// // Actress Meena Daughter: నటి మీనా కూతురు లేటెస్ట్ లుక్ చూశారా? -->
E-Paper
Advertisement

Meena Daughter: నటి మీనా కూతురిని చూశారా? హీరోయిన్లను మించిన అందం.. ఎంత ముద్దుగుందో!

Meena Daughter: నటి మీనా కూతురిని చూశారా? హీరోయిన్లను మించిన అందం.. ఎంత ముద్దుగుందో!
Advertisement

Actress Meena Daughter Nainika: ఇండస్ట్రీలో స్టార్‌ వారసులు రావడం సర్వసాధారణ విషయం. ఇప్పటికే ఎంతో స్టార్‌ హీరోహీరోయిన్ల పిల్లలు ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు నటి మీనా కూతురి వంతు ఎప్పుడు వస్తుందా అంటున్నారు. నిన్న క్రిస్మస్‌ సందర్భంగా మీన కూతురు ఒక ఫోటో షేర్‌ చేసింది. ఇందులో తన తల్లి (మీనా) కూర్చిలో కూర్చుని ఉండగా.. ఆమె కూతురు పక్కన నిలబడి క్యూట్‌గా ఫోటోకు ఫోజులు ఇచ్చింది. ఇందులో ఆమె చూసి అంత షాక్‌ అవుతున్నారు. ఏంటీ? మీనా కూతురు అప్పుడే ఇంత పెద్దది అయ్యిందా అని కామెంట్స్‌ చేస్తున్నారు.

వైరల్ గా మీనా కూతురు ఫోటో

Advertisement

మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 90’sలో స్టార్‌ హీరోయిన్‌గా దక్షిణాది ఓ వెలుగు వెలిగారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, మోహన్‌ లాల్‌, మమ్ముట్టి వంటి అగ్ర హీరోల సరసన నటించి స్టార్‌ హీరోయిన్‌గా మారారు. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్‌ తీసుకున్న ఆమె ఆ తర్వాత కొన్ని రోజులకు రీఎంట్రీ ఇచ్చారు. అదే టైంలో తన కూతురు నైనికని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. 2016లో వచ్చిన విజయ్‌ ‘తెరి‘ చిత్రంలో నైనిక బాలనటిగా తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో తన నటనకు మంచి మార్కులు బట్టాయి.

చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ

చైల్డ్‌ ఆర్టిస్టుగా తన క్యూట్‌ క్యూట్‌ స్మైల్‌, డైలాగ్స్‌ తో ఆడియన్స్‌ ఆకట్టుకుంది. అంతేకాదు మూవీ ప్రమోషన్స్‌లోనూ తన స్పిచ్‌తో అదరగొట్టింది. అలా లైమ్‌లైట్లోకి వచ్చిన నైనిక.. ఆ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. చిన్నప్పుడు వరుసగా కూతురి ఫోటోలు షేర్‌ చేసిన మీనా.. ఈ మధ్య అసలు కూతురిని చూపించడం లేదు. ఆమె ఫోటోలు షేర్‌ చేసి కూడా చాలా కాలం అవుతుంది. తన భర్త విద్యా సాగర్‌ మరణంతో కూతురి నైనికతో జీవిస్తున్న మీనా ఇటీవల సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది. మీనా కూతురు నైనిక ప్రస్తతం తన స్టడీస్‌పై ఫోకస్‌ పెట్టింది. ప్రస్తుతం ఇంటర్మిడియట్‌కి చేరుకున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Also Read: Director BVS Ravi: నిండుగా బట్టలేసుకున్న చేతులేస్తారు.. అది మగాడి రుగ్మత.. డైరెక్టర్‌ షాకింట్‌ ట్వీట్‌!

మీనా క్రిస్మస్ సెలబ్రేషన్స్

ఈ క్రమంలో గురువారం (డిసెంబర్ 25) క్రిస్మస్‌ సందర్భంగా తల్లితో దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో నైనికను చూసి అంత షాక్‌ అవుతున్నారు. మొన్నటి వరకు చైల్డ్‌ ఆర్టిస్టుగా అందరిలో మనసులో నిలిచిన నైని.. ఇప్పుడు ఇంత అందంగా తయారైందా? అంటున్నారు. అచ్చం తల్లిలాగే ఎంతో ముద్దుగా ఉందని, తల్లిని మించిన అందంగా ఉందంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. మరి నైనికా తల్లి బాటలోనే హీరోయిన్‌ అవుతుందా? బాగా చదవి జాబ్‌లో సెటిలవుతుందా తెలియాలి. కానీ, మీనా మాత్రం ఎప్పుడు తన కూతురి రీఎంట్రీపై మాత్రం స్పందించలేదు. ఈ ఫోటో చూసి నైనిక ఇండస్ట్రీ ఎంట్రీపై ఫ్యాన్స్‌, నెటిజన్స్‌ మాత్రం సోషల్‌ మీడియాలో తెగ చర్చ జరుపుతున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×