E-Paper
Advertisement

శరీరంలో నుంచి మలినాలు తొలగించే సూపర్ డ్రింక్స్.. లివర్ ఆరోగ్యానికి ఆయుర్వేద డాక్టర్ సూచనలు

శరీరంలో నుంచి మలినాలు తొలగించే సూపర్ డ్రింక్స్.. లివర్ ఆరోగ్యానికి ఆయుర్వేద డాక్టర్ సూచనలు
Advertisement

శరీరంలో వ్యర్థ పదార్థాలు క్లీన్ చేయడం, మలినాలు తొలగించే ముఖ్యమైన పని లివర్ చేస్తుంది. అందుకే లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి చాలా మంది ఖరీదైన డిటాక్స్ డ్రింక్స్‌ను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ సలీమ్ జైదీ ఇంట్లోనే సులభంగా తయారయ్యే కొన్ని డ్రింక్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం.. ఇవి జీర్ణక్రియకు, లివర్ సాధారణ పనితీరుకు సాయపడతాయి. అయితే ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, తగినంత నీరు తాగడం కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోవాలి.

సొరకాయ జ్యూస్

డాక్టర్ జైదీ సొరకాయ రసాన్ని లివర్ ఆరోగ్యానికి ఉపయోగకరమైన డ్రింక్‌గా సూచిస్తున్నారు. సొరకాయలో శరీరానికి అవసరమైన పోషకాలు, సహజమైన మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. ఇవి లివర్ కణాల సాధారణ పనితీరుకు మద్దతు ఇస్తాయని డాక్టర్ తెలిపారు. సొరకాయలో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వేసవిలో ఇది శరీరానికి చల్లదనాన్ని అందించే పానీయంగా ఉపయోగపడుతుంది.

సొరకాయ జ్యూస్ తయారీ విధానం

Advertisement

తాజా సొరకాయ ముక్కలను ఒక గిన్నె తీసుకోవాలి. వాటిని ఒక గ్లాసు నీటితో కలిపి బ్లెండ్ చేయాలి. తరువాత వడకట్టి కొద్దిగా నల్ల ఉప్పు కలిపి తాజాగా తాగాలి. చేదుగా ఉన్న సొరకాయను మాత్రం ఉపయోగించకూడదు.

జీరా వాటర్

జీలకర్ర భారతీయ వంటల్లో విస్తృతంగా ఉపయోగించే మసాలా దినుసు. ఇందులోని సహజ పదార్థాలు జీర్ణక్రియకు తోడ్పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. డాక్టర్ జైదీ ప్రకారం.. జీలకర్ర లివర్ ఎంజైమ్‌ల పనితీరుకు సాయపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడితే శరీరం కూడా చురుకుగా పనిచేస్తుంది.

జీరా వాటర్ ఎలా తయారు చేయాలి

Advertisement

ఒక టీస్పూన్ జీలకర్రను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని మరిగించి వడకట్టి గోరువెచ్చగా తాగాలి.

గోరువెచ్చని నిమ్మరసం

నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. చాలామంది ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతారు.
డాక్టర్ సూచనల ప్రకారం.. ఇది లివర్ ఉత్పత్తి చేసే బైల్ జ్యూస్ (పిత్తరసం) తయారీ సాయపడుతుంది. పిత్తరసం కొవ్వు జీర్ణానికి సహాయపడుతుంది.

Also Read: మనిషి చేసే ఈ తప్పుల వల్లే పేదరికం.. చెడు అలవాట్లు ఈ రోజే మానుకోండి

నిమ్మరసం తయారీ విధానం

గోరువెచ్చని నీటిలో అర నిమ్మకాయ రసం పిండాలి. ఉదయం ఖాళీ కడుపుతో తాగవచ్చు. ఎక్కువ చక్కెర కలపకుండా తీసుకోవడం మంచిది.

ఆరోగ్యకరమైన జీవనశైలి అత్యంత ముఖ్యం

ఈ డ్రింక్స్ మాత్రమే లివర్‌ను పూర్తిగా ఆరోగ్యంగా ఉంచలేవు. సమతుల ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరిపడా నిద్రపోవడం, నీరు ఎక్కువగా తాగడం కూడా చాలా అవసరం. ఇప్పటికే లివర్ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఆహారంలో పెద్ద మార్పులు చేసే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.

Also Read: గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ.. ఏది తాగితే బరువు త్వరగా తగ్గుతారు?

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×