E-Paper
Advertisement

మీ ఇంటి పూజా గదికి రాయల్ లుక్ ఇచ్చే డెకరేషన్ టిప్స్.. తక్కువ బడ్జెట్‌లో ఇలా చేయండి

మీ ఇంటి పూజా గదికి రాయల్ లుక్ ఇచ్చే డెకరేషన్ టిప్స్.. తక్కువ బడ్జెట్‌లో ఇలా చేయండి
Advertisement

ఇంటి పూజా గది కేవలం పూజలు చేసే స్థలం మాత్రమే కాదు. చాలామంది దీన్ని ప్రశాంతత, ఆధ్యాత్మికత, పాజిటివ్ ఎనర్జీకి ప్రతీకగా భావిస్తారు. అందుకే పూజా గది ఎప్పుడూ శుభ్రంగా, అందంగా ఉండాలని కోరుకుంటారు. అయితే పూజా గదిని అందంగా మార్చుకోవడానికి ఖరీదైన అలంకరణలు అవసరం లేదు. కొన్ని చిన్న మార్పులతోనే పూజా మందిరానికి ఆకర్షణీయమైన రూపాన్ని ఇవ్వవచ్చు.

తాజా పూలతో సహజమైన అందం

ప్రతిరోజూ తాజా పూలతో పూజా గదిని అలంకరిస్తే ఆ ప్రదేశం మరింత అందంగా కనిపిస్తుంది. దేవతల విగ్రహాల దగ్గర చిన్న పూలదాని లేదా పూలమాలలు ఉంచవచ్చు. వాడిపోయిన పూలను వెంటనే తొలగించి కొత్త పూలను ఉంచడం మంచిది. దీంతో పూజా గది ఎప్పుడూ తాజాగా కనిపిస్తుంది.

గోడలు సింపుల్‌గా అలంకరించండి

Advertisement

పూజా గది గోడలను ఎక్కువ అలంకరణలతో నింపకుండా సాదాసీదాగా ఉంచడం మంచిది. మీకు ఇష్టదైవాల విగ్రహాలు, చిత్ర పటాలని చిత్రాన్ని చేయవచ్చు. సాంప్రదాయ నమూనాలు ఉన్న వాల్‌పేపర్‌ను కూడా ఉపయోగించవచ్చు. లేత రంగులు పూజా గదిని మరింత విశాలంగా కనిపించేలా చేస్తాయి.

సున్నితమైన లైటింగ్‌ను ఉపయోగించండి

మంచి లైటింగ్ పూజా గది అందాన్ని మరింత పెంచుతుంది. గోరువెచ్చని ఎల్‌ఈడీ లైట్లు లేదా చిన్న అలంకరణ లైట్లు ఏర్పాటు చేస్తే ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఉదయం, సాయంత్రం పూజ చేసే సమయంలో ఈ లైటింగ్ మరింత ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. చిన్న అలంకరణ దీపం లేదా వేలాడే లైట్ కూడా ఏర్పాటు చేయవచ్చు.

చెక్కతో చేసిన పూజా పీటను ఉపయోగించండి

Advertisement

పూజా గదికి ట్రెడిషనల్ లుక్ కోసం సాధారణ చెక్క పూజా పీట ఉపయోగించండి. దేవతల విగ్రహాలు, పూజా సామగ్రిని చక్కగా అమర్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. పూజా పీటపై శుభ్రమైన వస్త్రాన్ని పరచాలి. దాన్ని తరచూ శుభ్రం చేయడం కూడా అవసరం.

ప్రవేశ ద్వారాన్ని కూడా అలంకరించండి

పూజా గది ప్రవేశ ద్వారం అందంగా ఉంటే మొత్తం గది ఆకర్షణీయంగా కనిపిస్తుంది. చిన్న గంట, పూల తోరణం లేదా సాదాసీదా అలంకరణలను వేలాడదీయవచ్చు. కిటికీ ఉంటే లేత రంగు కర్టెన్లను ఉపయోగించండి. ఇవి గదికి అందాన్ని మరింత పెంచుతాయి.

పూజా గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి

పూజా గదిలో శుభ్రతే ప్రధాన అలంకరణ. దేవతల విగ్రహాలు, దీపాలు, పూజా సామగ్రిని తరచూ శుభ్రం చేయాలి. అనవసర వస్తువులను పూజా గదిలో ఉంచకూడదు. అన్ని వస్తువులను క్రమబద్ధంగా అమర్చితే గది ప్రశాంతంగా, అందంగా కనిపిస్తుంది.

Also Read:  రాజధాని, శతాబ్ది ట్రైన్ ఆలస్యమైందా? ఈ రూల్ పాటిస్తే ఫ్రీ భోజనం, రీఫండ్ సౌకర్యం

సాంప్రదాయ అలంకరణ వస్తువులు ఉపయోగించండి

ఇత్తడి దీపాలు, చిన్న గంటలు, మట్టి దీపాలు వంటి సాంప్రదాయ వస్తువులు పూజా గదికి ప్రత్యేకమైన అందాన్ని ఇస్తాయి.
ప్రవేశ ద్వారం వద్ద చిన్న ముగ్గు వేయడం కూడా మంచి అలంకరణగా ఉంటుంది. ఇవన్నీ తక్కువ ఖర్చుతో పూజా గదికి రాయల్ లుక్‌ ఇస్తాయి.

ఇంటి పూజా గదిని అందంగా మార్చుకోవడానికి ఎక్కువ ఖర్చు అవసరం లేదు. తాజా పూలు, శుభ్రత, సరైన లైటింగ్, సాదాసీదా అలంకరణలతో పూజా గదిని ప్రశాంతంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దవచ్చు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×