E-Paper
Advertisement

Drinking coffee late: కాఫీ తాగితే ఆరోగ్య సమస్యలు.. ఎప్పుడు తాగకూడదో తెలుసా?

Drinking coffee late: కాఫీ తాగితే ఆరోగ్య సమస్యలు.. ఎప్పుడు తాగకూడదో తెలుసా?
Advertisement

Drinking coffee late| చాలా మందికి కాఫీ తాగడం రోజువారీ అలవాటులో ముఖ్య భాగం. ఒక్క కప్ కాఫీ లేకుండా రోజు గడవదని అనిపిస్తుంది. అయితే ఆరోగ్య నిపుణులు కాఫీ తాగే సమయం చాలా ముఖ్యమని చెబుతున్నారు. దీని వెనుక బలమైన సైన్స్ కారణాలు ఉన్నాయి. కాఫీలో ఉండే కెఫీన్ ఆలస్యంగా తీసుకోవడం వల్ల మీ శరీరం టైమింగ్ (నిద్రపోయే, మేల్కొనే) దెబ్బతీస్తుంది. అంతే కాదు మంచి నిద్ర, మొత్తం శరీరం రికవరీని ప్రభావితం చేస్తుంది.

కాఫీ తాగే సమయం ఎందుకు ముఖ్యం?

అనస్థీషియా వైద్య నిపుణులు డాక్టర్ కునాల్ సూద్.. కాఫీ ఆరోగ్య ప్రభావాల గురించి సోషల్ మీడియాలో కొన్ని సూచనలు చేశారు. కాఫీలోని కెఫీన్ మీ శరీరం నుంచి త్వరగా బయటకు వెళ్లదు. ఇది తాగిన తర్వాత చాలా గంటల పాటు చురుకుగా ఉంటుంది. సాయంత్రం ఆలస్యంగా కాఫీ తాగడం వల్ల మీ విశ్రాంతి సమయంపై ప్రభావితం చేస్తుంది. శరీరం సహజంగా నిద్రకు సిద్ధమయ్యే ప్రక్రియలో కెఫీన్ జోక్యం చేసుకుంటుంది. దీని వల్ల మెదడు.. నిద్రకు సిద్ధం కావడం కష్టమవుతుంది.

కాఫీన్ మెదడును ఎలా ప్రభావితం చేస్తుంది?

Advertisement

డాక్టర్లు చెప్పినట్లు కెఫీన్ మెదడు పర్‌ఫామెన్స్ మారుస్తుంది. ఇది మెదడును మరింత యాక్టివ్ స్థితిలో ఉంచుతుంది. సాయంత్రం లేదా రాత్రి కాఫీ తాగితే నిద్రకు సిద్ధమయ్యే శరీరం ఒక్కసారిగా యాక్టివ్ అయిపోతుంది. దీని వల్ల సహజంగా పనిచేసే నిద్ర వ్యవస్థ, రికవరీ సమయ చక్రాలు దెబ్బతింటాయి. ఫలితంగా మీ శరీరం సరిగ్గా విశ్రాంతి తీసుకోలేకపోతుంది.

కెఫీన్ నిద్ర సంకేతాలను ఎలా అడ్డుకుంటుంది?

నిద్రకు సంబంధించిన ముఖ్య రసాయనాలతో కెఫీన్ జోక్యం చేసుకుంటుంది. మెదడులో అడెనోసిన్ రిసెప్టర్లను కెఫీన్ అడ్డుకుంటుంది. అడెనోసిన్.. మీ శరీరం అలసిపోయి నిద్రకు సిద్ధమయ్యేలా చేస్తుంది. ఈ రిసెప్టర్లు అడ్డుకుంటే మెదడు నిద్ర సంకేతాలను సులభంగా గుర్తించదు. దీని వల్ల అంత సులువగా నిద్రపట్టదు. ఉదయం త్వరగా నిద్రలేస్తే శరీరానకి సరైన విశ్రాంతి లభించదు.

