E-Paper
Advertisement

క్యూ-మార్ట్‌లో క్యూ కడుతున్న జనం.. వైరల్ అవుతున్న‘కొరియన్ ఐస్ కప్’ ట్రెండ్!

క్యూ-మార్ట్‌లో క్యూ కడుతున్న జనం.. వైరల్ అవుతున్న‘కొరియన్ ఐస్ కప్’ ట్రెండ్!
Advertisement

Korean Ice Cup Hyderabad: ఇన్‌స్టా లేదా యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు.. సౌత్ కొరియా కన్వీనియన్స్ స్టోర్స్‌లో కలర్‌ఫుల్ జ్యూస్‌లను ఐస్ కప్‌లలో పోసి తాగే వీడియోలు విపరీతంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ ఐస్ క్యూబ్స్ కదిలే విజువల్స్, ప్రశాంతతను ఇచ్చే ఆ ASMR సౌండ్స్ చూసి “అసలు దీని టేస్ట్ ఎలా ఉంటుందో.. మనకు ఎప్పుడు దొరుకుతుందో” అని క్రేజీగా వెయిట్ చేస్తున్న కే-కల్చర్ ఫ్యాన్స్‌కు.. ఎట్టకేలకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్.

ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న..  వైరల్ ‘కొరియన్ ఐస్ కప్’ ట్రెండ్ ఇప్పుడు హైదరాబాద్ కి అఫీషియల్‌గా ల్యాండ్ అయిపోయింది. నగరంలోని ఐటీ హబ్ నడిబొడ్డున ఈ ట్రెండ్ తెగ హల్‌చల్ చేస్తోంది. కానీ కేవలం ఒక ప్లాస్టిక్ కప్పు ఐస్, కాస్త ఫ్లేవర్డ్ జ్యూస్ ఉన్న ఈ కాంబో ధర వింటే మాత్రం జనం నోరెళ్లబెడుతున్నారు. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన ఈ క్రేజీ ఫుడ్ ముచ్చట్లేంటో, అసలు దీని వెనక ఉన్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందామా..

Advertisement

ఎక్కడ దొరుకుతోంది? ఎందుకంత క్రేజ్?

ఈ వైరల్ కొరియన్ ఐస్ కప్ హైదరాబాద్, హైటెక్ సిటీలోని సత్వ నాలెడ్జ్ సిటీలో ఉన్న ‘క్యూ మార్ట్ కన్వీనియో’ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏరియాలో ఐటీ ప్రొఫెషనల్స్, యూత్ ఎక్కువగా ఉండటంతో ఈ ట్రెండ్ ఇక్కడ పెరిగింది. సోషల్ మీడియాలో FOMO (Fear Of Missing Out) భయంతో కొత్త ట్రెండ్స్‌ను ట్రై చేయాలనుకునే కంటెంట్ క్రియేటర్లు, ఇన్ ఫ్లూయెన్సర్లు ఇప్పుడు ఈ మార్కెట్ బయట క్యూ కడుతున్నారు.

Advertisement

నిజానికి ఇందులో పెద్ద వింతేమీ లేదు. కొరియా వీధుల్లోని కన్వీనియన్స్ స్టోర్లలో దొరికే చాలా సాధారణ డ్రింక్ ఇది. కానీ ఇంటర్నెట్ మహత్యం వల్ల ఇదొక పెద్ద మోడ్రన్ ఆర్ట్ లాగా మారిపోయింది. ఆ ఐస్ క్యూబ్స్ శబ్దం, జ్యూస్ పోసేటప్పుడు వచ్చే విజువల్స్ ASMR కమ్యూనిటీని జనాన్ని ఆకట్టుకోవడంతో ఇది వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయింది.

‘సెల్ఫ్ సర్వీస్’:
ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే.. కౌంటర్ లో ఎవరో ఒకరు మనకు డ్రింక్ కలిపి ఇవ్వరు. సూపర్ మార్కెట్‌లోకి వెళ్లి మొత్తం ప్రాసెస్ మనమే ఓపికగా చేసుకోవాలి. ఇదొక డీఐవై (DIY – Do It Yourself) ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. దీని కోసం ముందుగా ఫ్రీజర్ నుంచి ఐస్ కప్ తీసుకోవాలి, ఆ తర్వాత మీకు నచ్చిన ఫ్లేవర్ ప్యాకెట్ సెలక్ట్ చేసుకుని ..దానిని ఐస్ కప్ లో వేసి.. కాస్త షేక్ చేసి తాగేయడమే.

క్రింది ఫ్లేవర్ చాలా ఫేమస్:
హాజెల్‌నట్ కాఫీ (Hazelnut Coffee)

బనానా మిల్క్ (Banana Milk)

ఆరెంజ్ ఏడ్ (Orange Ade)

బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, మామిడి (Mango)

గ్రీన్ గ్రేప్ (Green Grape)

వనిల్లా అమెరికానో (Vanilla Americano)

Also Read: పళ్లతో బాటిల్ క్యాప్స్ తీస్తున్నారా? ఎంత పెద్ద ప్రమాదమో తెలుసుకోండి!

రేట్ చూస్తే ఫ్యూజులు అవుట్!
ఇక అసలు విషయానికి వస్తే.. ఈ ఐస్ కప్ అండ్ జ్యూస్ కాంబో ధర రూ. 235 గా ఫిక్స్ చేశారు. కేవలం ఐస్ ముక్కలు, కొద్దిగా రెడీమేడ్ జ్యూస్ ఉన్న కప్పుకు ఇంత రేటా? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. “ఇంట్లో ఫ్రిజ్ లో ఐస్ ముక్కలు వేసుకుని రూ.10 ఇన్‌స్టంట్ డ్రింక్ మిక్స్ పౌడర్ కలుపుకుంటే అయిపోతుంది కదా బ్రో” అంటూ కొందరు ఫన్నీ కామెంట్స్ పెడుతుంటే.. కే-పాప్, కొరియన్ కల్చర్ ని అమితంగా ప్రేమించే ఫ్యాన్స్ మాత్రం “ఎక్స్‌పీరియన్స్ ముఖ్యం బిగిలూ” అంటూ లైన్లలో నిలబడి మరి కొంటున్నారు.

Tags

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×