E-Paper
Advertisement

లంగ్ క్యాన్సర్ లక్షణాలు..ముందుగా గుర్తించే మార్గాలు ఇవే!

లంగ్ క్యాన్సర్ లక్షణాలు..ముందుగా గుర్తించే మార్గాలు ఇవే!
Advertisement

Lung cancer symptoms : ఈ రోజుల్లో.. కాలుష్యం, స్మోకింగ్, మన లైఫ్‌ స్టైల్ వల్ల ఊపిరితిత్తుల సమస్యలు బాగా పెరిగిపోతున్నాయి. ‘ప్రపంచ లంగ్ క్యాన్సర్ దినోత్సవం’ సందర్భంగా.. దీని పట్ల ప్రతీ ఒక్కరూ.. అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్యాన్సర్ అనగానే.. చాలా మంది భయపడతారు, కానీ ప్రారంభ దశలోనే.. గుర్తించి సరైన ట్రీట్మెంట్ అందిస్తే.. దాని నుంచి కోలుకోవడం చాలా ఈజీ. సాధారణ దగ్గు, శ్వాస తీసుకోకపోవడం అని నిర్లక్ష్యం చేస్తే.. ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. అసలు ఊపిరితిత్తుల.. క్యాన్సర్ సంకేతాలు ఎలా ఉంటాయో, ఎప్పుడు అలర్ట్ అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.

లంగ్ క్యాన్సర్ లక్షణాలు:

తగ్గని మొండి దగ్గు:
సాధారణంగా వచ్చే జలుబు లేదా ఇన్ఫెక్షన్ దగ్గు రెండు వారాల్లో.. తగ్గిపోతుంది. కానీ..మీకు 3 వారాలకు పైగా దగ్గు తగ్గకుండా.. వేధిస్తుంటే.. క్రమంగా పెరుగుతుంటే ఖచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాలి.

Advertisement

దగ్గులో రక్తం పడటం:
దగ్గినప్పుడు కఫంతో పాటు కొద్దిగా రక్తం లేదా ఎర్రటి చారలు కనిపించినా వెంటనే.. అప్రమత్తమవ్వాలి. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రాథమిక, స్పష్టమైన లక్షణాలలో ఒకటి.

ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది:
కొద్దిగా నడిచినా, మెట్లు ఎక్కినా.. విపరీతంగా ఆయాసం రావడం, గాలి సరి పోనట్లు అనిపించడం, శ్వాస తీసుకునేటప్పుడు విజిలింగ్ (ఈల వేసినట్లు) శబ్దం రావడం వంటివి వస్తే.. ఊపిరితిత్తులు సరిగ్గా పని చేయడం లేదని అర్థం.

Advertisement

ఛాతీ, భుజాల నొప్పులు:
బాగా దగ్గినప్పుడు, ఊపిరి గట్టిగా పీల్చుకున్నప్పుడు.. లేదా నవ్వినప్పుడు ఛాతీ భాగంలో, వీపులో లేదా భుజాలలో తీవ్రమైన నొప్పి రావడం లంగ్ క్యాన్సర్ సూచన కావచ్చు.

గొంతు బొంగురుపోవడం :
కారణం లేకుండా.. గొంతు బొంగురు పోవడం లేదా స్వరంలో మార్పు ..రావడం, అది వారాలు గడిచినా తగ్గకపోవడం కూడా ఊపిరితిత్తులలోని.. గడ్డలు స్వరతంత్రులపై ఒత్తిడి తెస్తున్నాయనడానికి సంకేతం.

అకస్మాత్తుగా బరువు తగ్గడం, అలసట:
ఎలాంటి డైటింగ్ లేదా ఎక్సర్‌సైజ్ చేయకుండానే.. హఠాత్తుగా బరువు తగ్గిపోవడం, రోజంతా విపరీతమైన నీరసం, అలసటగా.. అనిపించడం వంటివి క్యాన్సర్ కణాలు శరీర శక్తిని గ్రహిస్తున్నాయనే దానికి సంకేతం.

ఎవరికి  ప్రమాదం ఎక్కువ?
స్మోకింగ్ చేసేవారు : స్మోకింగ్ చేసేవారిలో లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం 80%-90% వరకు ఉంటుంది.

ప్యాసివ్ స్మోకింగ్: మీరు స్మోక్ చేయకపోయినా.. స్మోక్ చేసే వారి పక్కన నిరంతరం ఉండటం వల్ల కూడా ఈ ప్రమాదం ఉంటుంది.

వాయు కాలుష్యం & కెమికల్స్: నిత్యం కాలుష్యంలో.. ఉండేవారు, ఆస్‌బెస్టాస్, ఆర్సెనిక్ వంటి ప్రమాదకర రసాయనాల మధ్య పనిచేసే వారికి రిస్క్ ఎక్కువ.

గుర్తింపు & నివారణ మార్గాలు:

లో-డోస్ సిటి స్కాన్ : స్మోకింగ్ చేసే అలవాటు ఉన్న వారు లేదా 50 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా.. లంగ్స్ స్క్రీనింగ్ చేయించుకోవడం వల్ల క్యాన్సర్‌ను ప్రారంభంలోనే పట్టుకోవచ్చు.

స్మోకింగ్ పూర్తిగా మానేయండి: సిగరెట్, బీడీ, ఈ-సిగరెట్‌లకు ఎంత త్వరగా దూరం జరిగితే.. ఊపిరితిత్తులు అంత త్వరగా ఆరోగ్యంగా మారతాయి.

పౌష్టికాహారం తీసుకోవడం: యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ C ఎక్కువగా ఉండే.. పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు రోజూ తినడం వల్ల లంగ్స్ నిరోధక శక్తి పెరుగుతుంది.

వ్యాయామం & ప్రాణాయామం: రోజూ యోగా, శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయడం.. వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది.

ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది ఎంత ముందస్తుగా.. గుర్తిస్తే చికిత్స అంత ఈజీ అవుతుంది. ముందుగా కనిపించే లక్షణాలను కూడా అలసత్వంతో వదిలేయకండి. ఆలస్యం చేసే.. కొద్దీ చికిత్స కష్టతరమవుతుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×