E-Paper
Advertisement

Samantha Health: సమంతకు మయోసైటిస్ వ్యాధి పూర్తిగా తగ్గిపోయిందా?

Samantha Health: సమంతకు మయోసైటిస్ వ్యాధి పూర్తిగా తగ్గిపోయిందా?
Advertisement

ప్రముఖ హీరోయిన్ సమంత రూత్ ప్రభు రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమె బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహమాడారు. కాగా గతంలో తనకు మయోసైటిస్ అనే వ్యాధి వచ్చినట్టు ఆమె చెప్పారు. ఇప్పుడు కూడా ఆమె అదే వ్యాధితో బాధపడుతోందా అనే సందేహం ఎక్కువ మందికి ఉంది. ఎందుకంటే అది అరుదైన వ్యాధి. ఈ వ్యాధిలో మన శరీరంలో రక్షణ వ్యవస్థ తప్పుగా పనిచేసి ఆరోగ్యకరమైన సొంత మసిల్స్ పై దాడి చేస్తుంది. ఫలితంగా శరీరంలో నొప్పి, మంట, అలసట, బలహీనత వస్తాయి. సమంత మొదట్లో చాలా కష్టంగా ఉండేదని అప్పట్లో చెప్పింది. చిన్న పనులు చేయడం కూడా కష్టంగా ఉండేది. మొదట్లో ఆమెకు ఈ వ్యాధి ఏమిటో అర్థం కాలేదు. కానీ కొంతకాలం తరువాత డాక్టర్లను సంప్రదించి పరీక్షలు చేయించగా మయోసైటిస్ అని తేలింది. ఈ వ్యాధి ప్రారంభంలో సమంతకు తీవ్ర అలసట, శక్తి తగ్గడం, కండరాల‌ నొప్ వంటి లక్షణాలు కనిపించేవి.

సమంత చికిత్స ఇలా

Advertisement

డాక్టర్లు చికిత్సలో భాగంగా ఆమెకు స్టెరాయిడ్ మందులు సూచించారు. ఇవి మసిల్స్‌లో వాపు తగ్గించడంలో సహాయపడ్డాయి. సమంత ఈ మందులు తీసుకుని కొంత తేరుకుంది. కానీ, స్టెరాయిడ్ మందులు కొన్నిసార్లు చర్మ సమస్యలు, మొటిమలు వంటి సైడ్ఎఫెక్ట్స్ కూడా వచ్చాయి. అందుకే ఆమె తన ఆహారాన్ని పూర్తిగా మార్చుకుంది. ఆరోగ్యకరమైన కూరగాయలు, ఫ్రూట్స్, ఆర్గానిక్ పదార్థాలు ఎక్కువగా తినడం ప్రారంభించింది. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ దూరంగా పెట్టింది.

అలాగే సమంత ఫిజియోథెరపీ, సాధారణ వ్యాయామాలు, ఫిట్‌నెస్ రొటీన్‌ను పాటించడం ప్రారంభించారు. మానసికంగా బలంగా ఉండేందుకు మెడిటేషన్, మైండ్‌ఫుల్‌ లైఫ్‌స్టైల్ పాటించారు. ఈ విధంగా సమంత తన శరీరాన్ని మళ్లీ బలంగా, ఫిట్‌గా మార్చుకున్నారు.కొన్ని నెలల కష్టమైన ప్రయాణం తర్వాత, ఆమె మళ్లీ షూటింగ్ కు వెళ్లడం మొదలుపెట్టారు. సమంత ఒకసారి మాట్లడుతూ నా శరీరం కొద్దిగా బలహీనంగా ఉంది, కానీ శక్తివంతంగా ఉన్నాను.

Advertisement

ఈ వ్యాధి కారణంగా సమంత కొన్ని రోజుల విరామం తీసుకోవాల్సి వచ్చింది. ఆమె తన అనుభవం, కష్టాలను అభిమానులతో షేర్ చేశారు. సమంత మాట్లాడుతూ వ్యాధులు, కష్టాలు ఎదురైనా సరైన వైద్యం, జీవనశైలి మార్పులు, ధైర్యం ఉంటే మనం వాటిని అధిగమించవచ్చని చెప్పింది. గతంలో పెద్ద సినిమాలు, బ్లాక్‌బస్టర్లు మాత్రమే సక్సెస్ అనిపించేవి, ఇప్పుడు సమంత ఆరోగ్యం, మనశ్శాంతి, జీవన సమతుల్యతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

సమంత కథనం ప్రతీ ఒక్కరికీ ప్రేరణ. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు మనకు వచ్చే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని, ఆహారం, వ్యాయామం, జీవనశైలి మార్పులతో ఆరోగ్యంగా, బలంగా ఉండవచ్చని ఆమె చూపించారు. ఈ అనుభవం ఆమెకు మాత్రమే కాదు మన అందరికీ ఒక బలమైన సందేశం. వ్యాధులు వస్తే భయపడవద్దు.. సాయం తీసుకోండి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×