E-Paper
Advertisement

Acne: ఈ పండ్లు తిన్నారంటే మొటిమల సమస్య మరింత పెరిగిపోతుంది

Acne: ఈ పండ్లు తిన్నారంటే మొటిమల సమస్య మరింత పెరిగిపోతుంది
Advertisement

మొటిమలు ఇప్పుడు చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. టీనేజర్లు మాత్రమే కాదు, పెద్దవాళ్లలో కూడా ఈ సమస్య కనిపిస్తోంది. కాలుష్యం, ఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్ మార్పులు కారణాలుగా ఉంటాయి. అయితే ఆహారం కూడా చర్మంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని పండ్లు ఎక్కువగా తింటే మొటిమలు పెరిగే అవకాశం ఉందని తాజా సమాచారం చెబుతోంది. ఆరోగ్యానికి మంచివే అయినా, కొందరి శరీర తత్వానికి అవి సరిపోకపోవచ్చు అంటున్నారు.

అరటి పండ్లు
అరటిపండ్లు చాలా మంది ప్రతిరోజూ తింటారు. వీటిలో సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బాగా పండిన అరటిపండ్లు రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచే అవకాశం ఉంది. దాంతో శరీరంలో ఆయిల్ ఉత్పత్తి పెరిగి మొటిమలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే మామిడి పండ్లు కూడా కొందరిలో స్కిన్ సమస్యలు పెంచవచ్చని చెబుతున్నారు. వేసవిలో మామిడిని ఎక్కువగా తినే వారు చర్మంలో మార్పులు గమనించాలని సూచిస్తున్నారు.

Advertisement

ద్రాక్ష పండ్లు
ద్రాక్ష పండ్లలో కూడా చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా తింటే ఇన్సులిన్ స్థాయిపై ప్రభావం పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల కొందరిలో మొటిమలు పెరగొచ్చు. అలాగే పండ్ల రసాలు కూడా జాగ్రత్తగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా మార్కెట్‌లో దొరికే ప్యాకెట్ జ్యూసుల్లో అదనపు చక్కెర కలుపుతారు. ఇవి చర్మ సమస్యలను మరింత పెంచే ప్రమాదం ఉంది. అందుకే సహజ రూపంలో పండ్లు తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

నారింజ పండ్లు
నారింజ, ముసంబి వంటి సిట్రస్ పండ్లు చాలా మందికి ఉపయోగకరమే. కానీ సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారిలో ఇవి కొన్నిసార్లు ఇరిటేషన్ కలిగించవచ్చని చెబుతున్నారు. ముఖం ఎర్రబడటం, చిన్న చిన్న మొటిమలు రావడం వంటి సమస్యలు కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా పరిమితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. వీటిలో సహజ చక్కెర కేంద్రీకృతమై ఉంటుంది. ఎక్కువగా తింటే చర్మంపై ప్రభావం చూపవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

అయితే ప్రతి ఒక్కరికీ ఇదే పరిస్థితి వస్తుందని కాదు. ప్రతి మనిషి శరీర తత్వం వేరుగా ఉంటుంది. కొందరికి ఏ పండ్లు తిన్నా సమస్య రాకపోవచ్చు. మరికొందరికి కొన్ని ప్రత్యేక ఆహారాలు మొటిమలను పెంచవచ్చు. అందుకే ఏది తిన్న తర్వాత స్కిన్‌లో మార్పులు వస్తున్నాయో గమనించడం ముఖ్యం. సరైన నిద్ర, ఎక్కువ నీరు, శుభ్రమైన ఆహారం, ఒత్తిడి తగ్గించడం కూడా చర్మ ఆరో్యానికి చాలా అవసరం. సమస్య ఎక్కువగా ఉంటే చర్మ వైద్యుడిని సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×