E-Paper
Advertisement

Vitamin E: ‘విటమిన్ ఈ’ రోజుకు ఎంత అవసరం? ఏయే ఆహారాల్లో లభిస్తుంది? పూర్తి వివరాలు ఇవిగో..

Vitamin E: ‘విటమిన్ ఈ’ రోజుకు ఎంత అవసరం? ఏయే ఆహారాల్లో లభిస్తుంది? పూర్తి వివరాలు ఇవిగో..
Advertisement

Vitamin E: మన శరీరానికి ఎ, బి, సి, డి విటమిన్లు మాత్రమే కాదు.. విటమిన్ E కూడా ఎంతో అవసరం. ఇది డి విటమిన్‌లాగే కొవ్వులో కరిగే లక్షణం కలిగి ఉంటుంది. అందుకే శరీరంలో సరిపడా కొవ్వు లేకపోతే, విటమిన్ Eను శరీరం పూర్తిగా గ్రహించలేకపోతుంది. విటమిన్ E ఒకవైపు శరీరానికి అవసరమైన విటమిన్‌గా పనిచేస్తూనే మరోవైపు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గానూ ఉపయోగపడుతుంది. దీనివల్ల శరీరంలోని కణాలు ఆరోగ్యంగా ఉండి, జీవక్రియలు సక్రమంగా పనిచేస్తాయి. అయితే శరీరంలో విటమిన్ E లోపం ఏర్పడితే కొన్ని లక్షణాలు, సంకేతాల ద్వారా అది మనకు ముందుగానే తెలియజేస్తుంది.

విటమిన్ E ఎందుకు అవసరం?

విటమిన్ E మన శరీరానికి చాలా తక్కువ మోతాదులో సరిపోతుంది. కానీ అది చేసే పని మాత్రం ఎంతో కీలకం. E విటమిన్ వ్యాధులు దరిచేరకుండా కాపాడటంలో సహాయపడుతుంది. ముఖ్యంగా వయసు పెరిగేకొద్దీ వచ్చే మతిమరుపు, అల్జీమర్స్ వంటి సమస్యలను నియంత్రించడానికి విటమిన్ E ఉన్న ఆహారం ఎంతో ఉపయోగకరం. గుండె, మెదడు, మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది.

Advertisement

Read Also: మొదలైంది శీతాకాలం.. విటమిన్ డి కోసం ఏ టైంలో, ఎంతసేపు ఎండలో నిలబడాలో తెలుసా?

కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..

విటమిన్ E వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం తగ్గుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ ముప్పు తగ్గుతుంది. మెదడు యాక్టివ్‌గా ఉండేందుకు, ఏకాగ్రత పెరగేందుకు, జ్ఞాపకశక్తి మెరుగుపడేందుకు ఇది ఎంతో సహాయపడుతుంది. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, శిరోజాల సంరక్షణలో, పురుషుల ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో కూడా విటమిన్ E కీలక పాత్ర పోషిస్తుంది.

విటమిన్ E లోపం ఉంటే..

Advertisement

శరీరంలో విటమిన్ E తక్కువైతే.. ఆలోచనా శక్తి మందగిస్తుంది, అలసట ఎక్కువగా అనిపిస్తుంది. చర్మం పొడిబారడం, దురదలు, ఇన్‌ఫెక్షన్లు రావడం వంటి లక్షణాలు బయటపడతాయి. దీంతో నాడీ వ్యవస్థ బలహీనపడడంతో కండరాల నొప్పులు, నీరసం, చూపు మందగించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. పిల్లల్లో అయితే చదువుపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

రోజుకు ఎంత అవసరం? 

రోజుకు అవసరమైన విటమిన్ E మోతాదు వయసు, లింగాన్ని బట్టి మారుతుంది. సాధారణంగా పెద్దలకు రోజుకు సుమారు 10-15 మిల్లీ గ్రాములు అవసరం అవుతుంది. ఇది సమతుల్య ఆహారం ద్వారా లభిస్తుంది. అయితే గర్భవతులు, పాలిచ్చే తల్లులకు కొంచెం ఎక్కువ అవసరం కావచ్చు.

ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..

విటమిన్ E కోసం పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడి విత్తనాలు, బాదం, జీడిపప్పు, పల్లీలు, సోయాబీన్స్, పాలకూర, బ్రోకలీ వంటి ఆహారాలను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అయితే ఈ లోపం ఎక్కువగా ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

Read Also: రోజూ నిద్రలేవగానే తల గిర్రుమంటోందా.. వర్టిగో గురించి తెలుసుకోవాల్సిన సమయమిదే!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×