E-Paper
Advertisement

చాలా రోజుల విరామం తరువాత తిరిగి జిమ్‌కు వెళుతున్నారా? ఈ సమస్యలు రావడం ఖాయం

చాలా రోజుల విరామం తరువాత తిరిగి జిమ్‌కు వెళుతున్నారా? ఈ సమస్యలు రావడం ఖాయం
Advertisement

Gym After long break| జిమ్‌లో వ్యాయామం చేసేవారు పని ఒత్తిడి లేదా ఇతర వ్యాపాకాల వల్ల సమయం లేక కొంత కాలం బ్రేక్ తీసుకుంటారు. మళ్లీ తీరిక లభించాక జిమ్ ప్రారంభిస్తారు. అయితే మధ్యలో విరామం సమయంలో ఇన్ని రోజులు వ్యాయామం చేయకపోవడం వలన శరీరం బలం, ఓర్పు, దినచర్యను కోల్పోతుంది. కానీ సరైన విధానంతో మీరు మళ్ళీ సురక్షితంగా ఫిట్ నెస్ ను పొందవచ్చు.

చాలా రోజుల తర్వాత జిమ్ ప్రారంభించినప్పుడు ఎదురయ్యే సమస్యలు

విరామం తరువాత జిమ్ ప్రారంభించనప్పుడు ఎదురయ్యే మొదటి సమస్య శరీరంలో శక్తి, ఓర్పు కోల్పోవడం. రెండవది.. వ్యాయామం చేసిన 12 నుండి 72 గంటల్లో కండరాల నొప్పి రావడం. మూడవది, సరైన మోటివేషన్ (ప్రేరణ) లేకపోవడం, మానసిక అడ్డంకులు. నాల్గవది.. గాయాలు అయ్యే ప్రమాదం ఎక్కువ. ఐదవది, శరీరం బిగుసుకుపోవడం, ఫ్లెక్సిబిలిటీ తగ్గడం.

జిమ్ సురక్షితంగా మళ్ళీ ప్రారంభించడానికి చిట్కాలు

Advertisement

నెమ్మదిగా ప్రారంభించండి. మీ శరీరంలో పూర్వం ఉండే ఎనర్జీ లెవెల్స్ వెంటనే ఉండవు. దానికి కాస్త సమయం పడుతుంది. అందుకే జిమ్ తీవ్రంగా చేయకూడదు. నెమ్మదిగా ప్రారంభించి క్రమంగా పెంచాలి. తక్కువ తీవ్రతతో, తక్కువ సమయం పాటు వ్యాయామం చేయండి. బరువులు తగ్గించండి. మంచి వార్మప్ చాలా ముఖ్యం.
కనీసం 5 నుండి 10 నిమిషాలు వార్మప్ చేయండి. ఇది గాయాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. విశ్రాంతి, పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇవ్వండి. కండరాలకు మరమ్మత్తు కోసం సమయం కావాలి. తగిన నిద్ర, నీరు, పోషకాహారం చాలా ముఖ్యం.

Also Read: గర్భవతిగా ఉన్నప్పుడు టీ తాగితే బిడ్డ నల్లగా పుడతాడా? డాక్టర్లు చెప్పిన నిజం ఇదే

జిమ్‌లో స్థిరంగా ఉండాలి

Advertisement

చిన్న, సాధించదగిన లక్ష్యాలను పెట్టుకోండి. మీ శరీర పురోగతిని ట్రాక్ చేసుకోండి. మీకు నచ్చిన వ్యాయామాలను ఎంచుకోండి. స్నేహితులతో కలిసి వ్యాయామం చేయండి.
కచ్చితత్వం కంటే స్థిరత్వం ముఖ్యం. చిన్న వ్యాయామాలు కూడా మీ దినచర్యను పునర్నిర్మించడానికి సహాయపడతాయి.

చాలా రోజుల తర్వాత జిమ్ ప్రారంభించడం సవాలుగా ఉంటుంది, కానీ అసాధ్యం కాదు. మీ శరీరానికి మళ్ళీ వ్యాయామం చేసే అలవాటు పడటానికి సమయం కావాలి. ఓపికగా ఉండండి. నెమ్మదిగా ప్రారంభించండి. తొందరపాటు మానండి. స్థిరత్వంతో మీరు మళ్ళీ బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×