E-Paper
Advertisement

గిన్నిస్ రికర్డ్ సాధించిన భారతీయ వంటకాలు.. టాప్ 5 ఇవే

గిన్నిస్ రికర్డ్ సాధించిన భారతీయ వంటకాలు.. టాప్ 5 ఇవే
Advertisement

భారతీయ వంటకాలు ప్రత్యేక రుచి, సువాసన, వెరైటీ కోసం ప్రపంచవ్యాప్తంగా బాగా ఫేమస్. మన దేశంలోని అనేక సంప్రదాయ వంటకాలకు అంతర్జాతీయ స్థాయిలో అభిమానులున్నారు. వాటిలో కొన్ని.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా చోటు దక్కించుకున్నాయి. ఈ రికార్డులు భారతీయ వంటకాలకు మాత్రమే కాదు, మన దేశ ప్రజల ఐక్యత, కష్టపడి పనిచేసే తత్వాన్ని కూడా ప్రతిబింబిస్తాయి.

రికార్డ్ స్థాయిలో బిర్యానీ తయారీ

బిర్యానీకి ఉండే ప్రత్యేకత, పాపులారిటీ మరే డిష్‌కు లేదు. ముఖ్యంగా భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వంటకాలలో బిర్యానీ టాప్. 2008 దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రపంచంలోనే భారీ స్థాయిలో బిర్యానీ తయారు చేశారు. ఈ బిర్యానీ మొత్తం 14.06 టన్నులగా రికార్డ్ అయింది. వేల కిలోల బియ్యం, మాంసం, మసాలాలు, నెయ్యితో దీన్ని తయారు చేశారు. ఇంత పెద్ద పరిమాణంలో వండినా సంప్రదాయ రుచి అలాగే ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.

ఖిచ్డీ.. మరో ప్రపంచ రికార్డు

Advertisement

ఖిచ్డీ ఆరోగ్యకరమైన, సులభంగా తయారయ్యే వంటకం. 2017లో న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ ఫుడ్ ఇండియా కార్యక్రమంలో ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ నేతృత్వంలో దాదాపు 50 మంది చెఫ్‌లు కలిసి 918 కిలోల ఖిచ్డీ తయారు చేశారు. దీన్ని గిన్నిస్ ప్రపంచ రికార్డుగా గుర్తించారు. తర్వాత ఈ మొత్తం ఖిచ్డీని సేవా సంస్థల ద్వారా అవసరమైన పేద వారికి పంపిణీ చేశారు.

బూందీ లడ్డూ ప్రత్యేకత

భారతీయ పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాల్లో తప్పనిసరిగా కనిపించే స్వీట్ లడ్డూ. 2016లో ఆంధ్రప్రదేశ్‌లోని తాపేశ్వరం ప్రాంతానికి చెందిన పీవీవీఎస్ మల్లిఖార్జునరావు ప్రపంచంలోనే అతిపెద్ద బూందీ లడ్డూను తయారు చేశారు. దీని బరువు 29,465 కిలోలు. శనగపిండి, పంచదార, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, యాలకుల (ఇలాయిచీ) తో సంప్రదాయ పద్ధతిలో ఈ లడ్డూను తయారు చేశారు.

Advertisement

Also Read: శరీరంలో నుంచి మలినాలు తొలగించే సూపర్ డ్రింక్స్.. లివర్ ఆరోగ్యానికి ఆయుర్వేద డాక్టర్ సూచనలు

అత్యంత పొడవైన దోసె

దోసె దక్షిణ భారతదేశానికి చెందిన ఫేమస్ అల్పాహారం. 2014లో హైదరాబాద్‌లో 29 మంది చెఫ్‌లు కలిసి ప్రపంచంలోనే అత్యంత పొడవైన దోసెను తయారు చేశారు. ఈ దోసె పొడవు 16.68 మీటర్లు. ఇంత పొడవుగా ఉన్నప్పటికీ దోసె పలుచగా, క్రిస్పీగా తయారు చేయడం విశేషం.

ప్రపంచంలోనే అతిపెద్ద చపాతీ

చపాతీ భారతదేశంలోని చాలా కుటుంబాల్లో రోజూ తినే ప్రధాన ఆహారం. 2012లో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద చపాతీని తయారు చేశారు. దీని బరువు 145 కిలోలు. మూడు మీటర్ల పరిమాణం ఉన్న ప్రత్యేక ఇనుప పలక లాంటి పాన్‌పై చాలా మంది కలిసి ఈ చపాతీని వండారు.

ఈ రికార్డులు ఎందుకు స్పెషల్?

ఈ గిన్నిస్ ప్రపంచ రికార్డులు కేవలం భారీ పరిమాణంలో ఆహారం తయారు చేయడానికే నమోదు కాలేదు. ఇవి భారతీయ వంటల గొప్పతనం, సంప్రదాయాలు, అనేక మంది సమిష్టి కృషి, సేవాభావాన్ని ప్రపంచానికి పరిచయం చేశాయి. ఈ కారణాలే భారతీయ ఆహార సంస్కృతికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చాయి. బిర్యానీ నుంచి చపాతీ వరకు ప్రతి వంటకం భారత దేశ ఐక్యతను, ఆతిథ్యాన్ని, సంస్క‌ృతిని గర్వంగా చాటుతోంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×