E-Paper
Advertisement

వేసవిలో రాత్రి నిద్ర పట్టడం లేదా? దీనికి కారణాలు ఇవే.. త్వరగా నిద్రపోవడానికి టిప్స్

వేసవిలో రాత్రి నిద్ర పట్టడం లేదా? దీనికి కారణాలు ఇవే.. త్వరగా నిద్రపోవడానికి టిప్స్
Advertisement

మే, జూన్ నెలల్లో వేసవి కాలం పీక్స్‌లో ఉంటుంది. ఈ రెండు నెలలు ఉష్ణోగ్రతలు.. ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది రాత్రిపూట సరిగా నిద్రపోలేక ఇబ్బందులు పడుతుంటారు. పగటిపూట వేడి వల్ల అలసిపోయినా, రాత్రి బెడ్‌పై పడుకున్న తర్వాత కూడా నిద్ర రావడం కష్టంగా మారుతుంది. కొందరు తరచుగా మేల్కొంటూ ఉంటారు. వైద్యులు ఈ సమస్యని.. ‘సమ్మర్ ఇన్సోమ్నియా’ లేదా వేసవి నిద్రలేమి అని పిలుస్తారు. వేడి వాతావరణం మాత్రమే కాకుండా, శరీరంలో జరిగే కొన్ని సహజ మార్పులు కూడా దీనికి కారణమవుతాయి.

నిద్రపై శరీర ఉష్ణోగ్రత ప్రభావం 

మన శరీరం గాఢ నిద్రలోకి వెళ్లాలంటే శరీర అంతర్గత ఉష్ణోగ్రత కొద్దిగా తగ్గాలి. సాధారణంగా రాత్రి సమయంలో శరీరం సహజంగానే చల్లబడేందుకు ప్రయత్నిస్తుంది. కానీ వేసవిలో అధిక వేడి, తేమ కారణంగా ఈ ప్రక్రియ సరిగా జరగదు. శరీరం వేడిగా ఉన్నప్పుడు మెదడు నిద్ర సంకేతాలను ఆలస్యంగా పంపిస్తుంది. దీంతో నిద్ర పట్టడానికి ఎక్కువ సమయం పడుతుంది.

ఎక్కువ పగటి వెలుతురు నిద్రను దెబ్బతీస్తుంది

Advertisement

వేసవిలో పగలు పెద్దది, రాత్రులు చిన్నవి. అంటే సూర్యుడు ఎక్కువ సమయం ఆకాశంలో ఉంటాడు. త్వరగా ఉదయిస్తాడు. చలికాలంతో పోలిస్తే ఆలస్యంగా అస్తమిస్తాడు. అంటే సూర్యాస్తమయం ఆలస్యంగా జరుగుతుంది. దీని వల్ల శరీరంలోని జీవ గడియారం గందరగోళానికి గురవుతుంది. సాధారణంగా రాత్రి సమయంలో విడుదలయ్యే మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ ఆలస్యంగా విడుదలవుతుంది. ఫలితంగా రాత్రి ఆలస్యమైనా నిద్ర రావడం కష్టమవుతుంది. అదనంగా, రాత్రిపూట ఎక్కువగా చెమట పట్టడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. ఈ డీహైడ్రేషన్ కారణంగా అసౌకర్యం పెరిగి నిద్ర మధ్యలో పలుమార్లు మేల్కొనే అవకాశం ఉంటుంది.

చల్లటి స్నానం మంచి ఫలితాలు

నిద్రకు ముందు సాధారణ లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇది మెదడుకు విశ్రాంతి సమయం వచ్చిందనే సంకేతాన్ని ఇస్తుంది. దీంతో నిద్ర త్వరగా పట్టే అవకాశం ఉంటుంది.

రాత్రి భోజనం మితంగా తినాలి

Advertisement

వేసవిలో రాత్రి సమయంలో హెవీ లేదా మసాలా ఎక్కువగా ఉన్న ఫుడ్ తినడం మంచిది కాదు. అలాంటి ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీంతో శరీరంలో వేడి పెరుగుతుంది. తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సులభంగా జరిగి శరీరం చల్లగా ఉంటుంది.

Also Read: చిన్నారుల కోసం ఈ బేబీ ప్రొడక్ట్స్ కొనకూడదు.. తల్లిదండ్రులకు డాక్టర్ల హెచ్చరిక

సాయంత్రం తర్వాత కాఫీ, టీ తగ్గించాలి

సాయంత్రం 6 గంటల తర్వాత టీ, కాఫీ లేదా కెఫిన్ ఉన్న డ్రింక్స్ తాగకూడదు. కెఫిన్ శరీరాన్ని ఉత్తేజపరచడంతో పాటు నీటి శాతం తగ్గిస్తుంది. దీని వల్ల నిద్ర మరింత ఆలస్యంగా వస్తుంది. దానికి బదులుగా తగినంత నీరు తాగడం మంచిది.

నిద్రకు అనుకూలమైన గది వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి

బెడ్ రూమ్ వీలైనంత చల్లగా, చీకటిగా ఉంచాలి. గాలి సరిగా ఆడేలా చూడాలి. కాటన్ బెడ్‌షీట్లు, తేలికపాటి దుప్పట్లు ఉపయోగించడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. ఇలాంటి చిన్న మార్పులు కూడా వేసవిలో ప్రశాంతమైన నిద్రకు సహాయపడతాయి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×