E-Paper
Advertisement

తల్లిదండ్రులు ఈ తప్పులు అసలు చేయకూడదు.. పిల్లలు మనసులో ద్వేష భావన కలుగుతుంది

తల్లిదండ్రులు ఈ తప్పులు అసలు చేయకూడదు.. పిల్లలు మనసులో ద్వేష భావన కలుగుతుంది
Advertisement

తల్లిదండ్రులు తమ పిల్లలు కోరుకునే ప్రతిదీ ఇవ్వాలని కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు తెలియకుండానే వారి పెంపకంలో తప్పులు చేస్వారు. ఈ తప్పులు అలవాటుగా మారితే పిల్లలు మీ అనుబంధం ప్రభావితం అవుతుంది. ఈ తప్పులు ఎక్కువగా బిజీగా ఉన్నప్పుడు లేదా ఒత్తిడిలో జరుగుతాయి. దీని వల్ల క్రమంగా పిల్లలు మీ నుంచి మానసికంగా దూరం అవుతారు. మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. అందుకే పిల్లల పెంపకంలో కఠిన నియమాల కంటే మారితో ఎమోషనల్ రిలేషన్ చాలా ముఖ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పిల్లల భావాలను నిర్లక్ష్యం చేయడం

చాలా మంది తల్లిదండ్రులు పిల్లల మనోభావాలను నిర్లక్ష్యం చేస్తారు. వారు చెప్పే విషయాలను తోసిపుచ్చేస్తారు. వారి ఇబ్బందులు, భయం లేదా నిస్పృహను పట్టించుకోరు. దీంతో పిల్లలు తమ భావాలకు కుటుంబంలో ప్రాముఖ్యత లేదని భావిస్తారు. క్రమంగా వారు తమ మనసులోని విషయాలను చెప్పడం మానేస్తారు. తమ సమస్యలను తల్లిదండ్రులకు చెప్పరు.

కోపంతో స్పందించడం లేదా వారితో సరిగా మాట్లాడకపోవడం

Advertisement

పిల్లలు చేసిన చిన్న తప్పుకు కూడా అరవడం, తిట్టడం లేదా శిక్షించడం చాలా మంది తల్లిదండ్రులకు అలవాటు. దీంతో వారి మనసులో ఎప్పుడూ భయం ఉంటుంది. అప్పుడు పిల్లలు సమస్యలను దాచేస్తారు. తల్లిదండ్రులు కోపంతో స్పందించడం వల్ల నమ్మకం తగ్గి మానసిక దూరం పెరుగుతుంది. ప్రశాంతంగా వివరించడం ద్వారా పిల్లలు బాగా నేర్చుకుంటారు.

పిల్లల జీవితంలో ప్రతి విషయాన్ని నియంత్రించడం

కొందరు తల్లిదండ్రులు.. పిల్లల ఎవరితో స్నేహం చేయాలి, వారి అభిరుచులు ఎలా ఉండాలి, వారు ఏం చదువుకోవాలి అన్నీ తామే నిర్ణయిస్తారు. ఇది వారి రక్షణ కోసం చేసినా, పిల్లలు తమను నిర్బంధం చేసినట్లు భావిస్తారు. అధిక నియంత్రణ వల్ల ఆత్మవిశ్వాసం తగ్గి, తమ సంతోషం కోసం రహస్యంగా పనులు చేస్తారు. దీంతో తల్లిదండ్రులు, పిల్లల మధ్య నమ్మకం క్రమంగా నశిస్తుంది.

ఇతరులతో పిల్లలను పోల్చడం

Advertisement

పిల్లలను వారి సోదరులు, బంధువుల పిల్లలు లేదా తోటివారితో పోల్చడం అతి ప్రమాదకరమైన తప్పు. ‘ఆ పిల్లలు ఎంత బాగా చదువుతున్నారో చూడు, వారిలో ఎంత మంచి అలవాట్లు ఉన్నాయో చూడు’ అని సూటిపాటి మాటలు చెబితే పిల్లలు చాలా బాధపడతారు వారి ఆత్మగౌరవం దెబ్బతింటుంది. దీంతో వారిలో హీనభావన కలిగి.. నిరాశ, అసంతృప్తి చెందుతారు. ప్రతి పిల్లవాడు భిన్నంగా పెరుగుతాడని గుర్తించాలి.

పిల్లలతో కలిసి నాణ్యమైన సమయం గడపకపోవడం

ఈ రోజుల్లో ఉండే బిజీ లైఫ్ కారణంగా కుటుంబంతో ఎక్కువ సమయం గడపరు. ఒకవేళ ఇంట్లో ఉన్నా.. పిల్లలతో కేవలం వారి చదువు, భోజనం, బాధ్యతల గురించే మాట్లాడుతారు. భావోద్వేగ సంభాషణలు జరగవు. దీంతో పిల్లలు తమ తల్లిదండ్రులు వారిని నిర్లక్ష్యం చేస్తున్నట్లు భావిస్తారు.

మౌనంగా ఉండటం

కోపం లేదా నిరాశ వచ్చినప్పుడు పిల్లలతో మాట్లాడకుండా ఉండటం కొందరి అలవాటు. ఇది శిక్షగా భావిస్తారు. కానీ ఇలా చేయడం వల్ల పిల్లలు మానసికంగా అసురక్షితంగా భావించి, నిరాశకు గురవుతారు. ఇది ఆందోళన, ఆత్మవిశ్వాస లోపానికి దారి తీస్తుంది.

Also Read: ఒకే గర్భంలో ఒకేసారి పుట్టిన ఇద్దరు అమ్మాయిలకు తండ్రులు వేరు.. ఆ రహస్యం తెలిసి అందరూ షాక్

చిన్న మార్పులు సంబంధాలను మెరుగుపరుస్తాయి

తల్లిదండ్రులు ముందుస్తు అభిప్రాయం లేకుండా పిల్లలు చెప్పేది పూర్తిగా వినాలి. తప్పులు జరిగినప్పుడు మీరు కూడా క్షమాపణ చెప్పాలి. ప్రశాంతంగా మాట్లాడటం ద్వారా పిల్లలు భద్రతగా భావిస్తారు. భావోద్వేగ సంబంధం బలపరిస్తే కుటుంబం సంతోషంగా ఉంటుంది.

పిల్లలతో మంచి సంబంధం కావాలంటే ఓర్పు, భావోద్వేగ అవగాహన అవసరం. చిన్న చిన్న తప్పులు సరిదిద్దితే పిల్లలు మానసికంగా బలంగా, సంతోషంగా పెరుగుతారు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×