E-Paper
Advertisement

మీ పిల్లల పళ్లు పుచ్చిపోతున్నాయా? చిన్నారుల దంతక్షయం నివారణకు డాక్టర్ టిప్స్

మీ పిల్లల పళ్లు పుచ్చిపోతున్నాయా? చిన్నారుల దంతక్షయం నివారణకు డాక్టర్ టిప్స్
Advertisement

పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వారికి ఆరోగ్యకరమైన దంతాలు ఉండడం చాలా ముఖ్యం. చాలామంది పిల్లలకు చిన్న వయసులోనే దంత క్షయం (కావిటీ) అంటే దంతాలు కుళ్లి సమస్యతో బాధపడుతున్నారు. చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ నిమిషా ఆరోరా ప్రకారం.. నోటి శుభ్రతగా సరిగా లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు ఈ సమస్యలను పెంచుతాయి. తల్లిదండ్రులు పిల్లల దంతాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తారు. చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లు పాటిస్తే భవిష్యత్తులో దంత సమస్యలను నివారించవచ్చు.

శిశువు దశ నుంచే నోటి సంరక్షణ ప్రారంభించండి

మొదటి పంటి రాకముందే నోటి సంరక్షణ ప్రారంభించాలి. శిశువుల చిగుళ్లను మృదువైన గుడ్డతో శుభ్రం చేయాలి. ఇది బ్యాక్టీరియాను తొలగించి నోటిని తాజాగా ఉంచుతుంది. పళ్లు వచ్చిన తర్వాత మృదువైన బ్రష్‌తో శుభ్రం చేయాలి. చిన్నప్పటి నుంచి ఈ అలవాటు పిల్లల్లో మంచి దంత సంరక్షణ అలవాటును పెంచుతుంది.

సరైన బ్రషింగ్ అలవాటు చేయండి

Advertisement

పిల్లలు రోజుకు రెండు సార్లు (ఉదయం, రాత్రి) పళ్లు బ్రష్ చేయాలి. రెండు నిమిషాలు జాగ్రత్తగా ప్రతి పంటిని శుభ్రం చేయాలి. ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్ ఉపయోగించడం మంచిది. పిల్లలు సరిగ్గా బ్రష్ చేయడం నేర్చుకునే వరకు తల్లిదండ్రులు పర్యవేక్షించాలి.

తీయని ఆహారాలు, పానీయాలు తగ్గించండి

చాక్లెట్, క్యాండీలు, సాఫ్ట్ డ్రింక్స్, జ్యూస్‌లలో చక్కెర ఉండడంతో దంతాలకు చాలా హానికరం. షుగర్ వల్ల బ్యాక్టీరియా పెరిగి కావిటీలు తెస్తుంది. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్ నట్స్ వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ ఇవ్వాలి.

నీళ్లు ఎక్కువగా తాగేలా చూడండి

Advertisement

నోటిలో మిగిలి ఉన్న ఆహార కణాలు, పేరుకుపోయిన నీళ్లు బ్యాక్టీరియాను కడిగేస్తాయి. ఎంగిలి ఉత్పత్తిని పెంచి దంతాలను రక్షిస్తాయి. నిద్రపోయే ముందు చక్కెర ఉండే తీయని పానీయాలు పిల్లలకు ఇవ్వకూడదు.

నోట్లో పాల బాటిల్‌‌తో నిద్రపోకుండా చూడండి

పిల్లలు నోట్లో పాల బాటిల్‌తో నిద్రపోవడం వల్ల దంతాలపై పంచదార ఎక్కువసేపు ఉండి కావిటీలు వస్తాయి. నిద్రపోయే ముందు నోటిని శుభ్రం చేయాలి. ఒకటి రెండు సార్లు పొక్కిలి చేయాలి.

క్రమం తప్పకుండా డెంటల్ చెకప్ చేయించండి

ప్రతి ఆరు నెలలకొకసారి డెంటిస్ట్‌ను చూపించాలి. చిన్న సమస్యలను ముందుగా గుర్తించి చికిత్స చేయవచ్చు. దీని వల్ల పిల్లలు తరుచూ డెంటిస్ట్‌‌ని చూసి భయపడరు.

ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు నేర్పండి

కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలు (పాలు, పెరుగు, చీజ్, కూరగాయలు) దంతాలను బలపరుస్తాయి. క్రంచీ పండ్లు మరియు కూరగాయలు దంతాలను సహజంగా శుభ్రం చేస్తాయి.

టూత్ బ్రష్ క్రమం తప్పకుండా మార్చండి

పాత బ్రష్‌లు సరిగ్గా శుభ్రం చేయవు. ప్రతి 3 నెలలకొకసారి బ్రష్ మార్చాలి.

Also Read: చాణక్య నీతి.. జీవితంలో విజయం సాధించాలంటే ఈ విషయాల్లో సిగ్గుపడకూడదు..

దంత సంరక్షణ పిల్లలకు ఒక గేమ్‌లా చేయండి

రంగురంగుల బ్రష్‌లు, పాటలు, రివార్డులతో బ్రషింగ్‌ను ఆసక్తికరంగా చేయాలి. ఇలా చేస్తే పిల్లలు స్వేచ్ఛగా బ్రష్ చేస్తారు.

పిల్లల దంత సంరక్షణ చిన్నప్పటి నుంచి ప్రారంభించాలి. సరైన బ్రషింగ్, తక్కువ చక్కెర, నీళ్లు తాగడం, క్రమం తప్పకుండా డెంటల్ చెకప్ వంటి అలవాట్లు.. కావిటీలు, కుళ్లను నివారిస్తాయి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×