E-Paper
Advertisement

రోజువారీ కాఫీతో లివర్ సేఫ్.. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ చెప్పిన షాకింగ్ విషయాలివే!

రోజువారీ కాఫీతో లివర్ సేఫ్.. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ చెప్పిన షాకింగ్ విషయాలివే!
Advertisement

Liver Health Tips: చాలామందికి ఉదయం లేవగానే కాఫీ తాగడం ఒక అలవాటు మాత్రమే కాదు.. అదొక దినచర్య. అయితే ప్రతిరోజూ కాఫీ తాగడం వల్ల మన శరీరానికి, ముఖ్యంగా కాలేయానికి (లివర్) మంచి జరుగుతుందా లేదా అనే అనుమానం చాలామందిలో ఉంటుంది. ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథీ సోషల్ మీడియాలో ఒక వీడియో పంచుకున్నారు. దాని ప్రకారం చూస్తే.. రోజువారీ కాఫీ అలవాటు మన లివర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, అలాగే ఆయన వెల్లడించిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

లివర్ ఆరోగ్యానికి మేలైన డ్రింక్:

కాఫీ తాగడం వల్ల లివర్ ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు. తరచూ కాఫీ తాగేవారిలో ‘సిర్రోసిస్’ వంటి తీవ్రమైన లివర్ సమస్యలు వచ్చే ప్రమాదం దాదాపు 44 శాతం వరకు తగ్గుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. లివర్‌లో మచ్చలు ఏర్పడి, అది సరిగ్గా పనిచేయకుండాపోయే పరిస్థితినే సిర్రోసిస్ అంటారు. కాఫీ ఈ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

Advertisement

Also Read: వైట్ వెనిగర్, డిష్‌వాష్ లిక్విడ్ కలిపి వాడితే.. అద్భుతమైన ఫలితాలు చూస్తారు!

ఎంజైమ్ స్థాయిలలో మెరుగుదల:

శరీరంలో జీవక్రియలు, విష పదార్థాల తొలగింపునకు లివర్ ఎంజైమ్‌లు చాలా ముఖ్యం. మన రక్త పరీక్షల్లో ఏఎల్టీ (ALT), ఏఎస్టీ (AST) స్థాయిలు పెరిగితే లివర్ ప్రమాదంలో ఉందని అర్థం. క్రమం తప్పకుండా కాఫీ తాగడం వల్ల ఈ కీలక ఎంజైమ్ స్థాయిలు అదుపులో ఉంటాయని, ఫలితంగా లివర్ పనితీరు మెరుగ్గా ఉంటుందని డాక్టర్ సేథీ తెలిపారు.

ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్:

Advertisement

ప్రస్తుత కాలంలో దాదాపు ముగ్గురిలో ఒకరు ఫ్యాటీ లివర్ (NAFLD) సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారికి కాఫీ ఒక మంచి సహజ పరిష్కారంగా పనిచేస్తుంది. లివర్‌లో కొవ్వు చేరకుండా చూడటంలోనూ, ఫ్యాటీ లివర్ తీవ్రతను తగ్గించడంలోనూ కాఫీకి బలమైన వైద్య ఆధారాలు ఉన్నాయి.

డీకాఫ్ కాఫీతోనూ ఫలితం:

కేవలం కెఫిన్ ఉన్న సాధారణ కాఫీ మాత్రమే కాకుండా.. కెఫిన్ లేని డీకాఫినేటెడ్ (Decaf) కాఫీ తాగినా ఈ ప్రయోజనాలు పొందవచ్చు. కాఫీలోని ప్రయోజనాలు కేవలం కెఫిన్ వల్లనే కాకుండా.. అందులో ఉండే పోలిఫెనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్ల వల్ల లభిస్తాయి. కాబట్టి.. కెఫిన్ పడనివారు డీకాఫ్ కాఫీ ఎంచుకున్నా లివర్ ఎంజైమ్‌లు అదుపులో ఉంటాయి.

Also Read: ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే టాయిలెట్ పేపర్ రోల్‌తో ఇలా చెక్ పెట్టండి!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×