E-Paper
Advertisement

Summer Drinks: సమ్మర్‌ బెస్ట్ డ్రింక్స్.. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం

Summer Drinks: సమ్మర్‌ బెస్ట్ డ్రింక్స్.. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం
Advertisement

Summer Drinks: వేసవి కాలంలో శరీరం త్వరగా అలసిపోతుంది. అధిక చెమట వల్ల ఒంట్లోని నీరు, లవణాలు తగ్గిపోయి డీహైడ్రేషన్ (నీరసం) బారిన పడే అవకాశం ఉంది. ఈ సమయంలో కేవలం నీళ్లు తాగడమే కాకుండా.. శరీరానికి శక్తిని , చల్లదనాన్ని ఇచ్చే సహజమైన డ్రింక్స్ తీసుకోవడం చాలా అవసరం. కృత్రిమ రంగులు, చక్కెరలు ఉండే కూల్ డ్రింక్స్ కంటే ఇంట్లోనే తయారుచేసుకునే డ్రింక్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మీ ఆరోగ్యాన్ని కాపాడే కొన్ని బెస్ట్ సమ్మర్ డ్రింక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వేసవిలో ఆరోగ్యాన్నిచ్చే బెస్ట్ డ్రింక్స్:
1. అమృతం లాంటి మజ్జిగ:
మన పూర్వీకుల కాలం నుంచి మజ్జిగ అత్యుత్తమ డ్రింక్‌గా పేరుగాంచింది. పెరుగును చిలికి చేసిన మజ్జిగలో కొద్దిగా అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు , ఉప్పు కలిపి తాగితే శరీరం తక్షణమే చల్లబడుతుంది. ఇది కేవలం దాహాన్ని తీర్చడమే కాకుండా.. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. అంతే కాకుండా ఇది ఎండ వల్ల కలిగే కడుపులో మంటను తగ్గిస్తుంది.

Advertisement

2. శక్తినిచ్చే రాగి జావ:
రాగి జావను పోషకాల గని అని కూడా పిలుస్తారు. రాగి పిండిలో క్యాల్షియం, ఐరన్ ,పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. రాగి జావను తయారు చేసి అందులో మజ్జిగ కలుపుకుని తాగితే రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. ఇది బాడీ హీట్‌ను అద్భుతంగా తగ్గిస్తుంది.

3. హైడ్రేటింగ్ నిమ్మరసం:
తక్కువ ఖర్చుతో కూడిన అద్భుతమైన డ్రింక్ నిమ్మరసం. ఇందులో ఉండే విటమిన్-సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నిమ్మరసంలో కొద్దిగా తేనె లేదా పంచదార, చిటికెడు ఉప్పు కలిపి తాగడం వల్ల శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ అందుతాయి. పుదీనా ఆకులు కూడా కలిపితే ఇది మరింత రిఫ్రెషింగ్‌గా ఉంటుంది.

Advertisement

4. ప్రకృతి ప్రసాదించిన కొబ్బరి నీళ్లు:
వేసవిలో కొబ్బరి నీళ్లకు మించిన ఆరోగ్యకరమైన డ్రింక్ మరొకటి లేదు. ఇందులో పొటాషియం, మెగ్నీషియం , సోడియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఎండలో తిరిగి వచ్చిన వారు ఒక గ్లాసు కొబ్బరి నీళ్లు తాగితే శరీరానికి అవసరమైన తక్షణ శక్తి లభిస్తుంది. అంతే కాకుండా ఇది డీహైడ్రేషన్ నుంచి చాలా వరకు కాపాడుతుంది.

Also Read: ఎండాకాలంలో మీ ఇంటిని ఏసీ లేకుండానే చల్లగా ఉంచుకోండి ఇలా!

5. పుచ్చకాయ, పండ్ల రసాలు:
పుచ్చకాయలో 90% పైగా నీరు ఉంటుంది. పుచ్చకాయ ముక్కలను గ్రైండ్ చేసి అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగడం వల్ల శరీరం లోపల చల్లగా ఉంటుంది. అలాగే చెరకు రసం, సబ్జా గింజల నీళ్లు కూడా వేసవిలో శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. సబ్జా గింజలను నీటిలో నానబెట్టి ఏదైనా డ్రింక్‌లో కలుపుకుంటే చలవ చేస్తుంది. అంతే కాకుండా జీర్ణ సమస్యలు రాకుండా చేయడంలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.

6. బార్లీ నీళ్లు:
బార్లీ గింజలను ఉడకబెట్టిన నీటిని తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఇది కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా వేసవిలో వచ్చే మూత్ర సంబంధిత సమస్యలను నివారిస్తుంది. అంతే కాకుండా ఇది శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా ఉంచుతుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×