E-Paper
Advertisement

ఏంటీ.. పానీపూరి తింటే బరువు తగ్గుతారా? నిపుణులు చెబుతున్న ఈ షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలిస్తే..

ఏంటీ.. పానీపూరి తింటే బరువు తగ్గుతారా? నిపుణులు చెబుతున్న ఈ షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలిస్తే..
Advertisement

Pani Puri For Weight Loss: పానీపూరి పేరు చెబితేనే చాలామందికి నోరూరుతుంది. ఆ పుల్లని నీళ్లు, కారంగా ఉండే మసాలాను ఇష్టపడని వారుండరు. అయితే, ఇటీవల సోషల్ మీడియాలో పానీపూరి తింటే బరువు తగ్గొచ్చనే వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఫిట్‌నెస్ ప్రియుల్లో దీనిపై ఆసక్తి పెరిగింది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో నిపుణుల మాటల్లో తెలుసుకుందాం.

లో క్యాలరీ స్నాక్:

ఇతర నూనె వస్తువులు, జంక్ ఫుడ్స్‌తో పోలిస్తే పానీపూరిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది. అయితే, ఇది మనం తినే పరిమాణం, అందులో వాడే పదార్థాలపై మాత్రమే ఆధారపడి ఉంటుందని డైటీషియన్లు చెబుతున్నారు. అతిగా తింటే బరువు తగ్గడం పక్కన పెడితే.. పెరిగే అవకాశం ఉందంటున్నారు.

స్టఫింగ్ మార్చాల్సిందే:

Advertisement

రోడ్డు పక్కన దొరికే పానీపూరిలో ఎక్కువగా బంగాళాదుంపలు, తీపి చట్నీ, బూందీ వంటివి వాడతారు. వీటివల్ల కార్బోహైడ్రేట్లు, క్యాలరీలు పెరిగిపోతాయి. దీనికి బదులుగా ఇంట్లోనే గోధుమ పూరీలను వాడుతూ.. లోపల బంగాళాదుంపలకు బదులు మొలకెత్తిన గింజలు, బఠానీలు లేదా శనగలు పెట్టుకుంటే శరీరానికి ప్రోటీన్, ఫైబర్ అందుతాయి. తీపి చట్నీని పూర్తిగా దూరం పెట్టడం మంచిది.

Also Read: ఎండకాలంలో మూత్రం ముదురు పసుపు రంగులోకి మారుతోందా? ఇది డీహైడ్రేషనే అనుకుంటే పొరపాటే!

జీర్ణక్రియకు మేలు:

Advertisement

పానీపూరి నీళ్లలో వాడే పుదీనా, జీలకర్ర, వాము, నల్ల ఉప్పు, ఇంగువ వంటి మసాలాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇవి మెటబాలిజాన్ని పెంచడమే కాకుండా.. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. అయితే, ఈ నీటిని తయారుచేసేటప్పుడు పరిశుభ్రత చాలా ముఖ్యం. కలుషిత నీటి వల్ల ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది.

మితంగా తింటేనే ముద్దు:

బరువు తగ్గాలనే ప్రయాణంలో మీ ఇష్టమైన ఆహారాన్ని పూర్తిగా మానేయాల్సిన పనిలేదు. కాకపోతే రాత్రిపూట కాకుండా సాయంత్రం వేళల్లో, అదీ పరిమితంగా తింటే ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి.. పరిశుభ్రమైన వాతావరణంలో, ఆరోగ్యకరమైన పద్ధతిలో తయారుచేసిన పానీపూరిని మితంగా తింటే.. వెయిట్ లాస్ గోల్స్‌ను సులువుగా చేరుకోవచ్చు.

Also Read: బరువు తగ్గడానికి, ఇమ్యూనిటీ పెరగడానికి కొబ్బరి నీళ్లు తాగే సరైన సమయం ఇదే!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×