E-Paper
Advertisement

డెలివరీ బాయ్ గా మారిన యాక్టర్ నందు…అసలేం జరిగిందంటే?

డెలివరీ బాయ్ గా మారిన యాక్టర్ నందు…అసలేం జరిగిందంటే?
Advertisement

Actor Nandu: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఇప్పటికే పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోవడం కోసం ఆరాటపడుతున్న వారిలో యువ నటుడు శ్రీ నందు (Shree Nandu)ఒకరు. ఈయన ఇదివరకు ఎన్నో సినిమాలలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశారు అలాగే హీరోగా పలు సినిమాలలో నటించినప్పటికీ కూడా ఈయనకు సరైన సక్సెస్ మాత్రం రాలేదని చెప్పాలి. విభిన్నమైన సినిమా కథలను ఎంపిక చేసుకుంటూ శ్రీ నందు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక త్వరలోనే ఈయన నటించిన అగ్లీ స్టోరీ(Ugly Story) అనే సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

అగ్లీ స్టోరీ ప్రమోషన్లలో నందు..

శ్రీ నందు, చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికాగో ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం అగ్లీ స్టోరీ.రియా జియా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి లక్కీ మీడియా బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రణవ స్వరూప్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మే 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్, సాంగ్స్ కూడా విడుదల చేశారు. ఇటీవల ఈ సినిమా నుంచి ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్ వీడియో సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది. ఇటీవల కాలంలో హీరోలు తమ సినిమాలను విభిన్న రీతిలో ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

బ్లింకిట్ బైక్ పై డెలివరీ బాయ్ గా ..

Advertisement

ఇలా తమ సినిమాలను ప్రేక్షకుల వరకు తీసుకెళ్లడం కోసం హీరోలు సరికొత్త అవతారాలు ఎత్తుతూ పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహిస్తూ వస్తున్నారు. తాజాగా నటుడు నందు సైతం ఈ సినిమా కోసం ఏకంగా డెలివరీ బాయ్ గా మారిపోయారు. ఈ సినిమా మే 22వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో చిన్న పాంప్లెట్స్ తయారు చేయించి ఈయన బ్లింకిట్ బైక్ పై డెలివరీ బాయ్ గా మారి తన సినిమాని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

ఇక ఈయన డెలివరీ బాయ్ గా రోడ్లపై వెళ్తున్న నేపథ్యంలో అభిమానులు తనని గుర్తించి పిలవడంతో తన సినిమా విడుదల తేదీకి సంబంధించిన పాంప్లెట్స్ పంచుతూ అగ్లీ స్టోరీ సినిమా మే 22వ తేదీ విడుదలవుతుంది కచ్చితంగా చూడాలి అంటూ చెప్పుకు వస్తున్నారు. ప్రస్తుతం నందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక అవికా గోర్ చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమయ్యారు. అనంతరం ఈమె ఉయ్యాల జంపాల అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న అవికా గోర్(Avika Gor) అనంతరం పలు తెలుగు సినిమాలలో నటించారు ఇటీవల పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత నటించిన అగ్లీ స్టోరీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Also Read: విజయ్ ప్రమాణ స్వీకారం.. త్రిష ఫస్ట్ పోస్ట్ వైరల్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×