E-Paper
Advertisement

నెయ్యి కొంటున్నారా? ఒక్క నిమిషం.. అది అసలుదేనా లేక ప్రాణాలు తీసే కల్తీదా? ఇలా చెక్ చేసుకోండి!

నెయ్యి కొంటున్నారా? ఒక్క నిమిషం.. అది అసలుదేనా లేక ప్రాణాలు తీసే కల్తీదా? ఇలా చెక్ చేసుకోండి!
Advertisement

Pure Ghee: కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్టుగా ఉప్పు నుండి పప్పు వరకు , పాల నుండి కోళ్ళ వరకు అన్నీ కల్తీ మాయం అయిపోయాయ్.ఈ క్రమంలో ఎంతో  ఇష్టంగా వేసుకునే నెయ్యి కూడా ఇపుడు కల్తీ పాలు కావడంతో భోజన ప్రియులకి ముద్ద దిగని పరిస్థితి, ముఖ్యంగా కొంతమంది కేటుగాళ్ళు అందులో వనస్పతి, జంతువుల కొవ్వు, చౌక రకపు ఆయిల్స్ కలిపేసి మార్కెట్లోకి విచ్చల విడిగా వదలడం మనం చూస్తున్నాం కూడా. మరి మనం వాడే నెయ్యికూడా ఇలా కల్తీ అయిందో లేక స్వచ్చమైనదో తెలుసుకోవాలంటే ఇదిగో ఇలాంటి చిన్న ట్రిక్స్ పాటిస్తే చాలు.

పసుపు రంగులో ఉండి, కాస్త పూసలు పూసలుగా ఉంటే

Advertisement

అన్నిటికన్నా ముఖ్యంగా నెయ్యి కొనేటప్పుడు అది పసుపు రంగులో ఉండి, కాస్త పూసలు పూసలుగా ఉంటేనే అది మంచి నెయ్యి అని అర్థం. వెలుతురులో చూసినప్పుడు కూడా అది క్లియర్‌గా ఉండాలి. అలా కాకుండా మరీ తెల్లగా ఉంటె మాత్రం అందులో ఏదో కలిపారని అనుమానించాల్సిందే. ముఖ్యంగా దాని వాసన. మూత తీయగానే కమ్మని వాసన రావాలి కాని ,ఏదో మాడిపోయినట్టుగా లేదా అసహ్యకరమైన స్మెల్ వస్తే మాత్రం అది కచ్చితంగా కల్తీ అయినట్టే.

also read:అమ్మ నమ్మకం వర్సెస్ నాస్తికుడి ప్రేమ! అంత్యక్రియల రచ్చపై ప్రకాష్ రాజ్ ‘విశ్వరూపం’.. ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Advertisement

ప్యూర్ నెయ్యి అయితేనే మన ఒంట్లో ఉండే వేడికి ఈజీగా

ఇక మరో టెస్ట్ ఏంటంటే కొంచెం గడ్డకట్టిన నెయ్యిని మీ అరచేతిలో వేసుకోవాలి.అది ప్యూర్ నెయ్యి అయితేనే మన ఒంట్లో ఉండే వేడికి ఈజీగా కరిగిపోతుంది. అలా కరగకుండా అలాగే గడ్డలా ఉంటే మాత్రం అది కల్తీ అని ఫిక్స్ చేసుకోండి .

గ్లాసు పైన తేలితే మంచి నెయ్యి

మరో రకంగా టెస్ట్ చేయాలంటే ఒక గ్లాసు నీళ్లలో ఒక స్పూన్ నెయ్యి వేయండి,అది గ్లాసు పైన తేలితే మంచి నెయ్యి. అలా కాకుండా గ్లాసు అడుగుకు వెళ్ళిపోయిందంటే మాత్రం అందులో బరువు పెంచే పదార్థాలు కలిపారని అర్థం చేసుకోవాలి.

ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారిందంటే

ఇకపోతే ఒక చిన్న గ్లాసులో కొంచెం కరిగించిన నెయ్యి తీసుకొండి.దానిలో అర టీస్పూన్ షుగర్,కొంచెం హైడ్రోక్లోరిక్ యాసిడ్ (ఇది కెమిస్ట్ షాపుల్లో దొరుకుతుంది) వేసి బాగా మిక్స్ అయ్యేలా కలపండి. అలా రెండు నిమిషాలు అయిన తర్వాత ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారిందంటే అందులో వనస్పతి కలిపినట్టేనని కన్ఫాం చేసుకోండి.ఒకవేళ రంగు మారకపోతే అది సేఫ్ అని తెలుసుకోండి.

ఎట్టి పరిస్థితుల్లో రిస్క్ తీసుకోవద్దు 

ముఖ్యంగా నమ్మకస్తుల దగ్గరే నెయ్యి కొనండి లేదంటే ఇంట్లోనే వెన్న కాచుకుని నెయ్యి తయారు చేసుకోండి.అంతే తప్ప నెయ్యి విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రిస్క్ తీసుకోవద్దంటున్నారు ఎక్స్పర్ట్స్.ఎందుకంటే ఆదమరిచి కల్తీ నెయ్యి తీసుకున్నమా.. ఆరోగ్యం పాడవ్వడమే కాదు, గుండె సంబంధిత సమస్యలని కూడా వెల్ కం చేసినట్టే.సో ..కేర్ ఫుల్ గా ఉంటారు కదూ !

also read:మీ ఫ్రిజ్ తెరిస్తే ‘దుర్వాసన’ వస్తోందా? సబ్బుతో కడిగినా పోని ఆ వాసనను 10 నిమిషాల్లో తరిమికొట్టే ‘మ్యాజిక్’ చిట్కాలు!

 

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×