E-Paper
Advertisement

Sweet corn chaat vs boiled chana: బరువు తగ్గాలంటే స్వీట్ కార్న్ తినాలా? శనగలు తినాలా? ఇదిగో ఫుల్ క్లారిటీ!

Sweet corn chaat vs boiled chana: బరువు తగ్గాలంటే స్వీట్ కార్న్ తినాలా? శనగలు తినాలా? ఇదిగో ఫుల్ క్లారిటీ!
Advertisement

Sweet corn chaat vs boiled chana: బరువు తగ్గాలనుకునే వారు తమ డైట్‌లో ప్రోటీన్, ఫైబర్ ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో బయట దొరికే ఆహార పదార్థాలు కాకుండా ఇంట్లోనే తయారు చేసుకునే హెల్తీ స్నాక్స్ విషయానికి వస్తే.. స్వీట్ కార్న్ చాట్, ఉడికించిన శనగలు బెస్ట్ ఆప్షన్స్. అయితే ఈ రెండింటిలో వెయిట్ లాస్ జర్నీకి ఏది బెస్ట్ అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఇప్పుడీ రెండింటిలో ఏది తింటే త్వరగా బరువు తగ్గుతారో తెలుసుకుందాం రండి..

పోషక విలువల పరంగా చూస్తే..

స్వీట్ కార్న్‌లో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్ బి ఎక్కువగా ఉంటాయి. ఇది తక్షణ శక్తిని ఇస్తుంది కానీ, దీనిలో షుగర్ కంటెంట్ కూడా కాస్త ఎక్కువే. అదే ఉడికించిన శనగల విషయానికి వస్తే.. వీటిలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తూనే ఆకలిని నియంత్రించడంలో సహాయపడతాయి.

Advertisement

Also Read: క్యాన్సర్ కణాలకు మరణశాసనం.. కొత్త యాంటీబాడీతో ప్రాణాంతక వ్యాధికి అడ్డుకట్ట!

ఆకలిని తగ్గించే ప్రోటీన్..

బరువు తగ్గడంలో ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. శనగల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల వీటిని తింటే కడుపు నిండుగా అనిపిస్తుంది. దీంతో అనవసరమైన చిరుతిళ్లు తినాలనే కోరిక తగ్గుతుంది. స్వీట్ కార్న్‌లో ప్రోటీన్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి.. ఇది తిన్న కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేసే అవకాశం ఉంది.

అలాంటి వాళ్లు శనగలు తినొద్దు..

Advertisement

శనగల్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా చూస్తుంది. ఇక స్వీట్ కార్న్ గ్లైసెమిక్ ఇండెక్స్ కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల ఇది రక్తంలో షుగర్ లెవల్స్‌ను ప్రభావితం చేయొచ్చు. ముఖ్యంగా ఇన్సులిన్ సమస్యలు ఉన్నవారు శనగలను తినడమే మంచిది.

రెండింటిలో ఏది బెస్ట్?

ఒకవేళ మీరు వేగంగా బరువు తగ్గాలనుకుంటే మాత్రం ఉడికించిన శనగల్ని తినవచ్చు. స్వీట్ కార్న్‌ను అప్పుడప్పుడూ తినవచ్చు. కానీ అందులో వెన్న లేదా చీజ్ వంటివి కలపకుండా చూసుకోవాలి. ఈ రెండూ ఆరోగ్యకరమైనవే అయినా, వెయిట్ లాస్‌కు మాత్రం శనగలే ముందుంటాయి.

Also Read: 16 ఏళ్ల బాలిక కిడ్నీలో రాళ్లు.. ఈ చిన్న పొరపాటే శాపంగా మారుతోందంటున్న నిపుణులు!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×