// // Tollywood: కన్న కొడుకునే చనిపోవాలని కోరుకున్న స్టార్ నటుడు! - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Tollywood: కన్న కొడుకునే చనిపోవాలని కోరుకున్న స్టార్ నటుడు.. ఎవరు ?ఎందుకో తెలుసా?

Tollywood: కన్న కొడుకునే చనిపోవాలని కోరుకున్న స్టార్ నటుడు.. ఎవరు ?ఎందుకో తెలుసా?
Advertisement

Tollywood:ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటారు. కానీ, సీనియర్ నటుడు ప్రసాద్ బాబు మాత్రం తన కొడుకు తనకంటే ముందే చనిపోవాలని దేవుడిని ప్రార్థించారట. వినడానికి షాకింగ్‌గా ఉన్నా, దీని వెనుక ఒక తండ్రి పడిన ఆవేదన, అంతులేని ప్రేమ దాగి ఉన్నాయి. దాదాపు 1500 సినిమాల్లో నటించిన ఈ విలక్షణ నటుడు, తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న అత్యంత విషాదకరమైన సంఘటనను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకుని అందరినీ కన్నీరు పెట్టించారు.

మానసిక వైకల్యం.. ఒక తండ్రి తపన: 

ప్రసాద్ బాబు పెద్ద కొడుకు పుట్టుకతోనే మానసిక వికలాంగుడు. మాటలు కూడా రావు. మేనరికం పెళ్లి చేసుకోవడం వల్లే తన కొడుకు ఇలా పుట్టాడని ప్రసాద్ బాబు ఇప్పటికీ బాధపడుతుంటారు. అయితే తన కొడుకు ఎప్పుడూ తక్కువ కాకూడదని, ప్రతి సినిమా షూటింగ్‌కు తనతో పాటే తీసుకెళ్లేవారట. ఇక తన కొడుకుని ఒక కళాకారుడిగా చూడాలనే ఆశతోనే ‘సాహస బాలలు’ అనే సినిమా తీశారు. ఆ సినిమాకు బంగారు నంది అవార్డు కూడా వచ్చింది. కొడుకుపై ఉన్న ప్రేమే ఆయన్ని దర్శకుడిగా మార్చింది.

30 ఏళ్ల వయసులో ఊహించని మరణం:

Advertisement

తన కొడుకుకు 30 ఏళ్లు వచ్చినప్పుడు ఒక వేసవి కాలంలో క్రికెట్ ఆడుతుండగా వడదెబ్బ తగిలింది. గ్రౌండ్‌లోనే గుండెపోటు రావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఆ వార్త విన్నప్పుడు ప్రసాద్ బాబు కుప్పకూలిపోలేదు సరే కదా, భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారట. ఇక తన కళ్ల ముందే కొడుకు ప్రాణాలు వదిలినందుకు ఒక తండ్రిగా ఆయనకు ఎంతో బాధ ఉన్నా, మరోవైపు ఒక పెద్ద భయం నుండి విముక్తి లభించినట్లు అనిపించిందని ఆయన ఆవేదనగా చెప్పుకొచ్చారు.

నేను లేకపోతే వాడిని ఎవరు చూస్తారు?:

ప్రసాద్ బాబు మనసులో ఉన్న పెద్ద భయం ఏంటంటే.. “నేను బతికున్నంత కాలం నా కొడుకుని కంటికి రెప్పలా చూసుకుంటాను. కానీ, రేపు నేను చనిపోయాక వాడిని ఎవరు చూస్తారు? ఎవరైనా సరిగ్గా భోజనం పెడతారా? వాడిని సరిగ్గా చూసుకుంటారా?” అనే ఆలోచన ఆయన్ని నిద్రపోనిచ్చేది కాదు. ఇక అందుకే, ఆ అనాథ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే కొడుకు తనకంటే ముందే చనిపోవాలని మనసులో కోరుకున్నారట. ఆ కోరిక నెరవేరడంతో తన కొడుకు ఏ లోటు లేకుండా తన చేతుల్లోనే వెళ్ళిపోయాడనే తృప్తిని వ్యక్తం చేశారు.

Advertisement

ALSO READ:Film industry: ఇండస్ట్రీలో విషాదం.. ఆయన లోటు తీర్చరానిది!

1500 సినిమాల ప్రస్థానంలో తీరని లోటు:

ప్రసాద్ బాబు (అసలు పేరు కరణం లీల వెంకట శ్రీహరి నాగ వరప్రసాద్) ‘పునాదిరాళ్లు’ సినిమాతో తన ప్రస్థానం మొదలుపెట్టి, తెలుగు, తమిళ భాషల్లో 1500 సినిమాలు చేశారు. రుద్రవీణ, ఆపద్భాందవుడు వంటి ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించినా, తన కొడుకు విషయంలో ఆయన పడిన ఆవేదన మాత్రం తీరనిది. ఇక ఏ తండ్రికీ రాకూడని పరిస్థితి ఆయనకు ఎదురైంది. ఒక బాధ్యత గల తండ్రిగా ఆయన పడిన ఆరాటం, తీసుకున్న నిర్ణయం చూస్తుంటే ఎవరికైనా మనసు భారమవుతుంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×