E-Paper
Advertisement

దాంపత్య జీవితంలో ప్రేమతో పాటు ఆత్మగౌరవం చాలా ముఖ్యం.. ఈ విషయాల్లో ఎప్పుడూ రాజీ పడకండి

దాంపత్య జీవితంలో ప్రేమతో పాటు ఆత్మగౌరవం చాలా ముఖ్యం.. ఈ విషయాల్లో ఎప్పుడూ రాజీ పడకండి
Advertisement

ప్రేమ అనేది ఏ సంబంధానికైనా బలమైన పునాది. అయితే ప్రేమ కోసం మన ఆత్మగౌరవాన్ని, సంతోషాన్ని త్యాగం చేయకూడదు. చాలా మంది తమ భాగస్వామి కోసం ఎన్నో విషయాల్లో రాజీ పడతారు. కానీ ఆరోగ్యకరమైన సంబంధం అంటే ఇద్దరూ ఒకరినొకరు గౌరవించడం, అర్థం చేసుకోవడం, ప్రోత్సహించడం. మంచి సంబంధం ఇద్దరి ఎదుగుదలకు సహాయపడాలి. ఒకరిని తక్కువగా భావించేలా చేయకూడదు. అందుకే ఈ ఐదు విషయాల్లో ఎప్పుడూ రాజీ పడకూడదు.

ఎప్పుడూ విమర్శించే స్వభావాన్ని సహించకండి

సలహాలు ఇవ్వడం, తప్పులను సరిదిద్దడం మంచిదే. కానీ ప్రతి విషయానికీ విమర్శించడం సరైన పద్ధతి కాదు. కొంతమంది తమ జీవిత భాగస్వామి బాహ్య రూపం, దుస్తులు లేదా వ్యక్తిగత నిర్ణయాలపై ఎప్పుడూ తప్పులు మాత్రమే చూపిస్తుంటారు. ఇలా నిరంతరం విమర్శలు చేయడం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. మంచి భాగస్వామి తప్పులను మాత్రమే కాకుండా మీ మంచి లక్షణాలను కూడా గుర్తిస్తాడు. అందుకే అవతలి వ్యక్తి ఎప్పడూ విమర్శిస్తూనే ఉంటే అది సరికాదు.

అపరాధ భావనకు గురికావద్దు

Advertisement

ప్రతి వ్యక్తికీ ప్రేమ, సమయం, మద్దతు అవసరం. వాటిని కోరడం తప్పు కాదు. అయితే కొన్నిసార్లు భాగస్వామి మన భావాలను పట్టించకోకుండా మనల్ని స్వార్థపరులుగా భావించేలా చేస్తారు. ఇది ఆరోగ్యకరమైన సంబంధానికి సంకేతం కాదు. మీ భావాలు కూడా అంతే ముఖ్యమైనవి. మీ మనసులోని మాటను చెప్పేందుకు ఎప్పుడూ భయపడకండి.

రోజులు తరబడి మాట్లాడకుండా ఉండడం తప్పు

ప్రతి సంబంధంలో చిన్నచిన్న వాదనలు జరుగుతాయి. కొంత సమయం తీసుకుని ప్రశాంతంగా ఉండడం సహజం. కానీ రోజులు తరబడి మాట్లాడకుండా ఉండడం సమస్యలను మరింత పెంచుతుంది. దీని వల్ల మీ ఇద్దరి మధ్య మానసిక దూరం మరింత పెరుగుతుంది. ఏ సమస్యనైనా పరిష్కరించడానికి సంభాషణే ఉత్తమ మార్గం. కాబట్టి మౌనంగా ఉండటం కంటే మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలి.

మనసులోని భావాలను ఎప్పుడూ దాచుకోవద్దు

Advertisement

కొంతమంది గొడవలు వస్తాయనే భయంతో తమ బాధలను బయటపెట్టరు. కానీ ఇలా చేయడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. మనసులో అణిచివేసిన భావాలు కాలక్రమేణా సంబంధాన్ని దెబ్బతీస్తాయి. అందుకే మీ సమస్యలను ప్రశాంతంగా, గౌరవంగా చెప్పడం మంచిది. నిజాయితీతో మాట్లాడే సంబంధాల్లో నమ్మకం మరింత బలపడుతుంది.

Also Read: జిమ్ చేస్తే జుట్టు రాలే సమస్య.. ఇది నిజమేనా?

మీ విజయాలను చూసి సంతోషించే భాగస్వామిని ఎంచుకోండి

మంచి భాగస్వామి మీ విజయాలను చూసి సంతోషిస్తాడు. మీ ఎదుగుదలకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటాడు. మీ సాధనలను చూసి అసూయపడటం లేదా అసౌకర్యంగా ఫీలవడం మంచి సంకేతం కాదు. సంబంధంలో ఇద్దరూ ఒకరినొకరు ముందుకు నడిపించాలి. పరస్పర
ప్రోత్సాహం సంబంధాన్ని మరింత బలంగా మారుస్తుంది.

సంతోషకరమైన సంబంధానికి ప్రేమ, నమ్మకం, గౌరవం అవసరం. అయితే ఆత్మగౌరవం ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండాలి. నిరంతర విమర్శలు, భావోద్వేగ ఒత్తిడి, మౌన శిక్ష, భావాలను అణచివేయడం.. విజయాలపై అసూయ వంటి విషయాల్లో ఎప్పుడూ రాజీ పడకండి. మంచి సంబంధం మనల్ని ఎదగనిస్తుంది, సంతోషంగా ఉంచుతుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×