E-Paper
Advertisement

మామిడి పచ్చిగా తినాలా లేక పండు తినాలా.. ఆరోగ్యానికి ఏది మంచిది?

మామిడి పచ్చిగా తినాలా లేక పండు తినాలా.. ఆరోగ్యానికి ఏది మంచిది?
Advertisement

Raw vs Ripe Mango Health Benefits| వేసవి అంటే మామిడి సీజన్. మామిడి కాయలన్నా.. పండ్లన్నా ఇష్టపడని వారుండరు. మామిడి పండ్ల సీజన్ వచ్చిందంటే ఇక మిగతా పండ్లకు డిమాండ్ తగ్గుతుంది. అయితే ఈ మామిడిని కొంతమంది పచ్చిగా తినడానికి ఇష్టపడితే, మరికొంతమంది మామిడి పండ్లని తింటారు. రెండూ ఆరోగ్యానికి మంచివే, అయితే రెండింటి ప్రయోజనాలు భిన్నంగా ఉంటాయి. మీ ఆరోగ్య అవసరాలు, రుచి ప్రకారం ఏది తినాలో ఎంచుకోవచ్చు.

మామిడికాయ, మామిడి పండు మధ్య పోషకాల తేడా

పచ్చి మామిడిలో ‘విటమిన్ సి’, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. మామిడిపండులో సహజ చక్కెర (నేచురల్ షుగర్), ‘విటమిన్ ఎ’ ఎక్కువగా ఉంటాయి. మామిడి పండుగా మారుటప్పుడు.. అందులోని స్టార్చ్ చక్కెరగా మారుతుంది. అందువల్ల పండిన మామిడి తీయగా, మెత్తగా ఉంటుంది.

పచ్చి మామిడి తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు

Advertisement

పచ్చి మామిడిలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ప్రేగులు హాయిగా ఉంటాయి. పచ్చి మామిడిలో చక్కెర తక్కువగా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణ కోసం చాలా మంచిది. వేసవిలో శరీరానికి నీరు అందించి, డీటాక్స్ చేయడంలో కూడా సహాయపడుతుంది.

మామిడి పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

పండిన మామిడి తీయగా, ఫుల్ జ్యూస్‌తో పోషకాలు ఎక్కువగా ఉంటుంది. ఇందులో ‘విటమిన్ ఎ’ ఎక్కువగా ఉండటం వల్ల కంటి ఆరోగ్యం మెరుగవుతుంది. బీటా కెరటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని రక్షిస్తాయి. నేచురల్ షుగర్స్ వల్ల త్వరగా శక్తి ఇస్తుంది. చర్మ ఆరోగ్యానికి కూడా పండిన మామిడి చాలా మంచిది.

ఆరోగ్యానికి ఏది మంచిది?

Advertisement

రెండూ ఆరోగ్యకరమైనవే. పచ్చి మామిడి జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, బ్లడ్ షుగర్ నియంత్రణకు మంచిది. మామిడిపండులో ఎనర్జీ, చర్మం, కంటి ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనం ఇస్తుంది. మీ శరీర అవసరాల ప్రకారం ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తారు.

ఎవరు పచ్చి మామిడి తినాలి?

జీర్ణ సమస్యలు ఉన్నవారు
బ్లడ్ షుగర్ నియంత్రించాలనుకునేవారు
పుల్లగా, తేలికగా ఉండే ఆహారం ఇష్టపడేవారు
వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలనుకునేవారు

Also Read: ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.. రోజూ చేసే వంటకాల్లో రుచి మరింత పెంచడానికి ఈజీ టిప్స్

మామిడిపండు ఎవరికి మంచిది?

శరీరంలో త్వరగా శక్తి కావాల్సినవారు
చర్మం, కంటి ఆరోగ్యం మెరుగుపరచుకోవాలనుకునేవారు
తీయని పండ్లు ఇష్టపడేవారు
అయితే మామిడిపండుని మితంగా తినాలి.

ముఖ్య గమనిక: ఈ వ్యాసంలో ఉన్నది సాధారణ సమాచారం మాత్రమే. పాఠకుల అవగాహన కోసం ఉద్దేశించబడినది. తీవ్ర ఆరోగ్య సమస్యలున్నవారు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×