E-Paper
Advertisement

ఏ పర్‌ఫ్యూమ్ కొనాలి? బాటిల్‌పై ఉండే ఈ 3 సూచనలు చూసి కొనండి

ఏ పర్‌ఫ్యూమ్ కొనాలి? బాటిల్‌పై ఉండే ఈ 3 సూచనలు చూసి కొనండి
Advertisement

చాలామంది పర్‌ఫ్యూమ్ వేసుకున్న కొద్దిసేపటికే దాని సువాసన తగ్గిపోతుందని చెబుతుంటారు. దీంతో రోజులో పలుమార్లు మళ్లీ స్ప్రే చేయాల్సి వస్తుంది. అయితే దీనికి ప్రధాన కారణం పర్‌ఫ్యూమ్ బాటిల్‌పై ఉన్న సంకేతాలను తెలియకపోవడమే. ఆ సంకేతాలు సువాసన బలం, ఎంతసేపు నిలుస్తుందో తెలియజేస్తాయి.

పర్‌ఫ్యూమ్ బాటిల్‌పై 3 సూచనలు

పర్‌ఫ్యూమ్ బాటిళ్లపై సాధారణంగా మూడు రకాల సంక్షిప్త పదాలు కనిపిస్తాయి. అవి ఇడిసి, ఇడిటి, ఇడిపి. ఇవి పర్‌ఫ్యూమ్‌లో ఉన్న సువాసన నూనె (ఫ్రాగ్రెన్స్ ఆయిల్) శాతాన్ని సూచిస్తాయి. ఆయిల్ శాతం ఎక్కువగా ఉంటే వాసన బలంగా ఉండటంతో పాటు ఎక్కువసేపు నిలుస్తుంది.

ఇడిసి అంటే తేలికపాటి సువాసన కలిగిన పర్‌ఫ్యూమ్

Advertisement

ఇడిసి అంటే “ఓ డి కొలోన్” (Eau de Cologne) ఇందులో ఫ్రాగ్రెన్స్ ఆయిల్ పరిమాణం తక్కువగా ఉంటుంది. అందువల్ల దీని వాసన చాలా తేలికగా ఉంటుంది. సాధారణంగా ఒకటి నుంచి రెండు గంటల వరకు మాత్రమే నిలుస్తుంది. ఎండాకాలంలో తాజాదనాన్ని కోరుకునే వారికి ఇది మంచి ఎంపికగా ఉంటుంది.

బాటిల్ ఇడిటి ఉంటే అర్థం ఏంటి?

ఇడిటి అంటే “ఓ డి టాయిలెట్” (Eau de Toilette). ఇందులో ఇడిసి కంటే ఎక్కువ సువాసన నూనె ఉంటుంది. దీని వాసన మితంగా ఉండి మూడు నుంచి ఐదు గంటల వరకు నిలుస్తుంది. ఆఫీస్‌కు వెళ్లేవారు లేదా ప్రతిరోజూ ఉపయోగించాలనుకునేవారికి ఇది అనువైనది.

ఇడిపి ఎక్కువసేపు నిలిచే బలమైన సువాసన

Advertisement

ఇడిపి అంటే “ఓ డి పర్‌ఫమ్” (Eau de Parfum). ఇందులో ఫ్రాగ్రెన్స్ ఆయిల్ శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీని వాసన గాఢంగా ఉండి ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు లేదా అంతకంటే ఎక్కువసేపు ఉండిపోతుంది. ప్రత్యేక వేడుకలు లేదా ఎక్కువసేపు బయట ఉండే సందర్భాల్లో చాలామంది దీన్ని ఎంచుకుంటారు.

Also Read: పొట్టకొవ్వు ఏం చేసినా తగ్గడం లేదా? నో టెన్షన్.. ఒక నెలలో 4 నుంచి 5 కిలోలు తగ్గే టిప్స్ మీ కోసం

మీ అవసరానికి తగిన పర్‌ఫ్యూమ్‌ను ఎలా ఎంచుకోవాలి?

మీకు తేలికపాటి సువాసనలు ఇష్టమైతే ఇడిసి సరిపోతుంది. ప్రతిరోజూ ఉపయోగించడానికి, స్టేబుల్ వాసన కోసం ఇడిటి మంచి ఆప్షన్. ఎక్కువసేపు నిలిచే గాఢమైన సువాసన కావాలనుకుంటే ఇడిపి తీసుకోండి. కొనుగోలు చేసే ముందు బాటిల్‌పై ఉన్న ఈ వివరాలను పరిశీలిస్తే సరైన నిర్ణయం తీసుకోవడం సులభమవుతుంది.

పర్‌ఫ్యూమ్ ఎంపికలో బ్రాండ్ మాత్రమే కాదు, దానిపై ఉన్న ఇడిసి, ఇడిటి, ఇడిపి వంటి కోడ్‌లను కూడా అర్థం చేసుకోవాలి. ఈ చిన్న సమాచారం మీ అవసరాలకు సరిపోయే పర్‌ఫ్యూమ్ ఎంచుకోవడంలో సహాయపడుతుంది. సరైన పర్‌ఫ్యూమ్‌ను ఎంచుకుంటే రోజంతా ఆహ్లాదకరమైన ఫీలింగ్ ఉంటుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×