E-Paper
Advertisement

Vaseline on Face: ముఖానికి వాజిలిన్ వాడొచ్చా? చర్మ నిపుణులు చెబుతున్న అసలు నిజాలు ఇవే!

Vaseline on Face: ముఖానికి వాజిలిన్ వాడొచ్చా? చర్మ నిపుణులు చెబుతున్న అసలు నిజాలు ఇవే!
Advertisement

Vaseline on Face: మన చిన్నప్పటి నుంచీ ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా కనిపించే సాధారణమైన వస్తువు వాజిలిన్. పెదాలు పగిలినప్పుడు, చర్మం ఎక్కువగా పొడిబారినప్పుడు వెంటనే గుర్తొచ్చేది ఇదే. కానీ ఇది కేవలం డ్రై స్కిన్‌కు మాత్రమే ఉపయోగపడే క్రీమ్ అనుకుంటే పొరపాటే. దీనిని సరైన విధంగా వాడితే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చని స్కిన్ నిపుణులు చెబుతున్నారు. అంతగా మనం పట్టించుకోని ఈ క్రీమ్‌లో దాగున్న ఆసక్తికరమైన ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చర్మ సంరక్షణలో వాజిలిన్ పాత్ర:

చర్మాన్ని సంరక్షించే విషయంలో వాజిలిన్ గురించి చాలామందికి చిన్నచిన్న సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా ముఖానికి వాజిలిన్ రాసుకోవాలా, వద్దా? అన్న ప్రశ్న ఎక్కువగా వినిపిస్తుంటుంది. వాజిలిన్ అనేది పెట్రోలియం జెల్లీతో తయారైన ఒక మాయిశ్చరైజర్. సరైన విధంగా, అవసరమైన మోతాదులో వాడితే ఎక్కువ మందికి ఇది సురక్షితమే అని నిపుణులు సూచిస్తున్నారు. అసలు విషయం మనం వాజిలిన్‌ను వాడే పద్ధతిలోనే ఉందని చెబుతున్నారు.

Advertisement

Also Read: మాయా లేదు మంత్రం లేదు.. ఏడు పవర్‌ఫుల్ సైంటిఫిక్ ట్రిక్స్‌తో శరీరాన్ని వెంటనే రీసెట్ చేయొచ్చు!

వాజిలిన్ చర్మానికి చేసే మేలు:

వాజిలిన్ చర్మంపై పలుచని రక్షణ పొరలా కప్పి, లోపల ఉన్న తేమ బయటకు ఆవిరైపోకుండా కాపాడుతుంది. అందుకే చర్మం ఎక్కువసేపు సాఫ్ట్‌గా, హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో లేదా డ్రై స్కిన్ సమస్య ఎక్కువగా ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరంగా మారుతుంది. అంతేకాదు.. వాతావరణ కాలుష్యం, దుమ్ము వంటి హానికరమైనవి చర్మాన్ని నేరుగా తాకకుండా ఒక షీల్డ్‌లా వాజిలిన్ పనిచేస్తుంది.

వాడేటప్పుడు జాగ్రత్తలు అవసరం:

Advertisement

అయితే వాజిలిన్ ప్రతి ఒక్కరికీ ఒకేలా పనిచేస్తుందని అనుకోవడం పొరపాటే. ఆయిల్ ఎక్కువగా వచ్చే చర్మం లేదా మొటిమల సమస్య ఉన్నవారిలో ఇది రంధ్రాల్లో ఆయిల్, మురికిని బంధించే అవకాశం ఉంది. దాంతో మొటిమలు పెరిగే అవకాశమూ ఉంది. అలాగే కొంతమందిలో అరుదుగా ఎర్రదనం, దురద లేదా మంట వంటి అలర్జీ లక్షణాలు కూడా కనిపించవచ్చు. అందుకే మొదట చేతిమీద చిన్న భాగంలో ట్రై చేసి చూసుకోవడం మంచిది.

వాడే విధానం తెలియాలి:

ముఖాన్ని శుభ్రంగా కడిగిన వెంటనే చర్మం కొంచెం తడిగా ఉన్నప్పుడు వాజిలిన్ అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వేళ్లతో తీసుకుని చాలా పలుచని పొరగా మాత్రమే రాయాలి. ఎక్కువగా రాస్తే చర్మం బరువుగా అనిపించవచ్చు. అలాగే వాజిలిన్‌ను కళ్ల చుట్టూ చాలా జాగ్రత్తగా వాడాలి. లేదంటే కంట్లోకి వెళ్తే దురద, మంట వంటి సమస్యలు రావొచ్చు.

ముఖానికి మాత్రమే కాదు:

వాజిలిన్‌ను కేవలం ముఖానికి మాత్రమే కాదు.. పెదాలు పగిలినప్పుడు, కంటి పలకల డ్రైనెస్ తగ్గించేందుకు, చిన్న గాయాలు త్వరగా మానేందుకు కూడా వాడొచ్చు. అలాగే స్కిన్ కేర్ సీరమ్‌లు లేదా నైట్ క్రీమ్‌లు వేసిన తర్వాత చివరిగా వాసెలిన్ అప్లై చేస్తే, అవి చర్మంలో ఎక్కువసేపు నిలిచి పనిచేయడానికి సహాయపడుతుంది. మీ చర్మం వాజిలిన్‌కు అలవాటు పడితే ఇది చాలా సింపుల్‌, చౌకగా దొరికే, ఎఫెక్టివ్ మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుంది. అయితే ఏదైనా అసౌకర్యం లేదా ఇర్రిటేషన్ అనిపిస్తే వెంటనే వాడటం ఆపేయడం ఉత్తమం.

Also Read: సూపర్ ఫుడ్ అడవి లింగుడా.. మీ డైట్‌లో తప్పక ఉండాల్సిన శక్తివంతమైన కూరగాయ!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×