E-Paper
Advertisement

ఫ్రిజ్ సరిగా కూలింగ్ ఇవ్వడం లేదా? ఈ పేపర్ టెస్ట్‌తో సమస్యను తెలుసుకొని వెంటనే సరిచేయండి

ఫ్రిజ్ సరిగా కూలింగ్ ఇవ్వడం లేదా? ఈ పేపర్ టెస్ట్‌తో సమస్యను తెలుసుకొని వెంటనే సరిచేయండి
Advertisement

వేసవికాలంలో ఫ్రిజ్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఫ్రిజ్ నిరంతరం పనిచేసినా సరైన కూలింగ్ ఇవ్వదు. ఫ్రీజర్‌లో మంచు సరిగా ఏర్పడదు. ఆహార పదార్థాలు కూడా తగినంత చల్లగా ఉండవు. చాలామంది వెంటనే గ్యాస్ తగ్గిపోయిందని అనుకుంటారు. అయితే ప్రతి సారి గ్యాస్ తగ్గిపోవడమే కారణం ఉండదు. కొన్నిసార్లు ఫ్రిజ్ డోర్ రబ్బర్ సీల్ సరిగా మూసుకోకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.

డోర్ రబ్బర్ సీల్ ఎందుకు ముఖ్యమైనది?

ఫ్రిజ్ డోర్ చుట్టూ ఉండే రబ్బర్ గ్యాస్కెట్ గాలి బయటకు వెళ్లకుండా అడ్డుకుంటుంది. ఈ సీల్ సరిగా లేకపోతే చల్లని గాలి బయటకు వెళ్లిపోతుంది. అదే సమయంలో బయట గాలి ఫ్రిజ్‌లోకి వస్తుంది. దీంతో కంప్రెసర్ ఎక్కువసేపు పనిచేయాల్సి వస్తుంది. దీనివల్ల విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుంది. అలాగే ఫ్రిజ్ కూలింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది.

పేపర్‌ టెస్ట్‌తో సులభంగా తెలుసుకోండి

Advertisement

ఈ పరీక్ష కోసం ఒక సాధారణ కాగితం సరిపోతుంది. కాగితాన్ని ఫ్రిజ్ డోర్, బాడీ మధ్యలో ఉంచండి. తరువాత డోర్‌ను పూర్తిగా మూసివేయండి. ఇప్పుడు కాగితాన్ని నెమ్మదిగా బయటకు లాగండి. కాగితం గట్టిగా ఇరుక్కుపోతే డోర్ సీల్ సరిగా పనిచేస్తోంది. కాగితం చాలా సులభంగా బయటకు వస్తే రబ్బర్ సీల్ సరిగా మూసుకోవడం లేదని అర్థం. దీంతో చల్లని గాలి బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది.

డోర్ రబ్బర్ సీల్‌ను ఎలా సరిచేయాలి?

రబ్బర్ కొద్దిగా వదులుగా ఉంటే ఇంట్లోనే సరిచేయవచ్చు. ఇందుకోసం హెయిర్ డ్రైయర్‌ను తక్కువ లేదా మీడియం వేడిపై ఉంచాలి. రబ్బర్ సీల్‌పై .. పై నుంచి కింద వరకు సమానంగా వేడి గాలిని పంపాలి. ఎక్కువసేపు ఒకే చోట వేడి చేయకూడదు. అలా చేస్తే రబ్బర్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. వేడి చేసిన తర్వాత రబ్బర్ సహజంగా చల్లబడే వరకు వేచి ఉండాలి.

మళ్లీ పేపర్ టెస్ట్ చేయండి

Advertisement

రబ్బర్‌ను సరిచేసిన తర్వాత మరోసారి అదే కాగితం పరీక్ష చేయాలి. ఈసారి కాగితం గట్టిగా పట్టుకుని ఉంటే సీల్ సరిగ్గా పనిచేస్తోందని అర్థం. ఫ్రిజ్ కూడా మళ్లీ బాగా చల్లబరుస్తుంది. అయినప్పటికీ కాగితం సులభంగా బయటకు వస్తే రబ్బర్ మార్చాల్సి రావచ్చు. అలాంటి పరిస్థితిలో అనుభవం ఉన్న టెక్నీషియన్‌ను సంప్రదించడం మంచిది.

Also Read: టీలో ఈ రెండు వేస్తే ఎన్నో ప్రయోజనాలు.. ఆరోగ్య సమస్యలు కూడా దూరం.. డాక్టర్ చెప్పిన చిట్కా

డోర్ సీల్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి

ఫ్రిజ్ రబ్బర్ సీల్‌ను ప్రతి రెండు లేదా మూడు వారాలకు ఒకసారి శుభ్రం చేయాలి. దుమ్ము, ఆహార కణాలు సీల్‌పై పేరుకుపోతాయి. దీంతో డోర్ పూర్తిగా మూసుకోకపోవచ్చు. ఒక మెత్తని గుడ్డతో, తేలికపాటి సబ్బు నీటితో శుభ్రం చేయండి. తరువాత పూర్తిగా ఆరబెట్టండి. ఇలా చేస్తే ఫ్రిజ్ కూలింగ్ మెరుగుపడుతుంది. విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×