E-Paper
Advertisement

ప్రొటీన్ ఏ సమయంలో తీసుకోవడం ఆరోగ్యానికి బెస్ట్? అందరూ చేసే తప్పులు ఇవే

ప్రొటీన్ ఏ సమయంలో తీసుకోవడం ఆరోగ్యానికి బెస్ట్? అందరూ చేసే తప్పులు ఇవే
Advertisement

Protein Consuming Timing| మన శరీరంలో కండరాలు నిర్మించేందుకు, బలాన్ని పెంచడంలో ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఆరోగ్య నిపుణులు చాలా మంది ప్రోటీన్ తీసుకునే టైమింగ్ చాలా ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు. కానీ ఇప్పుడు నిపుణులు మరింత సమతుల్యమైన దృక్పథాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ప్రోటీన్ టైమింగ్ అంటే ఏంటి?

ప్రోటీన్ టైమింగ్ అంటే రోజులో నిర్దిష్ట సమయాల్లో ప్రోటీన్ తీసుకోవడం. చాలా మంది వర్కౌట్ తర్వాత ప్రోటీన్ తీసుకుంటారు. కొందరు నిద్ర పోయే ముందు లేదా ఉదయం తీసుకుంటారు. ఇది “అనాబాలిక్ విండో” అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది. వర్కౌట్ తర్వాత వెంటనే ప్రోటీన్ తీసుకుంటే కండరాల వృద్ధి ఎక్కువ అవుతుందని భావించేవారు. కానీ ఇటీవలి అధ్యయనాలు ఈ విధానం పూర్తిగా సరైనది కాదని చెబుతున్నాయి.

టైమింగ్ నిజంగా ముఖ్యమా?

Advertisement

నిపుణులు ప్రతిరోజు మీరు తీసుకునే ప్రోటీన్ టైమింగ్ కంటే ఎంత మొత్తంలో తీసుకునేది ముఖ్యమని చెబుతున్నారు. టైమింగ్ ఏదైనా కండరాల వృద్ధి దాదాపు సమానంగానే ఉంటుందని అధ్యయనాల్లో తేలింది. చూపించాయి. రోజుకు అవసరమైన ప్రోటీన్ మొత్తం తీసుకుంటే కండరాలు పెరుగుతాయి. వర్కౌట్ తర్వాత వెంటనే తినాల్సిన అవసరం లేదు. శరీరం రోజంతా ప్రోటీన్‌ను సమర్థవంతంగా ఉపయోగిస్తుంది.

రోజువారీ ప్రోటీన్ మొత్తం ఎంత ముఖ్యం?

కండరాల వృద్ధికి రోజువారీ ప్రోటీన్ తీసుకోవడం అతి ముఖ్యం. శారీరక శ్రమ చేసేవారికి ఎక్కువ ప్రోటీన్ అవసరం. నిపుణులు శరీర బరువు ప్రతి కిలోకి 1.4 నుంచి 2 గ్రాములు సూచిస్తారు. కొందరు 1.6 నుంచి 2.2 గ్రాములు దాకా అవసరమని అభిప్రాయపడతారు. ఈ మొత్తం తీసుకుంటే దెబ్బతిన్న కండరాలు మళ్లీ రిపేర్ కావడం బాగా జరుగుతుంది.

భోజనాల మధ్య ప్రోటీన్ పంపిణీ ఎందుకు మంచిది?

Advertisement

మీరు ఒక రోజులో తినే తినే భోజనంలో ప్రొటీన్ సమానంగా తీసుకోవడం మంచిది. దీంతో శరీరానికి నిరంతరం అమినో యాసిడ్స్ లభిస్తాయి. ప్రతి భోజనంలో 20 నుంచి 30 గ్రాముల ప్రోటీన్ తీసుకోవడం బెస్ట్. ఇలా చేస్తే కండరాలు బాగా కోలుకుంటాయి, అలసట కూడా తగ్గుతుంది.

వ్యాయామం తర్వాత ప్రోటీన్ ఎంత ముఖ్యం?

వ్యాయామం తర్వాత ప్రోటీన్ తీసుకోవడం ఇప్పటికీ మంచిదే. దీంతో కండరాలకు అవసరమైన బలం, కండరాల మరమ్మత్తుకు సహాయపడుతుంది. కానీ టైమింగ్ మరీ అంత ముఖ్యం కాదు. వ్యాయామం తర్వాత కొన్ని గంటల్లో సమతుల్య భోజనం తీసుకుంటే చాలు.

టైమింగ్ ఎప్పుడు ఉపయోగపడుతుంది

క్రీడాకారులు ముఖ్యంగా అథ్లెట్లు, బాడీబిల్డర్లు టైమింగ్‌ను సరిగ్గా పాటిస్తే ఎక్కువ లాభం పొందవచ్చు. వయసు ముదిరిన వారు కూడా ప్రోటీన్‌ను సమానంగా పంచుకోవడం ద్వారా కండరాలను కాపాడుకోవచ్చు. భోజనాలు మిస్ అవుతున్నవారు టైమింగ్ ప్లాన్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

Also Read: యవ్వనంలోనే ముసలితనం ఛాయలు.. దేశంలో పెరుగుతున్న సమస్య.. ధృడమైన శరీరం కోసం ఈ టిప్స్

నిద్ర పోయే ముందు ప్రోటీన్

నిద్ర పోయే ముందు నెమ్మదిగా జీర్ణమయ్యే ప్రోటీన్ తీసుకోవడం మంచిది. ఇది రాత్రంతా కండరాల మరమ్మత్తుకు సహాయపడుతుంది. పాలు  లేదా పెరుగు మంచి ఆప్షన్లు.

సరైన సమయంలో ప్రోటీన్ తీసుకోవడం ఉపయోగకరమే కానీ అనివార్యం కాదు. రోజువారీ అవసరమయ్యే మొత్తం ప్రోటీన్ తీసుకునే సమయం ముఖ్యం కాదు. తగినంత ప్రోటీన్ తీసుకుని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. దీంతో దీర్థకాలంలో మంచి ఫలితాలు సాధించవచ్చు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×