E-Paper
Advertisement

Gold-Silver Prices Today: కలిసొచ్చిన ఆషాఢం.. బంగారం-వెండి ధరలు పతనం, ఈ రోజు మార్కెట్లో ధరలు

Gold-Silver Prices Today: కలిసొచ్చిన ఆషాఢం.. బంగారం-వెండి ధరలు పతనం, ఈ రోజు మార్కెట్లో ధరలు
Advertisement

Gold-Silver Prices Today:  అంతర్జాతీయ మార్కెట్ల వ్యతిరేక పవనాలు బులియర్ వర్గాలకు కలిసొచ్చింది. వరుసగా రెండు రోజులు పెరిగిన బంగారం ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. అటు వెండిదీ అదే పరిస్థితి. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ధరలు హెచ్చుతగ్గులకు లోను కావచ్చని చెబుతున్నాయి బులియన్ మార్కెట్ వర్గాలు. ఆదివారం మార్కెట్లో వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం.

అంతర్జాతీయ పరిణామాలు.. కలిసొచ్చిన ఆషాఢం-అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. ఈ తరుణంలో హోర్మూజ్ జలసంధి మూసివేసింది ఇరాన్. దీంతో బంగారం ధరలు పతనం కావచ్చనే వార్తలు వెలువడుతున్నాయి. హోర్ముజ్ గుండా ప్రయాణిస్తున్న ఓ నౌకపై ఇరాన్ కాల్పులు, ఆ తర్వాత వాషింగ్టన్ ఈ వారం టెహ్రాన్‌పై మూడో విడత దాడులు ప్రారంభించింది. ఫలితంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

Advertisement

జరుగుతున్న పరిణామాలను బులియన్ మార్కెట్ వర్గాలు గమనిస్తున్నాయి. ఆదివారం కాస్త ధరలు దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 23 డాలర్ల మేరా తగ్గింది. ప్రస్తుతం  ఔన్స్ బంగారం ధర 4108 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 1.03 శాతం మేర కుంగింది. ప్రస్తుతం  ఔన్స్ వెండి 59.7 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

మార్కెట్లో బంగారం-వెండి ధరలు పతనం-ఈ వారం కూడా హెచ్చుతగ్గులకు లోనుకావచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలలో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్- గోల్డ్ మిడ్-ఇయర్ అవుట్‌లుక్-2026 నివేదిక మేరకు ఔన్సు బంగారం ధర 4,500 డాలర్ల వైపు పెరిగే అవకాశముందని సూచించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఒక్కసారి చూద్దాం.

Advertisement

ఆదివారం ఉదయం 7 గంటలకు మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల  బంగారం రేటు రూ.1,44,330 వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,32,300 వద్ద కొనసాగుతోంది. బంగారంతో పాటు వెండి రేటు భారీగా తగ్గింది. కిలో వెండి రేటు హైదరాబాద్‌ మార్కెట్లో రూ.2,40,000 వద్ద కొనసాగుతోంది. వారం రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన వెండి, జులై 4 తర్వాత చూస్తే రూ.20 వేల వరకు తగ్గింది.

ALSO READ: పసిడి ప్రియులకు ఊరట.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే!

న్యూఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 143,510 వద్ద ఉంది. 22 క్యారెట్లు ధర  రూ.  131,551 వద్ద పలుకుతోంది. ఇక ముంబై  మార్కెట్ విషయానికి వద్దాం. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 143,760 వద్ద ఉండగా,  22 క్యారెట్లు ధర  రూ.  131,780 వద్ద పలుకుతోంది. బెంగుళూరు మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 143,870 వద్ద ఉండగా, 22 క్యారెట్లు ధర  రూ.  131,881 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది.

కోల్‌కతా మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 143,570 కాగా.. 22 క్యారెట్లు ధర  రూ.  131,606 వద్ద పలుకుతోంది. బంగారంతో పాటు వెండి ధరలు భారీగా తగ్గింది. ఏకంగా రూ.5 వేలు మేరా తగ్గింది.  ఆదివారం  కిలో వెండి రూ.2,40,000 వద్ద ట్రేడవుతోంది. దీనికితోడు బుధవారం నుంచి ఆషాఢమాసం రానుండడంతో కొనుగోళ్లు తగ్గుతాయని, ఆ నేపథ్యంలో ధరలు తగ్గే అవకాశముందని అంటున్నాయి బులియన్ వర్గాలు.

 

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×