E-Paper
Advertisement

రూపాయి ఖర్చు లేదు..నీళ్లు తాగే విధానం మారిస్తే డయాబెటిస్, బీపీ మాయం!

రూపాయి ఖర్చు లేదు..నీళ్లు తాగే విధానం మారిస్తే డయాబెటిస్, బీపీ మాయం!
Advertisement

Water Tapping Health Trick: మనం నిత్యం తాగే మంచి నీళ్లతోనే బ్లడ్ షుగర్, బీపీ, అసిడిటీ వంటి సమస్యలను కంట్రోల్ చేయవచ్చంటే నమ్ముతారా? అవును, ఇది నిజం! కేవలం మనం ఏ రకమైన నీళ్లు తాగుతున్నామనే దానికంటే.. ఎలా తాగుతున్నామనే దానిపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఈ మధ్యకాలంలో నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్న సరికొత్త హెల్త్ హ్యాక్ ‘వాటర్ ట్యాపింగ్’. రూపాయి ఖర్చు లేకుండా కేవలం నీళ్లు తాగే పద్ధతిని మార్చి బీపీ, షుగర్‌ను ఎలా అదుపులో ఉంచుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

చాలామంది దాహం అనిపించగానే నిలబడి, బాటిల్ ఎత్తుకుని ఒక్కసారిగా గటగటా నీళ్లు తాగేస్తుంటారు. కానీ ఈ పద్ధతి వల్ల కిడ్నీలు, జాయింట్లపై విపరీతమైన భారం పడుతుంది. దీని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. ఆయుర్వేదంలో చెప్పబడిన ‘సిప్పింగ్’ విధానానికి మోడ్రన్ టచ్ ఇస్తూ వచ్చినదే ఈ ‘వాటర్ ట్యాపింగ్’ పద్ధతి.

Advertisement

అసలు ఏంటి ఈ ‘వాటర్ ట్యాపింగ్’ పద్ధతి?

వాటర్ ట్యాపింగ్ అంటే పెద్ద విషయమేమీ కాదు! మనం నీళ్లు తాగేటప్పుడు ఒకేసారి మింగకుండా, ప్రతి గుటకను నోట్లోనే ఉంచుకుని లాలాజలంతో కలిపి మెల్లగా మింగడం.

Advertisement

మన నోటిలోని లాలాజలం ఆల్కలైన్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇక మన కడుపులో ఉండే గ్యాస్ట్రిక్ యాసిడ్ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. మనం నీటిని మెల్లగా గుటక గుటకగా తాగినప్పుడు, నోట్లోని లాలాజలం నీటితో కలిసి పొట్టలోకి వెళ్లి అక్కడ ఉన్న యాసిడ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది.

బ్లడ్ షుగర్,బీపీపై వాటర్ ట్యాపింగ్ ప్రభావం:

బ్లడ్ షుగర్ కంట్రోల్: మనం ఆహారం తిన్న తర్వాత నోట్లోని ఎంజైమ్‌లు సమర్థవంతంగా పనిచేయడానికి బాడీ హైడ్రేషన్ చాలా అవసరం. నీటిని మెల్లగా ట్యాపింగ్ చేస్తూ తాగడం వల్ల ఇన్సులిన్ రెస్పాన్స్ మెరుగవుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగవు.

రక్తపోటు నియంత్రణ: వేగంగా నీళ్లు తాగడం వల్ల రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. అదే వాటర్ ట్యాపింగ్ పద్ధతిలో మెల్లగా తాగడం వల్ల నాడీ వ్యవస్థ ప్రశాంతపడి , రక్తనాళాలు వికసించి బీపీ అదుపులో ఉంటుంది.

అసిడిటీ, గ్యాస్ మాయం: కడుపులో యాసిడ్ స్థాయిలు బ్యాలెన్స్ అవ్వడం వల్ల దీర్ఘకాలిక అసిడిటీ, గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం తక్షణమే తగ్గుతాయి.

ఎలా చేయాలి?
ఈ పద్ధతి పాటించడానికి మీకు ఎలాంటి మందులు లేదా ప్రత్యేక పరికరాలు అవసరం లేదు.

ఎప్పుడు తాగాలి: ఉదయం లేవగానే ,ప్రతిరోజూ పూట పూటకూ మధ్యలో తాగాలి.

Also Read: ఇంట్లో వాడే.. నూనె మీ గుండెను దెబ్బతీస్తోందా?

ఎలా తాగాలి:

ఎప్పుడూ కూర్చుని మాత్రమే నీళ్లు తాగాలి.

ఒక చిన్న గ్లాసుతో నీటిని తీసుకుని, ఒక గుటక నోటిలో వేసుకోవాలి.

ఆ నీటిని నోట్లోనే 3 నుంచి 5 సెకన్ల పాటు తిప్పుతూ (లాలాజలం కలిసేలా) మెల్లగా మింగాలి.

గ్లాసు నీటిని తాగడానికి కనీసం 2 నుంచి 3 నిమిషాల సమయం కేటాయించాలి.

ఆరోగ్యంగా ఉండటానికి వేలకు వేలు ఖర్చుపెట్టి హెల్త్ డ్రింక్స్, సప్లిమెంట్లు కొనాల్సిన అవసరం లేదు. మన నిత్య జీవితంలో నీళ్లు తాగే విధానాన్ని కొద్దిగా మార్చుకుంటే చాలు. ఈ రోజే ‘వాటర్ ట్యాపింగ్’ పద్ధతిని మీ లైఫ్ స్టైల్ లో భాగం చేసుకోండి.. సహజంగానే షుగర్, బిపి, గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం పొందండి!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×