// // Why are bananas curved:అరటి పండ్లు వంకరగా ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనక ఉన్న క్రేజీ సైన్స్ ఇదీ! -->
E-Paper
Advertisement

అరటి పండ్లు వంకరగా ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనక ఉన్న క్రేజీ సైన్స్ ఇదీ!

అరటి పండ్లు వంకరగా ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనక ఉన్న క్రేజీ సైన్స్ ఇదీ!
Advertisement

Why are bananas curved: మనం రోజూ తినే పండ్లలో.. అరటి పండు చాలా కామన్. దీని రేటు తక్కువ, ఎనర్జీ ఎక్కువ. అయితే.. ఈ పండును ఎప్పుడు చూసినా.. మన మైండ్‌లోకి ఒక వింత డౌట్ రాక మానదు. అరటి పండ్లు కొంటే..అందులో ఒక్కటి కూడా స్ట్రెయిట్‌గా ఉండదు. అన్నీ చంద్రవంక ఆకారంలో వంకరగానే ఉంటాయి. అసలు వీటికి..ఈ వంకర ఆకారం ఎందుకు వస్తుంది? తోటల్లో.. చెట్లకు కాసేటప్పుడే.. డిజైన్ అలా మారుతుందా? అంటే.. అవుననే అంటోంది సైన్స్. కాకపోతే దీని వెనక ఒక ఇంట్రెస్టింగ్ అంశాలు ఉన్నాయి.

అడవుల్లో పుట్టిన అరటి కథ:

అరటి పండ్లు వంకరగా మారడానికి గల కారణం తెలుసుకోవాలంటే.. మనం కొద్దిగా ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాలి. ఇప్పుడు మనం పొలాల్లో.. పెంచే అరటి చెట్లు కాకుండా.. పూర్వం ఇవి దట్టమైన అడవుల్లో, పెద్ద పెద్ద చెట్ల మధ్య పెరిగేవి. అడవిలో పెద్ద పెద్ద వృక్షాల నీడ వల్ల కింద ఉండే అరటి చెట్లకు సూర్యరశ్మి సరిగ్గా తగిలేది కాదు. మొక్కలు పెరగాలన్నా.. పండ్లు పక్వానికి రావాలన్నా ఎండ చాలా ముఖ్యం కదా. మరి దట్టమైన ఆకుల మధ్య నుంచి వచ్చే.. కొద్ది పాటి ఎండను అరటి పండ్లు ఎలా పొందాయో తెలుసా? ఇక్కడే ప్రకృతి ఒక వింత ప్రయోగాన్ని చేసింది.

నెగెటివ్ జియోట్రోపిజం అంటే ఏంటి?

Advertisement

సాధారణంగా భూమిపై ఏ వస్తువైనా గురుత్వాకర్షణ శక్తి వల్ల కిందకు లాగబడుతుంది. చెట్లకు కాసే పండ్లు కూడా గ్రావిటీ వల్ల కిందకే వేలాడుతూ పెరుగుతాయి. కానీ అరటిపండు విషయంలో సీన్ రివర్స్ అవుతుంది. అరటి పండ్లు మొదట మొగ్గ దశ నుంచి చిన్న చిన్న కాయలుగా మారినప్పుడు కిందకే పెరుగుతాయి. కానీ.. అవి కొద్దిగా పెద్దవవుతున్న కొద్దీ, వాటికి సూర్యరశ్మి అవసరమవుతుంది.

అప్పుడు ఆ పండ్లు భూమి గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా (అంటే కిందకు కాకుండా), ఎండ ఎటువైపు ఉంటే.. అటువైపు ఆకాశంలోకి, అంటే పైకి పెరగడం స్టార్ట్ చేస్తాయి. సైన్స్ భాషలో భూమికి వ్యతిరేకంగా సూర్యుని వైపు పెరిగే ఈ ప్రక్రియను “నెగెటివ్ జియోట్రోపిజం” అంటారు.

కిందకు లాగే గ్రావిటీ:

Advertisement

ఇప్పుడు అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఒకవైపు భూమి గురుత్వాకర్షణ శక్తి అరటి పండును కిందికి లాగడానికి ట్రై చేస్తుంది. మరో వైపు, సూర్యరశ్మి కోసం అరటిపండు పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఈ రెండు శక్తుల మధ్య జరిగే ఒక రకమైన యుద్ధం వల్ల, అరటిపండు నిటారుగా పెరగలేక, అలా వంకరగా మారిపోతుంది. అంటే.. ఒక రకంగా చెప్పాలంటే అరటి పండుకు ఆ వంకర షేప్ రావడం అనేది అది బ్రతకడానికి చేసే పోరాటం అన్నమాట.

మన చేతిలోకి వచ్చే ప్రతి అరటి పండు వెనక ప్రకృతి చేసిన ఒక అద్భుతమైన సైన్స్ మ్యాజిక్ ఉంది. ఒక వేళ అరటిపండ్లు గనక గ్రావిటీకి లొంగిపోయి స్ట్రెయిట్‌గా పెరిగితే.. అవి బరువెక్కిపోయి చెట్టు కాండం విరిగి కింద పడిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే ప్రకృతి వాటిని అలా వంకరగా డిజైన్ చేసింది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×