E-Paper
Advertisement

మత్తెకించే సువాసన.. మంచి నిద్ర కోసం బెడ్‌రూంలో ఈ మొక్కలు పెంచండి

మత్తెకించే సువాసన.. మంచి నిద్ర కోసం బెడ్‌రూంలో ఈ మొక్కలు పెంచండి
Advertisement

Bedroom plants for better sleep| మంచి నిద్ర ఆరోగ్యానికి చాలా అవసరం. చాలా మంది రాత్రి సమయంలో ప్రశాంతంగా నిద్రపోవడానికి ఇబ్బందిపడుతుంటారు. బెడ్‌రూమ్‌లో కొన్ని మొక్కలు ఉంచడం వల్ల గది ప్రశాంతంగా, సుఖంగా మారుతుంది. కొన్ని మొక్కలు గాలి క్వాలిటీనీ మెరుగుపరుస్తాయి, మరికొన్ని మొక్కలు మంచి సువాసన వెదజల్లుతాయి. ఈ కారణంగా ఈ మొక్కలు సహజంగానే మంచి నిద్రకు సహాయపడతాయి.

లావెండర్: ప్రశాంతంగా ఉండడానికి సహాయపడుతాయి

నిద్రకు ఉపకరించే మొక్కలలో లావెండర్ చాలా ప్రసిద్ధి. దీని మృదువైన సువాసన మీ మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. గుండె వేగం, రక్తపోటును తగ్గించి, త్వరగా నిద్రపట్టడానికి సహాయపడుతుంది. నాణ్యమైన నిద్ర కలుగుతుంది.

స్నేక్ ప్లాంట్: గాలిని శుద్ధి చేస్తుంది

Advertisement

స్నేక్ ప్లాంట్ చాలా సులభంగా పెరిగే మొక్క. ఇది రాత్రి సమయంలో ఆక్సిజన్ విడుదల చేస్తుంది. దీని వల్ల నిద్రపోతున్నప్పుడు శ్వాస సాఫీగా ఉంటుంది. శుద్ధమైన గాలి నిద్రను సౌకర్యవంతంగా చేస్తుంది.

జాస్మిన్: ఆందోళన తగ్గిస్తుంది

జాస్మిన్ అంటే మల్లె పూల మొక్క తీయని, ఆహ్లాదకరమైన వాసనను వెదజల్లుతుంది. ఇది మనసును శాంతపరచి ఆందోళనను తగ్గిస్తుంది. అధ్యయనాల ప్రకారం జాస్మిన్ నిద్ర క్వాలిటీని మెరుగుపరుస్తుంది. మరుసటి రోజు ఫ్రెష్‌గా ఉండటానికి కూడా సహాయపడుతుంది.

అలోవెరా: శ్వాసకోశానికి మంచిది

Advertisement

అలోవెరా అంటే కలబంద పెంచడం ఇంట్లో చాలా ఈజీ. దీని కోసం పెద్ద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉండదు. రాత్రివేళ ఈ మొక్క ఆక్సిజన్ విడుదల చేసి గాలిని శుద్ధి చేస్తుంది. శ్వాస సులభంగా ఉండటం వల్ల గాఢ నిద్ర వస్తుంది.

పీస్ లిల్లీ: గాలిని తాజాగా ఉంచుతుంది

పీస్ లిల్లీ అంటు శాంతి కలువ మొక్క గాలిలోని హానికరమైన విషాలను తొలగిస్తుంది. గదిలో తేమను కూడా పెంచుతుంది. దీని వల్ల ముక్కు, గొంతు పొడిబారకుండా ఉంటుంది. నిద్ర సౌకర్యవంతంగా ఉంటుంది.

అరేకా పామ్: తేమను సమతుల్యం చేస్తుంది

అరేకా పామ్ అనే మొక్క గాలిలోని రసాయనాలను తొలగించి, తేమ స్థాయిని సరిగ్గా ఉంచుతుంది. దీంతో చర్మం, శ్వాసకోశానికి సౌకర్యంగా ఉంటుంది.

Also Read: నిగనిగలాడే జుట్టు, కాంతివంతమైన చర్మం కోసం ఇంట్లో ఈ మొక్కను పెంచండి..

కామమైల్, వాలెరియన్: నిద్ర సమస్యలకు సహాయం

కామమైల్, వాలెరియన్ మొక్కల వాసన ఒత్తిడిని తగ్గించి, ప్రశాంతనిస్తాయి. నిద్రలేమి సమస్య ఉన్నవారికి ఇవి చాలా ఉపయోగపడతాయి.

బెడ్‌రూమ్‌లో ఈ మొక్కలు ఉంచడం వల్ల గాలి క్లీన్ అవుతుంది, ఆక్సిజన్ పెరుగుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది. లావెండర్, స్నేక్ ప్లాంట్, జాస్మిన్, అలోవెరా, పీస్ లిల్లీ వంటి మొక్కలు నిద్ర క్వాలిటీని మెరుగుపరుస్తాయి. రెండు మూడు మొక్కలు ఉంచడం ద్వారా మీ నిద్ర మరింత సుఖంగా మారవచ్చు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×