E-Paper
Advertisement

ట్రూ లవర్.. ఈ తేదీలో పుట్టినవారు జీవితాంతం తోడుగా ఉంటారు

ట్రూ లవర్.. ఈ తేదీలో పుట్టినవారు జీవితాంతం తోడుగా ఉంటారు
Advertisement

న్యూమరాలజీ (సంఖ్య శాస్త్రం) ప్రకారం ప్రతి సంఖ్యకు ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. అందులో 11వ తేదీన జన్మించినవారిని ప్రేమ, నమ్మకం, అంకితభావానికి ప్రతీక చెబుతారు. వీరు ప్రేమను కేవలం ఆకర్షణగా కాకుండా జీవితాంతం కొనసాగాల్సిన బంధంగా భావిస్తారు. ఒకసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా అంగీకరిస్తే, ఆ బంధాన్ని కాపాడేందుకు పూర్తిగా ప్రయత్నిస్తారు. తమ భాగస్వామి కూడా అదే నిజాయితీతో ఉండాలని కోరుకుంటారు.

న్యూమరాలజీలో 11 సంఖ్యకు ప్రత్యేక స్థానం

న్యూమరాలజీలో 11ను ‘మాస్టర్ నంబర్’ గా పరిగణిస్తారు. ఈ తేదీన జన్మించినవారు భావోద్వేగాలు ఎక్కువగా కలిగినవారని విశ్వసిస్తారు. వీరికి మంచి అంతర్‌దృష్టి ఉంటుందని కూడా చెబుతారు. ఇతరుల భావాలను సులభంగా అర్థం చేసుకునే స్వభావం వీరిలో కనిపిస్తుంది. అందుకే సాధారణ పరిచయాల కంటే అర్థవంతమైన సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.

నమ్మకమే బలమైన బంధానికి పునాది

Advertisement

11వ తేదీన జన్మించినవారు ఏ సంబంధానికి నమ్మకం పునాది అని భావిస్తారు. నిజాయితీ, పారదర్శకత ఉన్నప్పుడే బంధం బలంగా ఉంటుందని విశ్వసిస్తారు. భాగస్వామి తమతో నిజాయితీగా ఉండాలని ఆశిస్తారు. ఇద్దరూ ఒకరినొకరు గౌరవిస్తే సంబంధం మరింత బలపడుతుందని నమ్ముతారు.

‘నువ్వే నాకు అన్నీ’ అనే భావన

న్యూమరాలజీ ప్రకారం 11 మూల అంకం ఉన్నవారు కేవలం ఒకే వ్యక్తితో జీవితాంతం ఉండాలని భావిస్తారు. తమ ప్రేమను ఆ వ్యక్తితో మాత్రమే పంచుకోవాలని అనుకుంటారు. ఈ కారణం వల్లే వీరిని అత్యంత విశ్వాసపాత్రులుగా అందరూ పరిగణిస్తారు. తమ భాగస్వామి నుంచి కూడా అదే స్థాయి విశ్వాసాన్ని ఆశిస్తారు.

బంధంలో ద్రోహం చేస్తే సహించలేరు

Advertisement

11వ తేదీన జన్మించినవారు మోసాన్ని చాలా బాధాకరంగా భావిస్తారు. ఒకసారి నమ్మకం దెబ్బతింటే ఆ బాధ నుంచి బయటపడటానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే కొత్త సంబంధాలను ప్రారంభించే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. మళ్లీ నమ్మకం పెరగడానికి సహనం అవసరమవుతుంది.

సంబంధం కోసం తమ వంతు కృషి చేస్తారు

వీరు తమ భాగస్వామి ఆనందం, గౌరవం, భావాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కష్టసమయాల్లో కూడా తోడుగా నిలబడేందుకు ప్రయత్నిస్తారు. పరస్పర గౌరవం, అర్థం చేసుకోవడం ఉంటే ఈ బంధం చాలా కాలం నిలుస్తుందని నమ్ముతారు.

Also Read: మీ పిల్లలు హోంవర్క్ కోసం ఏఐపై ఎక్కువగా ఆధారపడుతున్నారా? ఈ దురలవాటు మాన్పించడానికి ఈజీ టిప్స్

సున్నితమైన మనస్తత్వం వల సమస్యలు

11వ తేదీన జన్మించినవారి మనసు చాలా సున్నితంగా ఉంటుందని న్యూమరాలజీ చెబుతుంది. కొన్నిసార్లు వారు సంబంధాలపై ఎక్కువ అంచనాలు పెట్టుకుంటారు. ఆ అంచనాలు నెరవేరకపోతే నిరాశ చెందుతారు. అందుకే భావోద్వేగాల్లో సమతుల్యతను పాటించడం వారికి ఎంతో అవసరం.

గమనిక: ఈ వివరాలు సాంప్రదాయ న్యూమరాలజీ విశ్వాసాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. బిగ్ టీవి దీని గురించి బాధ్యత వహించదు. ఒక వ్యక్తి స్వభావాన్ని కేవలం పుట్టిన తేదీ మాత్రమే నిర్ణయించదు. కుటుంబ వాతావరణం, జీవిత అనుభవాలు, వ్యక్తిత్వం, విద్య, వ్యక్తిగత నిర్ణయాలు కూడా మనిషి ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. కాబట్టి న్యూమరాలజీని ఒక విశ్వాసంగా మాత్రమే చూడాలి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×