E-Paper
Advertisement

Food Safety: అరటి పండ్లను ఇలా వదిలేస్తున్నారా? బల్లి ఏం చేసిందో మీరే చూడండి!

Food Safety: అరటి పండ్లను ఇలా వదిలేస్తున్నారా? బల్లి ఏం చేసిందో మీరే చూడండి!
Advertisement

Food Safety: సాధారణంగా మనం మార్కెట్ నుండి తెచ్చిన అరటి పండ్లను టేబుల్ మీదో లేదా వంటగదిలోనో అలా వదిలేస్తుంటాం. కానీ అలా వదిలేయడం వల్ల ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మీరు అస్సలు నమ్మలేరు.

ఈ ఘటన ఎక్కడ జరిగిందో సరిగ్గా తెలియదు గానీ.. సోషల్ మీడియాలో మాత్రం తెగ హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ బల్లి హాయిగా అరటిపండును నాకుతూ కనిపించింది. ఇది చూసిన నెటిజన్లు అంతా షాక్ అవుతున్నారు. అయితే బల్లి నాకిన పండ్లు విషంగా మారుతాయా, లేదా? అనే ప్రశ్నకు నిపుణులు ఏం సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

బల్లి నాకితే విషపూరితమా?

Advertisement

మొదటి నుంచి మన పెద్దలు ఏం చెబుతున్నారంటే.. బల్లి పాలు లేదా అన్నం మీద పడితే అది విషపూరితం అవుతుందని. ఆ ఆహారాన్ని తింటే ప్రాణాలు పోతాయని నమ్ముతుంటాం. దీనికి గౌళీ శాస్త్రం వంటి నమ్మకాలు కూడా తోడయ్యాయి. అయితే, సైన్స్ ఏం చెబుతుందంటే.. నిజానికి మన ఇళ్లలో తిరిగే బల్లులు విషపూరితమైనవి కావు. వాటి లాలాజలంలో కానీ, చర్మంలో కానీ ప్రాణాలు తీసే విషం ఉండదు. కాబట్టి.. బల్లి ఏదైనా పండ్లను నాకినంత మాత్రాన అది వెంటనే విషంగా మారిపోదట.

Also Read: ఎండలు మండిపోతున్నాయని చెరకు రసం తాగుతున్నారా? ఈ జాగ్రత్తలు పాటించకపోతే డేంజరే!

అసలైన ముప్పు బ్యాక్టీరియాతోనే..

Advertisement

బల్లి విషపూరితం కాకపోయినప్పటికీ.. దాని వల్ల ఒక పెద్ద సమస్య ఉంది. బల్లులు గజ్జి, బొద్దింకలు వంటి పురుగులను తింటాయి. వాటి శరీరంలో, ముఖ్యంగా పొట్టలో సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియాలు ఉంటాయి. బల్లి ఆహారాన్ని తాకినప్పుడు లేదా దాని విసర్జితాలు ఆహారంలో పడినప్పుడు ఈ బ్యాక్టీరియా మన శరీరంలోకి చేరుతుంది. దీంతో వాంతులు, విరేచనాలు, జ్వరం, కడుపు నొప్పి వంటి ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు కనిపిస్తాయి. ప్రాణాపాయం లేకపోయినా, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు, వృద్ధులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది.

ముందు జాగ్రత్తలు తప్పనిసరి:

అరటి పండ్లు లేదా ఇతర ఆహార పదార్థాలను ఎప్పుడూ మూతలు ఉన్న డబ్బాల్లో లేదా నెట్ కవర్లతో కప్పి ఉంచడం మంచిది. ముఖ్యంగా పండ్లు తినే ముందు వాటిని శుభ్రంగా కడగాలి. బల్లులు రావడానికి ప్రధాన కారణం మన ఇంట్లో ఉండే పురుగులే. అందుకే కిచెన్‌ను శుభ్రంగా ఉంచుకుంటే బల్లుల బెడద తగ్గుతుంది. ఒక్కోసారి బల్లి ఆహారంలో పడి చనిపోయినప్పుడు బ్యాక్టీరియా వేగంగా విస్తరిస్తుంది. అలాంటప్పుడు ఆ ఆహారాన్ని తినకూడదని చెబుతున్నారు నిపుణులు.

Also Read: బ్రెయిన్ సర్జరీలో మాట పడిపోకుండా కొత్త టెక్నిక్.. ఇక భయం లేనట్టే!

?utm_source=ig_web_button_share_sheet

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×