E-Paper
Advertisement

Pani Puri: పానీ పూరి తింటూ దవడ విరగొట్టుకున్న మహిళ.. ఇలా మీకూ జరగొచ్చు!

Pani Puri: పానీ పూరి తింటూ దవడ విరగొట్టుకున్న మహిళ.. ఇలా మీకూ జరగొచ్చు!
Advertisement

Pani Puri: వయసుతో సంబంధం లేకుండా చాలామంది పానీపూరీలను ఎంతో ఇష్టంగా తింటుంటారు. పానీపూరీ చేయడంలో చాలామంది అపరిశుభ్రంగా వ్యవహరించడం చూస్తూనే ఉంటాం. కొందరు అపరిశుభ్రమైన చేతులతో పూరీ వడ్డిస్తుంటే.. మరికొందరు పానీలో మురుగు నీటిని కలుపుతుంటారు. కళ్లముందు ఇంత జరుగుతున్నా పానీపూరీ లవర్స్ మాత్రం వీటిని తినడం మాత్రం ఆపరు. ఇవేమీ పట్టించుకోకుండా తమకు నచ్చిన ప్రాంతానికెళ్లి మరీ పానీపూరీని లాగించేస్తుంటారు. అయితే తాజాగా యూపీకి చెందిన ఓ మహిళ గోల్గప్పాలు(పానీపూరీ) తింటూ దవడ విరగొట్టుకుంది. ఇప్పుడా మహిళ భరించలేనంత దవడ నొప్పితో ఆసుపత్రి పాలైంది.

తాజాగా 42 ఏళ్ల దేవి అనే మహిళ గోల్గప్పాలు(పానీపూరీ) తినడానికి వెళ్లి ఆసుపత్రి పాలైన అరుదైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. దేవి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయాగ్‌కు పని కోసం వెళ్లింది. ఆ పక్కనే ఉన్న ఓ దుకాణంలో పానీపూరి తిందామని వెళ్లింది. అయితే అక్కడ పానీపూరిని నోటిలో పెట్టుకుంటుండగా.. ఆమె దవడజారి నోరు మూసుకోలేకపోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కంగారుపడి చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు తీవ్రమైన దవడ నొప్పి వచ్చింది. పరీక్షించిన వైద్యులు ఆమె దవడను సరిచేయడానికి ఎంత ప్రయత్నించినా కుదరలేదు. దీంతో ప్రత్యేక చికిత్స కోసం దేవిని చిచోలి మెడికల్ కాలేజీకి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, ఇలాంటి విషయాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యలు హెచ్చరిస్తున్నారు.

అమ్మాయిలూ జాగ్రత్త పడండి:

Advertisement

అధిక శాతం అమ్మాయిలే పానీపూరీలను ఇష్టంగా తింటుంటారు. ఈ క్రమంలో పానీపూరీ తినేటప్పుడు నోటిని చాలా వెడల్పుగా తెరుస్తుంటారు. ఇలా చేయడం వలన దవడ జారిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు.  పూరీ సైజు కంటే నోటిని వెడల్పుగా తెరవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి.. పానీపూరీ తినేటప్పుడు నోటిని పెద్దగా కాకుండా.. నెమ్మదిగా తెరుస్తూ తినడం సరైన పద్ధతి అని చెబుతున్నారు.

ఆరోగ్యానికి ముప్పే:

రోడ్‌సైడ్ దొరికే పానీపూరీల వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా పానీపూరీలో రుచి కోసం ఉప్పును ఎక్కువగా వాడుతుంటారు. అలాగే తెల్లటి మైదా పిండిని వినియోగిస్తుంటారు. ఇవి బరువును ఆటోమెటిక్‌గా పెంచేస్తుంటాయి. సోడియం కంటెంట్‌ అధికంగా వినియోగిస్తే జీర్ణ వ్యవస్థ పొరను దెబ్బ తీస్తుంది. ఇక పానీపూరీ నీళ్లలో కలిపే పచ్చిమిర్చి ముద్ద, ఇతర పదార్థాలతో అల్సర్‌ వచ్చే అవకాశం ఉంది. అలాగే పానీపూరీ దుకాణాల్లో వినియోగించే నీరు అపరిశుభ్రంగా ఉంటే రోగాల బారిన పడవచ్చు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×