E-Paper
Advertisement

టాటా పంచ్ EVకి పోటీగా BYD అట్టో 1.. ధర, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

టాటా పంచ్ EVకి పోటీగా BYD అట్టో 1..  ధర, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

Best Budget EV BYD Atto 1: చైనీస్ ఆటో దిగ్గజం BYD అట్టో 1 పేరుతో చౌకైన ఎలక్ట్రిక్ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారుగా మార్కెట్ లోకి విడుదల అయ్యింది. కొన్ని దేశాల్లో దీన్ని యువాన్ ప్రో మరికొన్ని దేశాల్లో డాల్ఫిన్  పేర్లతో కూడా అమ్ముతున్నారు. సిటీలో రోజువారీ ప్రయాణాల కోసం రూపొందించిన ఈ చిన్న SUV, స్టైలిష్ లుక్, మంచి రేంజ్, సరసమైన ధరతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

BYD అట్టో 1 డిజైన్ గురించి..

అట్టో 1 ఒక మోడర్న్, కాంపాక్ట్ SUV లుక్‌ను కలిగి ఉంటుంది. డిజైన్ చాలా ఆకట్టుకునేలా ఉంటుంది. స్మూత్ లైన్స్, LED లైటింగ్, స్టైలిష్ ఫినిష్ దీనికి మంచి ప్రీమియం ఫీల్ ఇస్తాయి. నగరాల్లో డ్రైవింగ్ చేయడానికి ఈ కారు సైజ్ చాలా సౌకర్యంగా ఉంటుంది.

ఒకే ఛార్జ్ తో 400 కి.మీ రేంజ్

Advertisement

ఇక ఈ కారు రేంజ్ విషయానికి వస్తే,  వేరియంట్‌ ను బట్టి సుమారు 300 నుండి 400 కిలోమీటర్ల వరకు ఒకే ఛార్జ్‌ తో ప్రయాణిస్తుంది. ఇది రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు, చిన్న ట్రిప్స్ కోసం సరిపోతుంది. పెద్ద రేంజ్ అవసరం లేకుండా, తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. బ్యాటరీ విషయంలో BYD ప్రత్యేకమైన  బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఇది భద్రత పరంగా చాలా అడ్వాన్స్ డ్ గా ఉంటుంది. లిథియం అయాన్ బ్యాటరీలతో పోలిస్తే, ఈ టెక్నాలజీ వేడి పెరగడం లాంటి సమస్యలను తగ్గిస్తుంది.వినియోగదారులకు మరింత సేఫ్టీని అందిస్తుంది.

లోపలి భాగం ఆధునికంగా ఉంటుంది. ముఖ్యంగా టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఈ కారులోప్రత్యేక ఆకర్షణ. ఇది అవసరానికి అనుగుణంగా హారిజాంటల్ లేదంటే వెర్టికల్‌గా తిరుగుతుంది. అలాగే, డిజిటల్ డిస్ ప్లే, కనెక్టివిటీ ఫీచర్లు,  కంఫర్టబుల్ సీటింగ్ తో క్యాబిన్ ఎక్స్ పీరియెన్స్ మరింత మెరుగ్గా ఉంటుంది.

పనితీరు ఎలా ఉంటుందంటే?

Advertisement

ఇది ఒక సిటీ ఫోకస్‌డ్  EV. ఎలక్ట్రిక్ మోటార్ కారణంగా చాలా స్మూత్‌ గా, వేగంగా ప్రయాణిస్తుంది. ట్రాఫిక్‌ లో సులభంగా నడపడానికి అనుకూలంగా ఉంటుంది. హై స్పీడ్ కోసం కాకుండా, రోజువారీ ఉపయోగం కోసం డిజైన్ చేయబడింది.

BYD అట్టో 1 ధర గురించి..

ధర విషయానికి వస్తే, దేశంలో ఇది సుమారు రూ. 12 నుంచి రూ. 15 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ ధర రేంజ్‌లో ఇది టాటా పంచ్ EV వంటి కార్లకు పోటీ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఇది సరసమైన EVగా గుర్తింపు పొందింది.  BYD అట్టో 1 అనేది స్టైలిష్, సురక్షితమైన, సరసమైన ఎలక్ట్రిక్ కారు. నగరాల్లో తక్కువ ఖర్చుతో, సులభంగా ప్రయాణించాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్గా చెప్పుకోవచ్చు.

Read Also: లో కాస్ట్.. హై రేంజ్.. ఈ టాటా ఈవీ ముందు మిగతా కార్లన్నీ దిగదుడుపేనోయ్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×