// // Peanut allergy symptoms: వేరుశనగలు తింటే దగ్గు వస్తుందా? దీని వెనుక ఉన్న అసలు కారణం ఇదే! -->
E-Paper
Advertisement

వేరుశనగ తింటే దగ్గు వస్తుందా? దీని వెనుక ఉన్న అసలు కారణం ఇదే!

వేరుశనగ తింటే దగ్గు వస్తుందా? దీని వెనుక ఉన్న అసలు కారణం ఇదే!
Advertisement

Peanut allergy symptoms: చాలామంది వేరుశనగలు తిన్న వెంటనే గొంతులో గరగరగా అనిపించి, దగ్గు రావడం గమనిస్తుంటారు. రుచికరమైన పల్లీలు తిన్న తర్వాత ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది సాధారణమైన అలవాటు వల్ల కావచ్చు. లేదా మీ శరీరానికి వేరుశనగలు పడకపోవడం వల్ల కావచ్చు. పీనట్ అలర్జీ నుంచి గొంతు పొడిబారడం వరకు దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అసలు వేరుశనగలు తింటే ఎందుకు దగ్గు వస్తుంది? ఏయే సందర్భాల్లో ఇది ప్రమాదకరం? అనే విషయాలను స్పష్టంగా తెలుసుకుందాం.

1. పీనట్ అలర్జీ:
వేరుశెనగలు తింటే దగ్గు రావడానికి అత్యంత ప్రధానమైన కారణం ‘పీనట్ అలర్జీ’. మన రోగనిరోధక వ్యవస్థ వేరుశెనగల్లోని ప్రోటీన్లను ప్రమాదకరమైనవిగా పొరబడి, వాటిపై పోరాడుతుంది. దీనివల్ల గొంతులో వాపు, దురద, మరియు ఊపిరితిత్తుల నుంచి శ్వాసనాళాల్లో చికాకు కలిగి దగ్గు వస్తుంది. ఇది తీవ్రమైన అలర్జీకి సంకేతం కావొచ్చు.

Advertisement

2. గొంతు పొడిబారడం:
వేరుశెనగలు సహజంగానే కొంచెం పొడిగా ఉంటాయి. మీరు వాటిని సరిగ్గా నమలకుండా మింగితే.. అవి గొంతు గోడలకు అంటుకుంటాయి. ఈ పొడి ధూళి కణాలు గొంతును చికాకు పరిచి దగ్గును ప్రేరేపిస్తాయి. మీరు తింటున్నప్పుడు నీరు తగినంత తాగకపోవడం కూడా దీనికి కారణం కావచ్చు.

3. అఫ్లాటాక్సిన్ కాలుష్యం:
వేరుశనగలను సరిగ్గా నిల్వ చేయకపోతే.. వాటిపై ఒక రకమైన బూజు ఏర్పడుతుంది. దీనిని ‘అఫ్లాటాక్సిన్’ అంటారు. ఈ బూజు పట్టిన పల్లీలను తింటే గొంతులో మంట, ఇన్‌ఫెక్షన్ రావచ్చు, ఇది దగ్గుకు దారితీస్తుంది.

Advertisement

4. శ్వాసనాళాల్లో అడ్డంకులు:
వేరుశనగ ముక్కలు చిన్నవిగా ఉండటం వల్ల.. తినేటప్పుడు అవి పొరపాటున శ్వాసనాళాల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇది తక్షణమే దగ్గును కలిగిస్తుంది. ఇది చిన్న పిల్లల్లో ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి.

దగ్గును తగ్గించేందుకు చిట్కాలు:
నీరు తాగండి: పల్లీలు తిన్న తర్వాత తప్పనిసరిగా గోరు వెచ్చని నీరు తాగండి. ఇది గొంతును శుభ్రపరుస్తుంది.

నమలి తినండి: పల్లీలను ఎప్పుడూ బాగా నమిలి, ఉమ్మిలోని ఎంజైమ్స్ కలిసిన తర్వాతే మింగండి.

పరీక్షించుకోండి: మీకు పదేపదే దగ్గు వస్తుంటే.. అది అలర్జీయేమో తెలుసుకోవడానికి ఒకసారి డాక్టరును సంప్రదించి అలర్జీ పరీక్షలు చేయించుకోవడం మంచిది.

నాణ్యత: ఎప్పుడూ తాజాగా ఉన్న, బూజు పట్టని పల్లీలను మాత్రమే తినండి.

Also Read: బాడీ డిటాక్స్ కోసం ఆయుర్వేద ఫుట్ సోక్.. ఇంట్లో దొరికే వాటితోనే మ్యాజిక్!

ఎప్పుడు డాక్టరును సంప్రదించాలి ?
మీకు పల్లీలు తిన్న తర్వాత దగ్గుతో.. పాటు కింది లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ తీసుకోవాలి.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.

ముఖం, పెదవులు లేదా నాలుక వాపు.

చర్మంపై దద్దుర్లు.

కళ్లు తిరగడం లేదా స్పృహ తప్పడం.

 

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×