E-Paper
Advertisement

బ్యాటరీ అయిపోయినా ప్రయాణం ఆగదు, విన్ ఫాస్ట్ నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్!

బ్యాటరీ అయిపోయినా ప్రయాణం ఆగదు, విన్ ఫాస్ట్ నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్!
Advertisement

VinFast Ameo 2-in-1 Electric Scooter: విన్‌ ఫాస్ట్ చక్కటి ఎలక్ట్రిక్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. మధ్య తరగతి ప్రయాణీకులకు అందుబాటులో ఉండేలా వీటిని తయారు చేస్తుంది. ఇందులో భాగంగా అమియో అనే చిన్న, తేలికపాటి ఎలక్ట్రిక్ స్కూటర్ ను పరిచయం చేసింది. పట్టణాల్లో రోజువారీ ప్రయాణాల కోసం దీనిని ప్రత్యేకంగా రూపొందించింది. ఇది సాధారణ ఈ-స్కూటర్లతో పోలిస్తే కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే, ఇది 2-ఇన్-1  డిజైన్‌ తో వస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్‌ లా పని చేస్తుంది. ఛార్జింగ్ అయిపోతే, సైకిల్‌ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ స్కూటర్ విద్యార్థులు, తక్కువ దూర ప్రయాణాలు చేసే వారు, తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది.

సైకిల్ లా పెడల్ తో..

అమియో స్కూటర్‌ లో ఉన్న ప్రత్యేకమైన ఫీచర్ పెడల్ సిస్టమ్. సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ అయిపోతే ప్రయాణం ఆగిపోతుంది. కానీ, అమియోలో అలాంటి సమస్య ఉండదు. బ్యాటరీ డౌన్ అయినా, దీనిని సైకిల్‌లా తొక్కుకుంటూ వెళ్లవచ్చు. ఇది చాలా ఉపయోగకరమైన బ్యాకప్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. డిజైన్ పరంగా కూడా అమియో చాలా సింపుల్‌ గా, తేలికగా ఉంటుంది. ఈ స్కూటర్ ను ఎవరైనా సులభంగా హ్యాండిల్ చేసే అవకాశం ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ అనుకూలంగా ఉండేలా తయారు చేశారు. బరువు తక్కువగా ఉండటం వల్ల ట్రాఫిక్‌లో, పార్కింగ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు. నగరాల్లో చిన్న రోడ్లు, గల్లీల్లో ప్రయాణించేందుకు ఉపయోగపడుతుంది.

ఫుల్ ఛార్జ్ తో 70 కిలో మీటర్ల ప్రయాణం

Advertisement

అమియో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ స్కూటర్‌లో 800W ఇన్-హబ్ మోటార్ ఉంటుంది. ఇది ఎక్కువ వేగం కోసం కాదు. కానీ సేఫ్‌గా, సౌకర్యంగా ప్రయాణించడానికి సరిపడేలా ఉంటుంది. దీని గరిష్ట వేగం సుమారు గంటకు 30 కిలో మీటర్ల వరకు ఉంటుంది. ఇందులో 1.024 kWh లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ఉంటుంది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 60 నుంచి 70 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది.

డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు!

మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే.. తక్కువ వేగం కారణంగా ఈ స్కూటర్ కు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు.  ఇది విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఇక స్కూటర్ ధర విషయానికి వస్తే, ఎంట్రీ లెవల్ ధర సుమారు రూ. 65 వేలు ఉంటుంది. టాప్ ఎండ్ ధర రూ.  81 వేల వరకు ఉంటుంది.

Advertisement

ఇక విన్‌ ఫాస్ట్ కంపెనీ ఇప్పటికే పలు ఎలక్ట్రిక్ వాహనాలతో మార్కెట్‌లోకి రావడానికి రెడీ అవుతోంది. అమియో కూడా ఆ లైనప్ లో ఓ కీలకమైన మోడల్ గా మారబోఓంది. ఇది ముఖ్యంగా ఎంట్రీ లెవల్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని, తక్కువ ధరలో అందుబాటులోకి రానుంది. ఎక్కువ స్పీడ్ అవసరం లేకుండా, తక్కువ దూరాలు ప్రయాణించాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ కానుంది.

Read Also: రూట్ మార్చిన ఏథర్.. జస్ట్ లక్షకే ఎలక్ట్రిక్ స్కూటర్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×