E-Paper
Advertisement

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!
Advertisement

Egg Benefits: ఈ రోజుల్లో హెల్తీగా ఉండటం అనేది ఒక టాస్క్ అయిపోయింది. అయితే, మన వంటింట్లోనే ఉండే ఒక చిన్న ‘సూపర్ ఫుడ్’ మన ఆరోగ్యాన్ని మార్చేయగలదంటే నమ్ముతారా? అవును.. అదేనండీ ‘గుడ్డు’. రోజుకో గుడ్డు తినమని డాక్టర్లు ఎందుకు చెబుతారో తెలుసా? ఎందుకంటే అది కేవలం ఆహారం కాదు.. ఒక కంప్లీట్ విటమిన్ బ్యాంక్ కాబట్టి

ఒక చిన్న సైజు విటమిన్ ఫ్యాక్టరీ!

Advertisement

చాలామంది గుడ్డు అనగానే కేవలం ప్రొటీన్ మాత్రమే అనుకుంటారు. కానీ అందులో ఒక పవర్‌హౌస్ దాగుంది. ఒక సాధారణ గుడ్డు నుంచి మనకు 6-7 గ్రాముల హై-క్వాలిటీ ప్రొటీన్ అందుతుంది. దీనితో పాటు 5 గ్రాముల కొవ్వు, బాడీకి కావలసిన విటమిన్ ఎ, విటమిన్ డి, మరియు బి-కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా దొరుకుతాయి.

అంతేకాదు, కంప్యూటర్లు, మొబైల్స్ చూసి అలసిపోయే మన కళ్లను కాపాడే ల్యూటీన్ (Lutein), జియాగ్జాంతీన్ (Zeaxanthin) వంటి అద్భుతమైన యాంటీఆక్సిడెంట్లు కూడా ఇందులో ఉన్నాయి. మెదడు చురుగ్గా పనిచేయడానికి తోడ్పడే కొలీన్ కూడా గుడ్డులో మెండుగా ఉంటుంది.

Advertisement

ఆ పచ్చసొన భయం పక్కన పెట్టేయండి!

గుడ్డు అనగానే చాలామంది లావైపోతామేమో అని కేవలం వైట్ (తెల్లసొన) మాత్రమే తిని, ఎల్లో (పచ్చసొన)ను పక్కన పడేస్తుంటారు. పచ్చసొనలో ఫ్యాట్ ఉన్న మాట నిజమే కానీ.. అందులోని మెజారిటీ ఫ్యాట్ అన్‌సాచ్యురేటెడ్ (Unsaturated Fat) రకానికి చెందింది. అంటే ఇది గుండెకు మేలు చేసే ‘మంచి కొవ్వు’ అన్నమాట. కాబట్టి బరువు తగ్గే డైట్‌లో ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా హోల్ ఎగ్ తినేయొచ్చు.

గుడ్డు తింటే అలర్జీనా? ఆ కన్ఫ్యూజన్‌కు చెక్ పెట్టండి!

కొందరికి గుడ్లు తింటే అస్సలు పడదు. చిన్న పిల్లల్లో దాదాపు 2% మంది ఈ సమస్యను ఎదుర్కొంటారు. గుడ్డులో ఉండే ఓవల్బుమిన్, ఓవోట్రాన్స్‌ఫెరిన్, లైసోజోమ్‌ వంటి ప్రొటీన్లు పడకపోవడం వల్లే బాడీ రియాక్ట్ అవుతుంది. దీనివల్ల ఒంటిపై దద్దుర్లు రావడం, వాపు, దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తాయి.అయితే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే.. ఐదేళ్లు వచ్చేసరికి సగం మంది పిల్లలు, అలాగే 16 ఏళ్లు వచ్చేసరికి 70% మంది పిల్లలు ఈ అలర్జీ నుంచి సహజంగానే కోలుకుంటారు.

అలర్జీకి, ఇన్‌టాలరెన్స్‌కు తేడా ఏంటి?

పిల్లలు గుడ్డు తిన్న 48 గంటల తర్వాత విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి వంటి ఇబ్బందులు పడితే.. అది అలర్జీ కాదు. అది కేవలం జీర్ణం కాకపోవడం (ఇన్‌టాలరెన్స్) మాత్రమే. పిల్లల్లో రోగనిరోధక శక్తి కాస్త పెరిగాక, అంటే ఏడాది వయసు వచ్చేటప్పుడు మెల్లమెల్లగా గుడ్డును అలవాటు చేస్తే అసలు ఇలాంటి సమస్యలే రావని నిపుణులు చెబుతున్నారు.

పచ్చి గుడ్డు తాగుతున్నారా? అయితే ప్రమాదంలో పడ్డట్టే!

సినిమాల్లో హీరోలు బాడీ బిల్డింగ్ కోసం పచ్చి గుడ్లను గ్లాసులో పోసుకుని తాగేయడం చూసి.. రియల్ లైఫ్‌లో చాలామంది అలాగే ట్రై చేస్తుంటారు. పచ్చి గుడ్డు తింటే ఎక్కువ బలం వస్తుందనేది కేవలం ఒక భ్రమ మాత్రమే.నిజానికి పచ్చి గుడ్లలో సాల్మోనెల్లా (Salmonella) అనే డేంజరస్ బ్యాక్టీరియా ఉండే అవకాశం చాలా ఎక్కువ. ఒకవేళ ఆ బ్యాక్టీరియా మన కడుపులోకి వెళ్తే.. తీవ్రమైన కడుపునొప్పి, మోషన్స్, హై-ఫీవర్‌తో బెడ్ ఎక్కాల్సి వస్తుంది. పైగా పచ్చి గుడ్డు కంటే ఉడికించిన గుడ్డులోని ప్రొటీన్‌ను మన శరీరం చాలా ఈజీగా, వేగంగా అబ్జార్బ్ చేసుకుంటుంది.

ఎలా తింటే బెస్ట్?

గుడ్డును హ్యాపీగా ఉడికించుకుని (Boiled Egg) తినడం లేదా లైట్‌గా ఆయిల్ వేసి ఆమ్లెట్/అట్టుగా వేసుకుని తినడమే అన్నిటికంటే బెస్ట్ అండ్ సేఫ్ మార్గం. దీనివల్ల బ్యాక్టీరియా చనిపోతుంది, పోషకాలు వృథా కాకుండా బాడీకి అందుతాయి. సో.. రేపటి నుంచి మీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక ఎగ్ ఉండేలా ప్లాన్ చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి.

Also read :నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×