E-Paper
Advertisement

Potato Pancakes: పిల్లలకు నచ్చేలా బంగాళాదుంప పాన్ కేక్స్, చలిలో వేడిగా తింటే అదరహో

Potato Pancakes: పిల్లలకు నచ్చేలా బంగాళాదుంప పాన్ కేక్స్, చలిలో వేడిగా తింటే అదరహో
Advertisement

చలికాలంలో ఏదైనా వేడిగా, క్రిస్పీగా తినాలనిపిస్తుంది. ఇక పిల్లల కోసం ఏదో ఒకటి కొత్తగా చేయక తప్పదు. పిల్లలు కూడా ఇష్టపడేలా ఉండే బంగాళాదుంప పాన్ కేక్స్ ప్రయత్నించి చూడండి. ఇవి పిల్లలకే కాదు, పెద్దలకు కూడా బాగా నచ్చుతాయి. బంగాళాదుంపతో ఎన్నో వంటలు చేస్తాం. కానీ ఈ పాన్ కేక్స్ మాత్రం చేసేవారి సంఖ్య చాలా తక్కువ. వీటిని చాలా తక్కువ పదార్థాలతో, తక్కువ సమయంలోనే చేసుకోవచ్చు. ముఖ్యంగా సాయంత్రం స్నాక్‌గా, పిల్లల టిఫిన్‌లో, పార్టీల్లోసర్వ్‌ చేయడానికి ఇవి చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం.

బంగాళాదుంప పాన్‌కేక్స్ రెసిపీకి కావలసిన పదార్థాలు
బంగాళాదుంపలు – మూడు
ఉల్లిపాయ – ఒకటి
గుడ్డు – ఒకటి
మైదా లేదా కార్న్‌ఫ్లోర్ – రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు – రుచికి తగినంత
మిరియాల పొడి – అర చెంచా
కొత్తిమీర తరుగు – ఒక స్పూను
నూనె – ఫ్రై చేయడానికి సరిపడా

Advertisement

తయారీ విధానం
1. ఈ బంగాళాదుంప పాన్ కేక్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మన ఇంట్లో ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. అందువల్ల ఈ వంటకాన్ని ఎప్పుడైనా సులభంగా చేయవచ్చు.
2. బంగాళాదుంపలను శుభ్రంగా కడిగి తొక్క తీసేయండి. తర్వాత పెద్ద గ్రేటర్‌తో సన్నగా తురమండి.
3.సన్నగా తురిమిన తరువాత ఒక శుభ్రమైన గుడ్డలో పెట్టి బాగా పిండి అదనపు నీటిని తీసేయండి. నీరు ఎక్కువగా ఉంటే పాన్ కేక్స్ కరకరలాడవు.
4. తురిమిన బంగాళాదుంపలను ఒక బౌల్‌లో వేసి అందులో ఉల్లిపాయల తరుగు, మైదా లేదా కార్న్‌ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపండి.
5. ఇప్పుడు ఆ మిశ్రమంలో గుడ్డును పగలగొట్టి వేయండి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.
6. ఒక పాన్‌ స్టవ్ మీద పెట్టి కొద్దిగా నూనె వేడి చేయండి.
7. బంగాళాదుంప మిశ్రమాన్ని చిన్న బంతుల్లా తీసుకుని చేత్తోనే గుండ్రంగా చిన్న పాన్ కేకుల్లా ఒత్తుకోండి.
8. వాటిని పెనంపై వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు కాల్చండి.
9. అంతే క్రిస్పీ బంగాళాదుంప పాన్ కేక్స్ రెడీ అయినట్టే.
10. దీన్ని కెచప్, పుదీన చట్నీ లేదా పెరుగు ‌తో తింటే అద్భుతంగా ఉంటుంది.

సాయంత్రం టీతో పాటు దీన్ని తింటే అదిరిపోతుంది. అలాగే పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ గా కూడా దీన్ని ప్లాన్ చేయవచ్చు. రెండు పాన్ కేకులు తింటే చాలు వారి పొట్ట నిండిపోతుంది. వీటిని చేసే పద్దతి కూడా చాలా సులువు కాబట్టి వారానికి ఒకసారైన పిల్లలకు చేసి పెట్టేందుకు ప్రయత్నించండి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×