Cooking Oil Truths: ఆరోగ్యంగా ఉండాలని, గుండె సమస్యలు రాకూడదని చాలా మంది విపరీతమైన ధరలు పెట్టి ‘ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్’ లేదా ‘హెల్దీ రిఫైన్డ్ ఆయిల్స్’ కొంటారు. అయితే మార్కెట్‌లో లభించే ఆలివ్ ఆయిళ్లలో దాదాపు 70 శాతానికి పైగా నకిలీవి లేదా కల్తీ చేసినవేనని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్న సంచలన నిజం మీకు తెలుసా? మనం రోజువారీ వంటల్లో వాడే నూనె నిజంగా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందా లేక నెమ్మదిగా రోగాల బారిన పడేస్తుందా? కుకింగ్ ఆయిల్స్ వెనక ఉన్న నగ్న సత్యాలు, నిజమైన నూనెను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రిఫైన్డ్ ఆయిల్ అనగానే చాలా మంది కళ్ళు మూసుకుని కొనేస్తుంటారు. అయితే నాణ్యత లేని ఆయిల్‌లో సోయాబీన్, పామాయిల్, లేదా సన్‌ఫ్లవర్ ఆయిల్‌లను కలిపి, ఆకుపచ్చ రంగు, ఇతర పదార్థాలు కలిపి ‘ప్యూర్ ఆయిల్’ పేరుతో అమ్ముతున్నారు.
ఇంట్లోనే ప్యూర్ ఆయిల్‌ను గుర్తించే చిన్న ట్రిక్:
మీరు కొన్న ఆయిల్ బాటిల్‌ను ఒక రోజంతా ఫ్రిజ్‌లో (ఫ్రీజర్‌లో కాదు) ఉంచండి. అది నిజమైన ఆయిల్ అయితే గడ్డకట్టుకుపోతుంది లేదా చిక్కగా మారుతుంది. ఒకవేళ అది ద్రవ రూపంలోనే ఉంటే అందులో కల్తీ నూనెలు కలిసి ఉన్నాయని అర్థం.
రిఫైన్డ్ ఆయిల్స్:
ఇక మన ఇళ్లలో వాడే సాధారణ రిఫైన్డ్ ఆయిల్స్ (సన్‌ఫ్లవర్, సోయాబీన్, కాటన్ సీడ్) తయారీలో కెమికల్స్, బ్లీచింగ్ ఏజెంట్లు, విపరీతమైన వేడిని ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియ లో నూనె లో ఉండే పోషకాలన్నీ నశించిపోతాయి. వీటిని నిత్యం వాడటం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ పెరిగి గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి.
Also Read: జీరో కేలరీస్ అని తాగుతున్నారా? ‘షుగర్ ఫ్రీ డ్రింక్స్’ చేసే అసలు నష్టం ఇదే!
బెస్ట్ ఆల్టర్నేటివ్:
మన పూర్వీకులు వాడిన గానుగ నూనెలు (కట్టె గానుగ ఆడించిన నూనెలు) ఆరోగ్యానికి బెస్ట్. ఎలాంటి రసాయనాలు, విపరీతమైన వేడి ఉపయోగించకుండా విత్తనాల నుంచి నూనె తీయడం వల్ల అందులోని సహజ సిద్ధమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు అలాగే ఉంటాయి. వేరుశనగ గానుగ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనెలు మన వంటకాలకు పర్‌ఫెక్ట్‌గా సరిపోతాయి. అందుకే వీటిని వాడటం చాలా మంచిది.
‘రిఫైన్డ్’ లేదా ఫేక్ ‘ఆలివ్ ఆయిల్’ అనే అట్రాక్టివ్ లేబుల్స్ చూసి మోస పోకండి. ప్రాసెస్ చేసిన నూనెలకు దూరంగా ఉండి, స్థానికంగా లభించే శుద్ధ మైన గానుగ నూనెలను వాడటం అలవాటు చేసుకోండి. సరైన నూనెను ఎంచుకోవడం ద్వారా మీ కుటుంబాన్ని గుండె జబ్బులు, బీపీ, అధిక బరువు నుంచి చాలా వరకు కాపాడు కోవచ్చు. అంతే కాకుండా క్యాన్సర్ వంటివి రాకుండా ఉండేలా జాగ్రత్త పడవచ్చు. అందుకే ధర ఎక్కువయినా కూడా గానుగ నూనెలు వంటకాల తయారీ లో వాడటం అలవాటు చేసు కోవడం ఆరోగ్యానికి మంచి దని నిపుణులు చెబు తున్నారు.