E-Paper
Advertisement

పీరియడ్స్ సమయంలో మహిళలు ఈ పండ్లు అసలు తినకూడదు.. ఎందుకంటే

పీరియడ్స్ సమయంలో మహిళలు ఈ పండ్లు అసలు తినకూడదు.. ఎందుకంటే
Advertisement

Fruits to Avoid During Periods| పీరియడ్స్ అంటే ఋతుస్రావం సమయంలో మహిళలు.. నొప్పి, తిమ్మిరి, మూడ్ స్వింగ్స్‌తో బాధపడతారు. ఇది సహజమే. ఈ సమయంలో నొప్పి తీవ్రంగా కాకుండా, ఉపశమనం కోసం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయంలో తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ఋతుస్రావం సమయంలో కొన్ని పండ్లు ఆరోగ్యానికి మంచివి కాగా, కొన్ని అసౌకర్యం కలిగిస్తాయి. అందుకే మహిళలు పీరియడ్స్ సమయంలో ఆరోగ్యంగా ఉండాలంటే తినే పండ్లు విషయంలో చాలా జాగ్రత్త వహించాలి.

పీరియడ్స్ సమయంలో ఆహారం చాలా ముఖ్యం

ఋతుస్రావం సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల జీర్ణక్రియ, మూడ్, ఎనర్జీ లెవెల్స్ ప్రభావితం అవుతాయి. కొన్ని ఆహారాలు తింటే శరీరంలో వాపు, తిమ్మిరి, చికాకు వంటి సమస్య వస్తాయి. సరైన ఆహారం తీసుకోవడం వల్ల నొప్పి తగ్గి సౌకర్యం పెరుగుతుంది. డాక్టర్లు ఈ సమయంలో తేలికపాటి, సమతుల్య ఆహారం తినాలని సూచిస్తారు.

పీరియడ్స్‌లో ఇబ్బంది కలిగించే పండ్లు

1. నిమ్మ, నారింజ లాంటి సిట్రస్ పండ్లు

Advertisement

నారింజ, నిమ్మకాయ, బత్తాయి వంటి సిట్రస్ పండ్లలో యాసిడ్ (ఆమ్లం) ఎక్కువగా ఉంటుంది. కొందరు వ్యక్తులకు ఇవి కడుపులో చికాకు కలిగించవచ్చు. ఇది పీరియడ్స్ సమయంలో అసౌకర్యాన్ని పెంచుతుంది. అయితే మితంగా తింటే సమస్య ఉండదు.

2. పచ్చి బొప్పాయి

పచ్చి బొప్పాయిలో గర్భాశయ సంకోచాలను ప్రభావితం చేసే కాంపౌండ్స్ ఉంటాయి. ఎక్కువగా తినడం వల్ల కడుపులో తిమ్మిరి పెరగవచ్చు. పీరియడ్స్ సమయంలో పండు బొప్పాయి తినడమే మంచిది.

3. డ్రై ఫ్రూట్స్

Advertisement

ఎండు ద్రాక్ష, ఆప్రికాట్ వంటి డ్రై ఫ్రూట్స్‌లో సహజ చక్కెర ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అధిక చక్కెర.. వాపు, భారం కలిగించవచ్చు. పీరియడ్స్ సమయంలో ఇవి జీర్ణ సమస్యలను పెంచుతాయి.

4. ఎక్కువ తీపి ఉండే పండ్లు

ఎక్కువ చక్కెర ఉన్న పండ్లు రక్తంలో చక్కెరను త్వరగా పెంచుతాయి. దీంతో మూడ్ స్వింగ్స్, అలసట కలుగుతుంది. పీరియడ్స్ సమయంలో ఇలాంటి పండ్లను పరిమితం చేయాలి.

5. ఫ్రిజ్‌లో ఉంచిన లేదా చల్లని పండ్లు

చల్లని పండ్లు కొంతమందికి భారంగా అనిపించి జీర్ణక్రియను నెమ్మది చేస్తాయి. దీంతో కడుపులో వాపులాగా అనిపిస్తుంది. అందుకే ఫ్రిజ్‌లో పెట్టినవి కాకుండా సాధారణ రూం టెంపరేచర్ లో ఉన్న పండ్లు తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

సాధారణంగా అందరూ చేసే తప్పులు

చాలా మంది మహిళలు పీరియడ్స్ సమయలో క్రేవింగ్స్ (ఏదైనా తినాలని ఆతృత) వచ్చినప్పుడు ఏదైనా తినేస్తారు. తీపి లేదా ప్రాసెస్డ్ స్నాక్స్ ఎక్కువగా తినడం వల్ల కడుపులో తిమ్మిరి, వాపు, మూడ్ స్వింగ్స్ పెరుగుతాయి. అందుకే క్రేవింగ్స్ కంట్రోల్ చేసి మంచి ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలి.

పీరియడ్స్ సమయంలో తినాల్సిన మంచి పండ్లు

తేలికపాటి, నీటి శాతం ఎక్కువ ఉన్న పండ్లు తినాలి. వాటర్‌మెలన్ (పుచ్చకాయ), అరటి, ఆపిల్ వంటి పండ్లు వాపును తగ్గించి శరీరాన్ని ఫ్రెష్‌గా ఉంచుతాయి. ఇవి జీర్ణక్రియకు సహాయపడి అవసరమైన పోషకాలు అందిస్తాయి.

ఇతర ఆహార చిట్కాలు

తగినంత నీరు తాగండి. మసాలా, ప్రాసెస్డ్ అధిక చక్కెర ఆహారాలు తినకుండా జాగ్రత్తగా వహించండి. ఐరన్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోండి. కూరగాయలు, గింజలు, ప్రోటీన్లు ఆహారంలో చేర్చండి.

ముఖ్య గమనిక: ఈ వ్యాసంలో ఉన్నది సాధారణ సమాచారం మాత్రమే.  ఋతుస్రావం సమయంలో తీవ్ర సమస్యలు ఉంటే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×