E-Paper
Advertisement

Thiruveer: తండ్రైన టాలీవుడ్ హీరో.. ఫోటో చూశారా ఎంత క్యూట్ గా ఉందో!

Thiruveer: తండ్రైన టాలీవుడ్ హీరో.. ఫోటో చూశారా ఎంత క్యూట్ గా ఉందో!
Advertisement

Thiruveer: టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు ఇటీవల అభిమానులకు వరుసగా శుభవార్తలను తెలియజేస్తున్నారు. సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టగా మరి కొంతమంది తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే.. అయితే తాజాగా టాలీవుడ్ హీరో తిరువీర్ (Thiruveer)సోషల్ మీడియా వేదికగా అభిమానులకు గుడ్ న్యూస్ తెలియజేశారు. తిరువీర్ తండ్రిగా ప్రమోట్ అయిన విషయాన్ని ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులతో తన సంతోషాన్ని పంచుకున్నారు.

నాయినొచ్చిండు…

ఈ క్రమంలోని తిరువీర్ తన కొడుకు చేతిని పట్టుకొని ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ “నాయినొచ్చిండు” అంటూ ఈ ఫోటోని షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా తన తండ్రి తిరిగి తన కొడుకుగా పుట్టారని ఈయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా ఈ హీరోకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తిరువీర్ కల్పన అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక మొదటి సంతనంగా ఈ దంపతులకు కుమారుడు జన్మించడంతో ఈ దంపతుల సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇక ప్రస్తుతం హీరోగా తిరువీర్ వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో సినిమా..

Advertisement

తిరువీర్ హైదరాబాద్ కి చెందిన కుర్రాడిగా అందరికీ సుపరిచితమే కెరియర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన ఈయన ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలలో నటిస్తున్నారు. జార్జి రెడ్డి, జగదీశ పరేషాన్ మసూద వంటి సినిమాలతో ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న తిరువీర్ ఇటీవల ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకోవడంతో ఈయనకు తదుపరి వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.

Advertisement

ఫ్రీ వెడ్డింగ్ షో అనంతరం తిరువీర్ భరత్ భూషణ్ డైరెక్షన్లో మరో సినిమాకు కమిట్ అయ్యారని తెలుస్తోంది.గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ మూవీలో ఐశ్వర్య రాజేశ్‌ హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుందని తెలుస్తుంది. ఈ సినిమాతో పాటు ఈయన మరో సినిమాకు కూడా కమిట్ అయ్యారని సమాచారం. రచయిత కృష్ణ చేపూరి దర్శకత్వంలో తిరువీర్ ఆశికా రంగనాథ్ హీరో హీరోయిన్లుగా మరో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని, ఈ సినిమాకు ఎస్కేన్ నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుందని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారకంగా వెల్లడి కానున్నాయి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×