నిద్ర ఆలస్యం, దీర్ఘకాలిక ప్రభావాలు

Advertisement

కెఫీన్ మీ సహజ నిద్ర సమయాన్ని గణనీయంగా ఆలస్యం చేస్తుంది. ఇది స్లీప్ లేటెన్సీని పెంచి నిద్రపోవడం కష్టతరం చేస్తుంది. చిన్న మొత్తంలో కూడా నిద్ర చక్రాన్ని ప్రభావితం చేయవచ్చు. దీని ప్రభావం 6 గంటలు లేదా అంతకంటే ఎక్కువసేపు ఉండవచ్చు. అంటే ఆలస్యంగా కాఫీ తాగడం మీ నిద్ర సమయాన్ని దెబ్బతీస్తుంది.

నిద్ర క్వాలిటీపై ప్రభావం

గాఢ నిద్ర.. శారీరక, మానసిక రికవరీకి చాలా ముఖ్యం. మీరు పొందే క్వాలిటీ నిద్ర సమాయాన్ని కెఫీన్ తగ్గిస్తుంది. బదులుగా తేలికపాటి నిద్ర మాత్రమే లభిస్తుంది. దీని వల్ల మీ శరీరం పునరుద్ధరణ కోసం కావాల్సిన అత్యం ముఖ్యమైన నిద్ర దశను కోల్పోతుంది.

రాత్రి ఎక్కువసార్లు నిద్ర నుంచి మేల్కోవడం

కెఫీన్ రాత్రంతా నిద్ర స్థిరత్వాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. నిద్ర సమయంలో మెదడు చురుకుదనాన్ని కెఫీన్ పెంచుతుంది. దీంతో రాత్రి నిద్రపోయే సమయంలో ఎక్కువసార్లు మెలుకువ వస్తుంది.

స్ట్రెస్ హార్మోన్లపై ప్రభావం

కెఫీన్ శరీరంలో కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి పెంచుతుంది. కార్టిసాల్ శరీరాన్ని అప్రమత్తంగా, చురుకుగా ఉంచడానికి సహాయపడుతుంది. సాయంత్రం కార్టిసాల్ స్థాయి పెరగడం నిద్ర సమయాన్ని దెబ్బతీస్తుంది. దీంతో ప్రశాంతంగా నిద్రపోవడం కష్టతరం అవుతుంది.

Also Read: నోటి దుర్వాసనతో ఇబ్బందిపడుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలే కారణం

నిద్రపోయినా మరుసటి రోజు అలసట

మీరు కావాల్సిన గంటలు నిద్రపోయినా అలసటగా ఉండవచ్చు. నిద్ర సమయంలో కూడా శరీరానికి విశ్రాంతి లభించదు. దీంతో మరుసటి రోజు ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. పనివేళల్లో అలసటగా ఉంటుంది. నిద్రపోవాలనిపిస్తుంది. దీంతో సరిగా పనిచేయలేకపోతారు. ఈ కారణంగా ఆఫీసులో యాక్టివ్‌గా ఉండేందుకు మళ్లీ కాఫీ, టీ తాగాలనిపిస్తుంది.

ఆలస్యంగా కాఫీ తాగడం మీ నిద్ర ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇది నిద్ర క్వాలిటీ తగ్గించి సహజ శరీర లయను దెబ్బతీస్తుంది. పడుకునే సమయానికి కనీసం 6 గంటల ముందు కాఫీ తాగకూడదు. సరైన నిద్ర ఆరోగ్యానికి ఎంతో అవసరం.

ముఖ్యమైన గమనిక: ఈ కథనంలో తెలిపిన వివరాలు వైద్య నిపుణుల అభిప్రాయాలు. ఇందులో ఏమైనా తప్పిదాలకు ‘బిగ్‌టీవి’ బాధ్యత వహించదు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×