E-Paper
Advertisement

మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది.. కానీ ఆ పండ్లు కొనేముందు ఈ ఒక్క టెస్ట్ చేయండి!

మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది.. కానీ ఆ పండ్లు కొనేముందు ఈ ఒక్క టెస్ట్ చేయండి!
Advertisement

Natural Mangoes: ఎండాకాలం రాగానే మనకి ముందుగా గుర్తొచ్చేవి మామిడి పళ్ళు.కలర్ ఫుల్ గా నిగనిగలాడుతూ కనిపించే పళ్ళని చూడగానే మనసు వాటిని తినేయాలని మారాం చేయడం సహజం.కాని మార్కెట్లోకి ఇపుడు వస్తున్న పళ్ళలో 90 శాతానికి పైగా కెమికల్స్‌తో మాగబెట్టినవే.మరి అసలైన పళ్ళని ఎలా పట్టేయాలో తెలుసుకుందామా !

కెమికల్ పేరు క్యాల్షియం కార్బైడ్

Advertisement

సాధారణంగా పండ్లను పండించడానికి ఉపయోగించే కెమికల్ పేరు క్యాల్షియం కార్బైడ్.ఇది చేసే పని ఏంటంటే ఎసిటిలిన్ గ్యాస్ ని రిలీజ్ చేసి ఆకుపచ్చగా ఉన్న కాయని పసుపు రంగులోకి మారుస్తుంది.అంటే ఇది కేవలం రంగు మారుస్తుంది తప్ప న్యాచురల్ గా జరగాల్సిన మార్పులని ఇది జరపలేదు.సో పైకి పచ్చగా కనిపించే పండు అసలు పక్వానికే రాలేదన్న మాట. అందుకే ఇటువంటి పండ్లను కోసినప్పుడు తొక్క పక్కనే ఉన్న గుజ్జు కొంత మెత్తగా అనిపించినా, లోపల విత్తనం (టెంకె) దగ్గర ఉండే భాగం గట్టిగా, పుల్లగా ఉంటుంది. సహజంగా పండిన పండులో స్టార్చ్ పూర్తిగా చక్కెరగా మారుతుంది కాబట్టి, అది టెంకె వరకు ఒకేరకమైన తీపిని, మెత్తదనాన్ని కలిగి ఉంటుంది.

మరో ముఖ్యమైన టెక్నిక్

Advertisement

ఇదే కాదు.పండు పైభాగంలో ఉండే తొడిమ (Stem) ప్రాంతాన్ని గమనించడం ఇక్కడ మరో ముఖ్యమైన టెక్నిక్. సహజంగా పండిన పండు తొడిమ దగ్గర కొంత నల్లగా లేదా న్యాచురల్ గా ఎరుపు, పసుపు రంగులు కలయికతో ఉండి, అక్కడ నుంచి తేనె లాంటి జిగురు రిలీజ్ చేస్తుంది. అదే కెమికల్స్‌తో పండించిన పండ్లలో తొడిమ చుట్టూ తెల్లటి పౌడర్ లాంటి పదార్థం గానీ లేదా పూర్తిగా ఎండిపోయిన నల్లటి మచ్చలు గానీ కనిపిస్తాయి. దీనికి కారణం కార్బైడ్ పొట్లాలు నేరుగా పండుకు తగలడమే. కొన్నిసార్లు పండు పైన అక్కడక్కడా కాలిపోయినట్లుగా ఉండే చిన్న చిన్న నల్లటి చుక్కలని కూడా చూస్తాం.దానికి కారణం కూడా ఈ పొట్లాలే.

ఇలాంటి పండ్లు తిన్న కొద్దిసేపటికే

ఇక రుచి విషయానికి వస్తే, ఆర్టిఫిషియల్ గా మాగబెట్టిన మామిడి పండ్లలో సహజమైన ‘ఫ్రక్టోజ్’ స్థాయిలు తక్కువగా ఉంటాయి. దీనివల్ల పండు తిన్న తర్వాత నోట్లో ఒక రకమైన చేదు లేదా ఏదైనా ఐరన్ లాంటి పదార్థాన్ని నోటిలో పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా, ఇలాంటి పండ్లు తిన్న కొద్దిసేపటికే గొంతులో గీరగా అనిపించడం లేదా కడుపులో అనీజీగా ఉన్నట్టు అనిపిస్తుంది. కారణం ఇవి పండులోని వెళ్ళిన ఆర్సెనిక్ మరియు ఫాస్ఫరస్ అవశేషాల వల్లే.

ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా

ఇక ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా..కెమికల్ పండ్లు చాలా త్వరగా కుళ్లిపోతాయి. సహజంగా పండిన పండు ఐదు నుండి ఆరు రోజుల వరకు తాజాగా ఉంటే, కెమికల్ పండ్లు రెండు రోజుల్లోనే పైన నల్లగా మారి, లోపల వాసన వచ్చేస్తాయి. మీరు పండ్లను కొనేటప్పుడు అవి మరీ నిగనిగలాడుతూ, ఆర్టిఫిషియల్ మెరుపుతో కనిపిస్తే ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే.ఒకవేళ కొన్న తర్వాత అవి కెమికల్ పండ్లని అనుమానం కలిగితే, వాటిని వెంటనే తినకుండా ఒకటి రెండు రోజులు గాలి తగిలేలా బయట ఉంచాలి. దీనివల్ల అందులోని వాయువులు కొంతవరకు బయటకు పోతాయి. అలాగే పండ్లను కడిగేటప్పుడు కేవలం నీటితోనే కాకుండా, కొంచెం బేకింగ్ సోడా లేదా వెనిగర్ కలిపిన నీటిలో పది నిమిషాలు ఉంచడం వల్ల పైన ఉండే రసాయన అవశేషాలను సమర్థవంతంగా తొలగించవచ్చు.

ఇక ఇవన్ని ఎందుకు అనుకుంటే వీలైనంత వరకు రోడ్లపై కాకుండా మామిడి తోటలు,ఫామ్ లలో దొరికే మామిడి పళ్ళని ఎంచుకోవడం ఉత్తమం.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×