E-Paper
Advertisement

Health Tips: మీ వంటింట్లో ఈ మార్పులు చేసుకుంటే.. జిమ్‌కు వెళ్లకుండానే ఈజీగా బరువు తగ్గొచ్చు!

Health Tips: మీ వంటింట్లో ఈ మార్పులు చేసుకుంటే.. జిమ్‌కు వెళ్లకుండానే ఈజీగా బరువు తగ్గొచ్చు!
Advertisement

Health Tips: చాలామంది బరువు తగ్గడం అంటే కేవలం జిమ్‌లో గంటల తరబడి చెమటలు చిందించడం అనుకుంటారు. కానీ అసలైన మార్పు వంటగది నుంచే మొదలవుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటి బాధ్యతలు, ఆఫీసు పని ఒత్తిడిలో మహిళలు తమ ఆరోగ్యాన్ని గాలికొదిలేస్తుంటారు. మనం చేసే కొన్ని సాధారణ తప్పులే దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తాయి. ఆ చిన్న పొరపాట్లను సరిదిద్దుకుంటే ఆరోగ్యం మీ గుప్పిట్లోనే ఉంటుంది.

అలాంటి అలవాట్లే ప్రమాదం:

త్వరగా పనైపోతుందని పిల్లల లంచ్ బాక్సుల్లో ప్యాక్డ్ ఫుడ్స్ పెట్టడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. కడుపు నిండుతుంది కానీ పోషకాలు మాత్రం శూన్యం. ఇలాంటి అలవాటే ఊబకాయం, షుగర్ వంటి సమస్యలకు పునాది వేస్తుంది. వీలైనంత వరకు తాజా కూరగాయలు, అప్పటికప్పుడు వండుకున్న పదార్థాలనే తీసుకోవాలి. ఒకవేళ పొద్దున్నే వంట చేయడం కుదరకపోతే ఓట్స్‌ను పాలలో కలుపుకుని తీసుకోవడం లేదా త్వరగా అయిపోయే సలాడ్స్‌ను ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.

Advertisement

Also Read: పురుషుల్లోనే ఎక్కువగా జుట్టు రాలడానికి గల 4 ప్రధాన కారణాలు ఇవే!

ఇంట్లోనే చిరుతిళ్ల తయారీ:

ఆకలి వేసినప్పుడు చిప్స్ తినడం లేదా నూడుల్స్ వండుకోవడమో ఈజీ. కానీ ఆ రుచి వెనుక ప్రాణాంతక గుండె జబ్బులు దాగున్నాయి. మన అమ్మమ్మల కాలం నాటి సున్నుండలు, జంతికలు లేదా వేయించిన పప్పుల వంటి హెల్దీ స్నాక్స్‌ను వారానికి ఒక్కరోజు టైమ్ కేటాయించుకుని, ఇంట్లోనే చేసి పెట్టుకుంటే, ఆఫీసులో ఆకలి వేసినప్పుడు జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా ఉండొచ్చు.

తినేటప్పుడు ఫోన్ చూడొద్దు:

Advertisement

ప్రస్తుతం చాలామందికి భోజనం చేయడం ఒక తంతుగా మారిపోయింది. టీవీ చూస్తూనో, ఫోన్ స్క్రోల్ చేస్తూనో గబగబా నోట్లో కుక్కుకోవడం వల్ల ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో మెదడుకు ఎక్కడం లేదు. దీంతో జీర్ణక్రియ మందగించి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. 5 నిమిషాల్లో భోజనం ముగించేసినా సరే, ప్రశాంతంగా కూర్చుని రుచిని ఆస్వాదిస్తూ తినాలి. అప్పుడే మీరు తీసుకున్న ఆహారంలోని సారం శరీరానికి పడుతుంది.

మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే:

మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఆహారపు అలవాట్లను మార్చుకోవడం కాదు.. మన ఆరోగ్యానికి అనుగుణంగా మన జీవనశైలిని మార్చుకోవాలి. మీ రోజువారీ మెనూలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఆసుపత్రుల చుట్టూ తిరిగే పని ఉండదు. శరీరానికి కావాల్సింది కేవలం కేలరీలు మాత్రమే కాదు, నాణ్యమైన పోషకాలు కూడా అందాలని గుర్తించుకోండి.

Also Read: క్యాన్సర్ కణాలకు మరణశాసనం.. కొత్త యాంటీబాడీతో ప్రాణాంతక వ్యాధికి అడ్డుకట్ట!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×