E-Paper
Advertisement

వేసవిలో పానీపూరి తినడం ప్రమాదకరమా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

వేసవిలో పానీపూరి తినడం ప్రమాదకరమా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే
Advertisement

భారతదేశంలో పానీపూరి ఒక పాపులర్ అల్పాహారం. వేసవిలో కూడా ప్రజలు దీన్ని చాలా ఇష్టంగా తింటారు. సాయంత్రం వేళ వీధి వ్యాపారుల విక్రయించే పానీపూరీకి మంచి గిరాకీ ఉంటుంది. పానీపూరీల రుచి కారం, పులుపుగా ఉంటుంది. అయితే ఇటీవలే జార్ఖండ్ లో పానీపూరీ తినడం వల్ల 18 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఒక 7 ఏళ్ల పిల్లాడు చనిపోయాడు. దీంతో పానీ పురీ గురించి అందరూ ఆందోళన చెందుతున్నారు. అయితే ఇందులో విషపూరితంగా ఏముంటుంది. కేవలం సాధారణ పూరీయే కదా అని పొరపాటు పడకూడదు. ఇందులో ఆరోగ్యానికి హాని కలిగించే ఇతర పదార్థాలు కూడా ఉంటాయి. అందుకే బయట వీధి వ్యాపారులు విక్రయించే పానీ పురీ తినడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

వేసవిలో పానీపూరి ఎందుకు ప్రమాదకరం?

డైటీషియన్ డాక్టర్ అర్చనా బత్రా ప్రకారం.. వేసవి వేడిలో పానీపూరి లోని పానీ (నీళ్లు) త్వరగా చెడిపోతాయి. పానీపూరీ విక్రేతలు చాలా గంటల ముందే పానీ తయారు చేసి ఉంచేస్తారు. వేడి వాతావరణంలో బ్యాక్టీరియా చాలా వేగంగా పెరుగుతాయి. మురికి నీళ్లు, అపరిశుభ్రమైన చేతులు, ఈగలు, ధూళి వల్ల ఆహారం కలుషితమవుతుంది. చెడిపోయిన పానీలో ఈ కొలీ, సాల్మొనెల్లా లాంటి బ్యాక్టీరియా త్వరగా చేరుతుంది. ఈ నీరు తాగిన వెంటనే ఇన్‌ఫెక్షన్ సమస్య తీవ్రమవుతుంది. దీన్ని వల్లే ఫుడ్ పాయిజనింగ్ తీవ్రమైతే జరిగి ప్రాణాలు పోయే ప్రమాదముంది

ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు

Advertisement

పానీపూరి తిన్న తర్వాత కొన్ని గంటల్లోనే లక్షణాలు కనిపిస్తాయి. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, బలహీనత, జ్వరం రావచ్చు. వేసవిలో వేడి కారణంగా శరీరంలో నీటి లోపం వస్తుంది. పిల్లలు, వృద్ధులకు ఈ సమస్యలు చాలా ప్రమాదకరం.

వేసవి వేడితో మరింత ప్రమాదం

వేసవి ఉష్ణోగ్రతలు.. బ్యాక్టీరియా వేగంగా పెరగడానికి అనువైన వాతావరణం సృష్టిస్తాయి. రోడ్డు పక్కన వీధివ్యాపారుల వద్ద ఫ్రిజ్ సౌకర్యం ఉండదు. పాత మసాలాలు, నీళ్లు ఉపయోగించడం వల్ల ఆహారం చాలా త్వరగా చెడిపోతుంది.

పానీపూరి తినేటప్పుడు జాగ్రత్తలు

Advertisement

రోడ్డు పక్కన విక్రయించే పానీపూరి తినడానికి డాక్టర్లు పూర్తిగా నిరాకరించడం లేదు. కానీ శుభ్రమైన ప్రదేశాల్లో మాత్రమే తినమని సలహా ఇస్తున్నారు.
పానీపూరి విక్రయించే స్థలం లో ఫిల్టర్ నీళ్లు లేదా ప్యాకెట్ నీళ్లు వాడుతున్నారా చూడండి.
పానీపూరి ఇచ్చే వ్యక్తి చేతులు శుభ్రంగా ఉన్నాయా, పాత్రలు సరిగ్గా ఉన్నాయా గమనించండి.
చెత్త, ఈగలు, మురికి నీళ్లు ఉన్న స్టాల్స్‌ దగ్గరకు అస్సలు వెళ్లకండి.
తాజాగా తయారు చేసిన పానీపూరి మాత్రమే తినండి.
మధ్యాహ్నం తీవ్ర వేడి సమయంలో తినకండి. సాయంత్రం సమయం మంచిది.

Also Read: మీ పిల్లాడిని చెడు స్నేహితుల నుంచి దూరం చేయాలనుకుంటున్నారా? ఈ టిప్స్ కోసమే

పిల్లలకు ప్రత్యేక జాగ్రత్త

పిల్లలు పానీపూరి ఇష్టపడతారు. కానీ వారి రోగనిరోధక శక్తి తక్కువ. తల్లిదండ్రులు ఎక్కువ జాగ్రత్త వహించాలి. పిల్లలు తగినంత నీళ్లు తాగాలి. అత్యంత వేడి రోజుల్లో ఇంట్లోనే పానీపూరి చేసి ఇవ్వడం మంచిది.

రుచి కంటే పరిశుభ్రత ముఖ్యం

రుచి కంటే అధికంగా శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. చేతులు కడుక్కొని తినడం, తాజా ఆహారం ఎంచుకోవడం వంటి చిన్న జాగ్రత్తలు చాలా ప్రమాదాలను తప్పించగలవు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×