E-Paper
Advertisement

Iran Attacks US Bases: యూఎస్ ఎయిర్, నేవీ బేస్ లను టార్గెట్ చేసిన ఇరాన్.. మిడిల్ ఈస్ట్ దేశాలలో భారీ పేలుళ్లు

Iran Attacks US Bases: యూఎస్ ఎయిర్, నేవీ బేస్ లను టార్గెట్ చేసిన ఇరాన్.. మిడిల్ ఈస్ట్ దేశాలలో భారీ పేలుళ్లు
Advertisement

Iran Attacks US Bases: ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా జాయింట్ గా దాడులు చేస్తున్నాయి. ఈ దాడులను తిప్పికొట్టేందుకు ఇరాన్.. మిడిల్ ఈస్ట్ దేశాల్లో అమెరికా ఎయిర్, నేవల్ బేస్ లను టార్గెట్ చేసింది. యూఏఈలోని అబుదాబి, దుబాయ్, ఖతార్‌లోని దోహా, సౌదీ అరేబియాలోని రియాద్‌లలో యూఎస్ బేస్ లపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. అబుదాబిలో భారీ పేలుళ్లకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బహ్రెయిన్ లోని యూఎస్ బేస్ పై ఇరాన్ దాడి చేసింది. దోహా, రియాద్‌లలో కూడా పేలుళ్లు వినిపించాయని స్థానిక మీడియా సంస్థలు తెలిపాయి. మిడిల్ ఈస్ట్ లోని చాలా దేశాలు అమెరికన్ సైన్యానికి ఆశ్రయం కల్పిస్తున్నాయి.

ఎయిర్ బేస్ లపై దాడులు

అబుదాబిలో యూఏఈ, యూఎస్ ఎయిర్ బేస్ జాయింట్ గా స్థావరాన్ని నిర్వహిస్తున్నాయి. దుబాయ్‌లోని జెబెల్ అలీ నౌకాశ్రయం మిడిల్ ఈస్ట్ లో యూఎస్ నేవీకి ఉన్న అతిపెద్ద నౌకాశ్రయం. దోహాలోని 24 హెక్టార్ల అల్ ఉదీద్ వైమానిక స్థావరం కూడా యూఎస్ సెంట్రల్ కమాండ్‌కు ఫార్వర్డ్ కార్యాలయంగా పనిచేస్తుంది. సౌదీ అరేబియాలో 2000 మందికి పైగా అమెరికా సైనికులు ఉన్నారు. వీరిలో కొందరు రియాద్‌కు దాదాపు 60 కి.మీ దూరంలో ఉన్న ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌లో ఉన్నారు.

బహ్రెయిన్‌లో యూఎస్ నేవీ బేస్ ధ్వంసం

Advertisement

మనామాలో ఉన్న అమెరికా నేవీ 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణి దాడి జరిగిందని బహ్రెయిన్ తెలిపింది. యూఎస్ నేవీ ఐదో నౌకాదళం ఉన్న ప్రాంతం గల్ఫ్, ఎర్ర సముద్రం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అనేక యూఎస్ నౌకలు బహ్రెయిన్‌లో తమ సొంత ఓడరేవును కలిగి ఉన్నాయి. వాటిలో యాంటీ-మైన్ నౌకలు, లాజిస్టికల్ సపోర్ట్ షిప్‌లు ఉన్నాయి.

Also Read:  ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. విదేశీ ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ‘హై అలర్ట్’!

టెహ్రాన్ కు హెచ్చరిక

Advertisement

జోర్డాన్‌లో కూడా సైరన్లు మోగాయి. కువైట్ కూడా తన వైమానిక స్థావరాల్లో దాడులు జరిగాయని తెలిపింది. తమను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడులను విజయవంతంగా అడ్డుకున్నట్లు ఖతార్ తెలిపింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం,ఆస్తి నష్టం జరగలేదని పేర్కొంది. ఇరాన్ దురాక్రమణను తీవ్రంగా ఖండిస్తున్నామని సౌదీ అరేబీయా పేర్కొంది.
ఈ దాడులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఖతార్, కువైట్, జోర్డాన్ ల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని ఆ దేశాలు ప్రకటన చేశాయి. ఇందుకు టెహ్రాన్‌ తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదని హెచ్చరించాయి.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×