E-Paper
Advertisement

మీ పార్ట్‌నర్‌తో ముద్దుల్లో మునిగి తేలుతున్నారా? జాగ్రత్త.. ఆ జబ్బు ప్రాణాంతకంగా మారవచ్చు!

మీ పార్ట్‌నర్‌తో ముద్దుల్లో మునిగి తేలుతున్నారా? జాగ్రత్త.. ఆ జబ్బు ప్రాణాంతకంగా మారవచ్చు!
Advertisement

Kissing Disease: సాధారణంగా ప్రేమలో ఉన్నవాళ్లు ఎవరైనా తరచూ ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే.. ఆ ముద్దు ఇద్దరి మధ్య బంధాన్ని పెంచుతుంది. కానీ, ఆ చిన్న ముద్దే మన శరీరంలోకి ఒక పెద్ద రోగాన్ని ఆహ్వానిస్తుందని మీకు తెలుసా? వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. దీనినే డాక్టర్లు ‘మోనోన్యూక్లియోసిస్’ లేదంటే ‘కిస్సింగ్ డిసీజ్’ అని పిలుస్తారు. లాలాజలం ద్వారా వ్యాపించే ఈ వైరస్ ఇప్పుడు శాస్త్రవేత్తల దృష్టిలో పడటానికి ఒక బలమైన కారణం ఉంది. అదేమిటంటే.. ఈ జబ్బు బారిన పడినవారికి భవిష్యత్తులో మెదడు, నరాలకు సంబంధించిన ‘మల్టిపుల్ స్క్లెరోసిస్’ (MS) వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉందట.

ఏమిటీ కిస్సింగ్ డిసీజ్?

సాధారణంగా ఇది ఎప్స్టీన్ బార్ అనే వైరస్ వల్ల వస్తుంది. పేరు వినడానికి కొత్తగా ఉన్నా.. ఇది మన చుట్టూనే ఉంటుంది. ముద్దు పెట్టుకున్నప్పుడు ఒకరి ఎంగిలి మరొకరికి తగిలితేనే కాదు.. ఇంట్లో ఒకరు వాడిన గ్లాసులో నీళ్లు తాగినా, పక్కవారి స్పూన్‌తో తిన్నా, కనీసం మన పక్కన ఎవరైనా గట్టిగా తుమ్మినా ఈ వైరస్ మనకు అంటుకుంటుంది. తాజా అధ్యయనం ప్రకారం.. మనలో చాలామందికి తెలియకుండానే ఈ వైరస్ ఇప్పటికే మన శరీరంలోకి చేరి ఉండొచ్చు. కానీ చిన్నపిల్లల్లో దీని ప్రభావం పెద్దగా ఉండదు. అదే యుక్తవయస్సులో ఉన్నప్పుడు గనుక ఈ వైరస్ అటాక్ చేస్తే.. అది మనల్ని మంచం పట్టేలా చేస్తుందట.

జ్వరం అనుకుంటే పొరపాటే..

Advertisement

చాలామంది ఈ జబ్బును మామూలు ఫ్లూ లేదా గొంతు నొప్పి అని లైట్ తీసుకుంటారు. కానీ దీని లక్షణాలు కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. విపరీతమైన నీరసం, ఒళ్లు నొప్పులు, జ్వరం రావడం సర్వసాధారణం. అయితే మెడ దగ్గర ఉండే గ్రంథులు వాపు రావడం దీని లక్షణం. ఒక్కోసారి కాలేయం లేదా ప్లీహం కూడా వాపునకు గురవుతాయి. మిగతా జ్వరాల్లాగా ఇది వారం రోజుల్లో తగ్గిపోదు. దీని వల్ల వచ్చే నీరసం నెలల తరబడి వేధిస్తుంది. దీనికి స్పెషల్ మందులేవీ లేవు. కాస్త విశ్రాంతి తీసుకుంటూ బాగా నీళ్లు తాగుతూ ఉంటే అదే తగ్గిపోతుంది.

Also Read: వారానికి 5 రోజులు, రోజుకు 30 నిమిషాలు ఇలా చేస్తే.. గుండె జబ్బులు దరిచేరవు!

మెదడుపై ప్రభావం చూపుతుందా?

Advertisement

అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఈ కిస్సింగ్ డిసీజ్ ఒకసారి వచ్చి తగ్గాక.. కొన్నేళ్ల తర్వాత అది ‘మల్టిపుల్ స్క్లెరోసిస్’ అనే నరాల వ్యాధికి దారి తీసే రిస్క్ ఉందని రీసెర్చ్‌లో తేలింది. అంటే.. సాధారణ మనుషుల కంటే ఈ వైరస్ సోకిన వారికి ఆ ప్రమాదం మూడు రెట్లు ఎక్కువ. అలా అని అందరికీ వస్తుందని భయపడాల్సిన పని లేదు. వందలో ఒకరికో ఇద్దరికో వచ్చే అవకాశం ఉండొచ్చు. కానీ అసలు సంబంధమే లేదనుకున్న ఈ రెండు జబ్బుల మధ్య ఇంతటి లింకు ఉండటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

రోగనిరోధక శక్తి తగ్గిపోవచ్చు..

ఈ వైరస్ చేసే పెద్ద తప్పు ఏమిటంటే.. ఇది మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను కన్ఫ్యూజ్ చేస్తుంది. వైరస్‌ను చంపాల్సింది పోయి.. మన రక్షణ వ్యవస్థ మన సొంత నరాల మీద దాడి చేయడం మొదలుపెడుతుంది. నరాల మీద ఉండే ఒక రక్షణ పొరను (Myelin) ఇది నాశనం చేస్తుంది. దీంతో మెదడు నుంచి శరీర భాగాలకు అందాల్సిన సంకేతాలు సరిగ్గా అందవు. దీనినే మనం మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటాం.

ఇలా జాగ్రత్త పడదాం..

ఇప్పుడీ విషయం వలన ముద్దులకు దూరంగా ఉండాలా? అని టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే.. ప్రపంచంలో 95 శాతం మందిలో ఈ వైరస్ ఉంటుంది. కానీ అందరికీ జబ్బు రాదు. కాకపోతే, భవిష్యత్తులో ఎప్పుడైనా కళ్లు సరిగ్గా కనిపించకపోవడం, కాళ్లు చేతులు మొద్దుబారడం లేదంటే ఎప్పుడూ అలసటగా ఉండటం వంటివి జరిగితే వెంటనే డాక్టరును కలవాలి. భవిష్యత్తులో దీనికి వ్యాక్సిన్ గనుక వస్తే.. చిన్న జ్వరాన్నే కాదు.. పెద్ద నరాల వ్యాధిని కూడా మనం అరికట్టవచ్చు. అప్పటి వరకు మనం చేయాల్సిందల్లా.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవటం.

Also Read: పిల్లల జ్ఞాపకశక్తి పెరగాలా? షుగర్ లేకుండా ఇలా హెల్తీ బాదం స్వీట్ చేసి పెట్టండి!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×