E-Paper
Advertisement

Electric Cars: ఈవీ కారు ఎక్కితే వికారం రావడానికి కారణం ఇదేనట.. పరిష్కారం కనుగొన్న మెర్సిడెస్!

Electric Cars: ఈవీ కారు ఎక్కితే వికారం రావడానికి కారణం ఇదేనట.. పరిష్కారం కనుగొన్న మెర్సిడెస్!
Advertisement

గత కొంతకాలంగా భారత్ లో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం గణనీయంగా పెరుగుతోంది. పెట్రో వాహనాలకు బదులుగా చాలా మంది గ్రీన్ ఎనర్జీ కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఎలక్ట్రిక్ కారులో ప్రయాణించే సమయంలో కొంత మంది తెలియని ఒకరకమైనా ఆనారోగ్యానికి  గురవుతారు. కొంత మందికి వికారం కలిగితే, మరికొంత మందికి తల తిరిగినట్లు అవుతుంది. దానికి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసింది మెర్సిడెస్. అసలు సమస్యను గుర్తించడంతో పాటు ఆ సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేసింది.

ఈవీ కారు ప్రయాణంలో వికారానికి కారణం ఏంటి?

కొంతమంది ప్రయాణీకులు ఎలక్ట్రిక్ కార్లులో చిన్ని చిన్న ప్రయాణాల్లో కూడా తల తిరుగుతున్నట్లు భావిస్తారు. దానికి కారణం పెట్రోల్ కార్ల మాదిరిగా కాకుండా ఈవీ కార్లు సున్నితంగా, నిశ్శబ్దంగా, వేగంగా మారడం అని మెర్సిడెస్ బెంజ్ గుర్తించింది. దానిని ఎలా పరిష్కరించాలో కూడా అదే కంపెనీ వెల్లడించింది.

ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలంటే?

Advertisement

ఎలక్ట్రిక్ వాహనాలు మోషన్ సిక్‌ నెస్‌ కు కారణం అవుతాయి. అంటే, ఎలక్ట్రిక్ వాహనాలు చాలా సున్నితంగా ఉంటాయి. కారు కదలబోతోందని హెచ్చరించడానికి ఇంజిన్ సౌండ్, గేర్ మార్పులు, షేకింగ్ లాంటివి ఉండవు. పెడల్ నొక్కగానే కారు వేగం పెరుగుతుంది. పెడల్ మీది నుంచి కాలు తీసివేయగానే రీ జెపరేటివ్ బ్రేకింగ్ కారణంగా కారు వేగం తగ్గుతుంది.  కారు వేగంగా వెళ్లే సమయంలో కళ్లు రోడ్డు మీద ఎగురుతూ వెళ్తున్నట్లు కనిపిస్తుంది. నిశ్శబ్దంగా కారు వేగం పెరగడం వల్ల ప్రయాణీకులకు సాధారణంగా వికారం కలుగుతుంది.

పరిశోధకులు ఏం చెప్పారంటే?

ఫ్రాన్స్‌ లోని యూనివర్సిటీ డి టెక్నాలజీ డి బెల్ఫోర్ట్ మోంట్‌ బెలియార్డ్ పరిశోధకులు ఎలక్ట్రిక్ కారు ప్రయాణీకులు ఎందుకు వికారానికి గురవుతారనే విషయాన్ని వెల్లడించారు. తక్కువ భౌతిక ఆధారాలు ఉన్నప్పుడు, నెక్ట్స్ ఏం జరుగుతుందో ఊహించడానికి మెదడు ఇబ్బంది పడుతుంది. ఇంజిన్ సౌండ్, గేర్ మార్పులు ఏవీ ఉండకపోవడం వల్ల ముందు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు మెదడు ప్రయత్నిస్తుంది. ఆ సమయంలోనే తల తిరిగినట్లు అవుతుంది.

సమస్య నుంచి ఎలా బయటపడాలంటే?  

Advertisement

వికారం, తల తిరగడం లాంటి సమస్య నుంచి తప్పించుకునేందుకు మెర్సిడెస్ ఓ పరిష్కారాన్ని గుర్తించింది. కారు వేగాన్ని గుర్తించేలా గాలి, లైట్ల ద్వారా తెలిపే ప్రయత్నం చేస్తుంది. మెర్సిడెస్ కొంచెం సైన్స్ ఫిక్షన్‌ గా అనిపించే వ్యవస్థకు పేటెంట్ పొందింది. శబ్దానికి బదులుగా, మెదడును మరింత నియంత్రణలో ఉన్నట్లు భావించేలా చేసేందుకు గాలి ప్రవాహం, పరిసర లైటింగ్‌ ను ఉపయోగించనుంది. కారు వేగం పెరిగినప్పుడు, వెంట్ల ద్వారా క్యాబిన్‌ లోకి ఎక్కువ గాలిని పంపిస్తాయి.  కారు నెమ్మదిగి వెళ్లే సమయంలో గాలి ప్రవాహం తగ్గుతుంది. అదే సమయంలో, లోపలి లైట్లు రంగును మారుతాయి. ఈ ఏర్పాట్ల ద్వారా వికారం, తలతిరుగుడు నుంచి తప్పించుకునే అవకాశం ఉన్నట్లు మెర్సిడెస్ వెల్లడించింది.

Read Also: మారుతి 800ను లంబోర్గినిగా మార్చేశాడు, ఈ మెకానిక్ క్రియేటిటీ పీక్స్ అంతే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×