E-Paper
Advertisement

Health Tips: పాలకూరను పచ్చిగా తింటే ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Health Tips: పాలకూరను పచ్చిగా తింటే ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?
Advertisement

Health Tips: సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడానికి మన డైట్‌లో ఆకుకూరలు, తాజా పండ్లను చేర్చుకుంటుంటాం. ముఖ్యంగా పాలకూరను ఆహారంలో భాగం చేసుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వైద్యులు కూడా చెబుతుంటారు. అయితే ఐరన్, కాల్షియం, విటమిన్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే పాలకూరను రోజూ తినడం కంటే.. ఎలా తింటున్నాం అన్నదే చాలా ముఖ్యం.

చాలామంది బరువు తగ్గాలనే ఉద్దేశంతో, ఫిట్‌నెస్ కోసం పాలకూరను జ్యూస్ చేసుకుని తాగడం, సలాడ్లలో కలుపుకుని పచ్చిగానే తినేస్తుంటారు. కానీ.. ఇలా పచ్చిగా తినడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Also Read: పాదాలు అందవిహీనంగా మారాయా? పార్లర్‌కు వెళ్లకుండా ఇంట్లోనే కోమలంగా మార్చుకోండిలా!

జీర్ణవ్యవస్థపై ఒత్తిడి..

పచ్చి పాలకూరను నేరుగా తీసుకున్నప్పుడు అది జీర్ణం కావడం శరీరానికి చాలా కష్టమైన పని. అందులో ఉండే అధిక పీచు పదార్థాన్ని విచ్ఛిన్నం చేయడానికి జీర్ణవ్యవస్థపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. దీంతో రాత్రిపూట ఎక్కువగా కడుపులో మంట రావడం, వాంతులు, విరేచనాలు వంటి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు.

అనేక ఆరోగ్య సమస్యలు..

Advertisement

పాలకుర ఆకులపై ఉండే హానికరమైన బ్యాక్టీరియా నేరుగా శరీరంలోకి చేరి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. అందుకే పాలకూరను ఎప్పుడూ పచ్చిగా కాకుండా.. కనీసం ఆవిరి మీదైనా ఉడికించి తీసుకోవడం మంచి పద్థతి.

పూర్తి పోషకాలు అందాలంటే..

పాలకూరను ఉడికించి తినడం వల్ల అందులోని పోషకాలను మన శరీరం సులభంగా గ్రహిస్తుంది. ముఖ్యంగా మన తెలుగు వారి సంప్రదాయం ప్రకారం పాలకూరను పప్పుతో కలిపి వండుకోవడం చాలా మంచి అలవాటు. ఇలా చేయడం వల్ల రుచితో పాటు పూర్తిస్థాయిలో పోషకాలు కూడా అందుతాయి.

అలాంటి వారికి ఔషధం..

రక్తహీనతతో బాధపడే మహిళలకు, ఎముకల బలంగా మారాలని కోరుకునే వారికి పాలకూర ఔషధమనే చెప్పాలి. ఏ పదార్థాన్నైనా సరైన పద్ధతిలో వండుకుని తిన్నప్పుడే అది మన శరీరానికి అమృతంలా పనిచేస్తుంది.

Also Read: మార్నింగ్ బ్రష్ చేయడానికి ఎంత టైం కేటాయిస్తున్నారు? ఈ ‘రెండు నిమిషాల’ మ్యాజిక్ గురించి తెలుసా?

 

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×