది. తన అందం, అభినయంతో ఎంతోమందిని ఆకట్టుకుంది. అలా తెలుగు, తమిళ్‌, కన్నడ భాషలో నటించి మంచి ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది. ఒకప్పుడు హీరోయిన్‌ వందల సినిమాలు చేసిన మీనా ప్రస్తుతం తల్లి పాత్రలు, సహాయ పాత్రలు చేస్తూ రాణిస్తుంది.

90’s స్టార్‌ హీరోయిన్‌

ఇటీవల ఆమె నటించని ద్రశ్యం మూవీ ఎంతపెద్ద హిట్‌ అయ్యిందో తెలిసిందే. మలయాళంలో మోహన్‌ లాల్‌ సరసన నటించిన మీనా ఇదే మూవీ రీమేక్‌ కి తెలుగులో వెంకటేష్‌తో జతకట్టింది. మలయాళం, తెలుగులో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. అలా నటిగా ఇటూ ప్రొఫెషనల్‌, అటూ పర్సనల్‌ లైఫ్‌ని బ్యాలెన్స్‌ చేస్తూ ముందుకు వెళ్తున్న ఆమెకు కోవిడ్‌ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కరోనా బారిన పడిన ఆమె భర్త విద్యాసాగర్‌ పోస్ట్ కోవిడ్‌ సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే. 2022 జూన్‌లో మీనా భర్త చనిపోయాడు. అప్పటి నుంచి కూతురిని సింగిల్‌ పెరేంట్‌గా చూసుకుంటు ఒంటరిగా జీవిస్తుంది. కూతురి ఆలనా పాలన చూసుకుంటూనే మరోవైపు సినిమాల్లో నటిస్తుంది.

రూమర్స్‌ పై అసహనం

Advertisement

ఇలా తన పర్సనల్‌, ప్రొఫెషనల్స్‌ లైఫ్‌ తో బిజీగా ఉన్న మీనాని తరచూ రెండో పెళ్లి రూమర్స్‌ వెంటాడుతున్నాయి. గత కొంతకాలంగా నటి మీనా రెండో పెళ్లి వార్తలు హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. తరచూ రెండో పెళ్లితో వార్తల్లో నిలుస్తోంది. వీటిని తను ఖండించిన వార్తలకు మాత్రం చెక్‌ పడటం లేదు. తాజాగా మరోసారి మీనా తన రెండో పెళ్లి వార్తలపై స్పందించింది. “ఈ జనాలకు ఎందుకు నా పెళ్లి అంత ఆసక్తి అర్థం అవ్వడం లేదు. ఎప్పుడూ నా పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. నాకు లేని ఇంట్రెస్ట్‌ వీళ్లకు ఏంటో తెలియడం లేదు. ప్రస్తుతం నేను నా కూతురితో చాలా హ్యాపీగా జీవిస్తున్నా. నాకు మరో పెళ్లి ఆలోచనే లేదు. కానీ, మీనా రెండో పెళ్లంటూ ఎప్పుడు ఏదోక రకంగా నా గురించి మాట్లాడుకుంటూనే ఉంటున్నారు.

Also Read: Dhanush: ధనుష్‌ లుక్‌పై బాలీవుడ్‌ డైరెక్టర్ షాకింగ్‌ కామెంట్స్‌.. అంతమాట అనేశాడేంటి!

అతడి కామెంట్స్‌ వైరల్‌

Advertisement

ఏ హీరో విడాకులు తీసుకున్నా నా పెళ్లితో ముడిపెడుతున్నారు. ఆ నటుడిని మీనా రెండో పెళ్లి చేసుకుంటుందంటూ తరచూ నాపై ప్రచారం చేస్తున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం నటిగా మంచి అవకాశాలు వస్తున్నాయి. నటిగా పాత్రకు ప్రాధాన్యం ఉన్న కథలను ఎంచుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. కాగా గతంలో తమిళ సినీ క్రిటిక్, నటుడు మీనా రెండో పెళ్లి ఓ ఇంటర్య్వూలో కామెంట్స్‌ చేయడంతో అవి ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఇటీవల భార్యతో విడాకులు తీసుకున్న ఓ పాన్‌ ఇండియా హీరోని, త్వరలోనే మీనా రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ ఒపెన్‌ కామెంట్స్‌ చేశాడు. అప్పటి నుంచి మీనా రెండో పెళ్లి వార్తలు ఊపందుకున్నాయి. ఇక ఆ పాన్‌ ఇండియా హీరో ఎవరా? అని తీయగా.. అంత ధనుష్‌ అయ్యింటాడంటూ అభిప్రాయపడుతున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×